Friday, December 16, 2011 - 11 comments

నేస్తమా నీ చిరునామా ఎందుకు ?

నా కంటి నిండా నీవే అయినప్పుడు 
మెరిసే అద్దం లో నీ ప్రతి బింబం ఎందుకు ?
 తలచిన ప్రతి తలపు నీవే అయినప్పుడు 
తలుపు తట్టేందుకు నీ ఇంటి నెంబర్ ఎందుకు ?
జీవనయానంలో వేగుచుక్క నీవైనప్పుడు 
కిందా మీద  లోకంలో ఎనిమిది దిక్కులెందుకు  ?
ఓటమి ఎరుగని నా లక్కి  నెంబర్ నీవైనప్పుడు 
కోడ్ నంబర్ తో  సహా నీ ఫోన్ నెంబర్ ఎందుకు ?
ఒక్క మాటలో చెప్పాలంటే నా ఎద నిండా నీవే అయినప్పుడు 
నేస్తమా నీ చిరునామా  ఎందుకు  ?

Thursday, December 1, 2011 - 24 comments

నా ప్రేమ కథ ...
                       అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆ రోజు సెప్టెంబర్ 9  నేను ఆఫీసు పని మీద ముంభై వెళ్తున్నాను నేనెప్పుడు రైలు ప్రయాణం చేసినా  నాకు  ఏదో సందర్భం గుర్తుంటుంది కాని ఈ  ప్రయాణం మాత్రం నా జీవితంలో తీపి జ్ఞాపకంగా మిగిలి పోతుందనుకోలేదు, అంతగా ప్రభావితం  చేసినా ఆ సంఘటనను మర్చిపోలేను కూడా....
                             
                               ఎప్పటి లాగానే స్టేషన్ అంత రద్ధిగానే ఉంది, ట్రైన్  కోసం ఎదురు చూస్తున్న నాకు సమయం గడవటం భారంగా అనిపిచింది. అలా  ట్రైన్ కోసం ఎదురు చూసి విసుగు పుట్టి అలా అలా  పచార్లు చేస్తున్న సమయం లో నాకెదురుగా  ఉన్న ఫ్లాట్ఫారం పై కన్పించింది  తను, అంతే తనని చూడగానే ఒక్క సరిగా స్పృహ కోల్పోయినట్లనిపించింది..అప్పటి వరకు రద్దిగా కన్పించిన రైల్వే స్టేషన్  కాస్త తనని చూడగానే నిర్మానుష్యంగా మారిపోయింది...తను తప్ప ఇంకేమి కనిపించలేదు నాకు,
అల్లంత దూరంలో  అటు వైపు తను, తనని చూస్తూ నేను, కళ్ళు మూస్తే ఎక్కడ మిస్ ఆవుతుందొనని  కళ్ళార్పకుండా అలాగే చూస్తున్నాను, అలా ఎంత సేపు చూస్తున్నానో తెలియదు, ఉన్నట్లుండి తనలో  ఏదో కదలిక అది కూడా నా వైపే...
                                
                                      అప్పుడు మొదల్లైంది నాలో అలజడి....! తను నన్ను సమీపిస్తున్న కొద్ది గుండె తీవ్రత పెరిగి పోతుంది, గుండె కవాటాలు పేలిపోతాయేమోనన్నంత  భారంగా మారింది. సాధారణంగా గుండె నిముషానికి 72 సార్లు కొట్టుకోవటం విన్నాను కాని తొలిసారి 720 సార్లు   కొట్టుకోవటం నా చెవులారా  విన్నాను, తను నన్ను చూస్తూ దాటుకుంటూ వెళ్లిపోయింది చూపులతో మాయే చేసిందో లేక మంత్రమే వేసిందో తెలీదు  కాని అదేదో సినిమాల్లోలాగా నాలోని మరో నేను తన వెంటే తన నీడ లాగ వెళ్తుంది... తను నా నుండి వెళ్తోంది  దూరంగా, అలాగే నాలోని మరో నేను తన  వెంటే పరుగు తీస్తుంది  భారంగా....

                               నేను మాత్రం అక్కడే నిర్జీవంగా నిస్సత్తువతో  నిల్చుని తను వెళ్ళిన దారినే చూస్తుండిపోయాను, ఆ "మాయా " లోకం నుండి రావటానికి చాలా  సమయం పట్టింది,అంత లోపు నా ట్రైను కూడా నన్ను ఒంటరిని చేసి వెళ్లి పోయింది... ఎలాగోలా కష్టపడి ముంబై  చేరుకున్నాను, కాని  ధ్యాసంతా తన పైనే, మనసు మనసులో లేదు, అక్కడి నుండి  వచ్చాక కూడా అంతే ఎ మాత్రం మార్పు  లేదు..అంత కొత్తగా  వింతగా  విచిత్రంగా కన్పిస్తున్న్నాయి , పెన్ను పట్టి పదాలు సరిగా రాయలేని నేను తొలిసారి తన బొమ్మ గీసాను అచ్చం తన లాగే మల్లి గీసాను, మల్లి గీసాను, గీసిన ప్రతి సారి తన అందమైన చిరునవ్వే  ఉట్టి పడుతుంది.రోజులు గడుస్తున్నాయి కాని తను మాత్రం  మళ్ళి కన్పించలేదు, కన్పిస్తున్నదల్లా  తన ముఖం  నా మనసులో జ్ఞాపకాలు నా గుండెల్లో... తనని  చూసింది కొద్ది క్షణాలే కాని ప్రతి క్షణం తను నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది   తనతో సాన్నిహిత్యం కోసం నా మనసు పరితపిస్తూ  పరిబ్రమించిపోతోంది.


 ప్రేమలో పడితే ఇంతేనేమో....!  

                           అనుకోకుండానో యాదృచ్చికంగానో తెలీదు కాని సరిగ్గా రెండు సంవత్సరాల తరువాత  నా జీవితం లో గొప్ప మలుపు. ఆ రోజు నేను బలవంతంగా అ ఇష్టంగా నేనొక చోటికి వెళ్ళాను, నేనారోజు ఆ చోటికి వేళ్ళకుండా ఉండి ఉంటే మళ్ళి నేను తనని చూసే వాడిని కాదేమో, అలాగే  మళ్ళి  నాలోని మరో  నేనును నాలో మిళితం చేసుకునే వాడిని కాదేమో...
నిజంగా నేనక్కడికి వెళ్ళకుండా ఉండి ఉంటే నా జీవితాన్నే కోల్పోయేవాడ్నేమో....! 
అటువంటి మరపురాని, మరచిపోలేని  మలుపది. సర్వం కోల్పోయినా సునామి భాదితుడిలా బ్రతుకుతున్న నాకు ఎడారిలో ఒయాసిస్సులా మళ్ళి తను కన్పించింది... 


అవును  నేను మళ్లీ తనని చూసాను అది కూడా నాకు అతి దగ్గరగా అందంగా ముస్తాబై  కూర్చొని  ఉన్న పెళ్లి కూతురి స్థానంలో...,
 నా పెళ్లి చూపుల్లో......


                                                      -నందు Monday, November 28, 2011 - 2 comments

జగమెరిగిన సత్యం

ప్రేమ గురించి నేనెప్పుడు రాయటం మొదలెట్టిన  అది రెండు మనసుల మద్య జరిగే  మదురమైన  చర్యగా భావించేవాడ్ని కాని ఈ ప్రేమ పుట్టటానికి ఎంత బలమైన కారణం ఉంటుందో విడిపోవటానికి అంతే బలీయమైన కారణం ఉంటుందని ఈ మద్య నేను ఊహించని నిజం....  
Tuesday, November 22, 2011 - 2 comments

ఓ ప్రేమ...ఏముంది నీలో ?ప్రేమ... ప్రేమ... ప్రేమ...
అసలు ఎవరు నీవు ?
ఏముంది నీలో ?
నీవేమైన రూపానివా మరి కనిపించవెందుకో ?
మరి ఎందుకు ఈ భూప్రపంచమంతా  నీ చుట్టే తిరుగుతుంది ?

నీవేమైన బందానివా, అనుబందానివా ?
ప్రతి రోజు నీ నా స్మరణే చేస్తుంటాము ఎందుకని ?
నీ ప్రేమలో ఐన్ స్టీన్ కి   అందని శక్తి  ఉందా ?
నీలో గెలీలియో గాలలకి కూడా అందని గాడత  ఉందా ?
 అణువులు ,పరమాణువుల సమ్మేళనం లో 
కంటికి కూడా కనిపించని కణాల మిళితంలో  
అన్ని రకాల భావనలను,
మనసుని కూడా మనుసులో ఇముడ్చుకున్న 
ఆదునిక యుగపు మరయంత్రానివా ?
మరి ఏముంది నీలో ?
 ఎందుకింత ఆరాటం  ?

p.s:
ప్రేమ సమాదానం: నాలో అంతులేని,అంతంలేని ప్రేముంది కాబట్టే దాన్ని అందుకోటానికి  మీ ఆరాటం 

                                                -నందు 

Thursday, October 27, 2011 - 5 comments

నిజమేమో...

రెండు మనసుల  మద్య మనస్పర్ధలు రావటానికి,
 రెండు  దేశాల మద్య  విబేధాలు రావటానికి 
పెద్ద పెద్ద గొడవలు, చిన్న చిన్న యుద్దాలు జరగనక్కర్లేదేమో...
వారి మద్య ఏకాభిప్రాయం కుదరకపోయినా చాలేమో....

                                                -నందు 

                                         
Friday, October 14, 2011 - 0 comments

ప్రేమ పుట్టుక


మనం ఎవ్వరినైన ప్రేమించాలని నిర్ణహించుకుంటే  ప్రేమ పుట్టదు... 

ప్రేమంటే ఎవ్వరినో మనసులో ఊహించుకుని ప్రేమించటం కాదు...
అలాగని ఎదుటి వారు  మనల్ని  మనం  ప్రేమిస్తున్నారని మనమ ప్రేమించటం కాదు..
ప్రేమంటే మనకు తెలియకుండానే మనం తన ధ్యానంలో లీనం అవ్వటం...
మనకు తెలియకుండానే  మనలో మార్పు 
మన  హృదయాంతరాళం లో   ఏదో అలజడి.... 
మనసుకు మాత్రమే అర్థం అయ్యి అర్థం కాని  స్పందనలు......
మాటన్నది మార్చి పోయి కళ్ళతోనే కోటి భావాలు ప్రకటించే కొత్త రకపు భాష  మొదలవుతుంది...
 అదే ప్రేమంటే....
ఆకలన్నది మార్చిపోయి నీకోసం ఆరాటపడుతుంది. 
నీ నుండి నీ నడకను వేరు చేసి తను వెళ్ళే దారినే వెంబడిస్తుంది...
ప్రేమంటే తన గురించి పూర్తిగా మర్చిపోయి తనలో ఇక్యం అయి నీకోసం ఆరాటపడేది 
 అనుక్షణం నీగురించే ఆలోచించేది.... 
ఇవే ప్రేమ పుట్టుకకి ఆనవాళ్ళు...
చివరికి తను తనిపోయిన తన మది నిండా బ్రతికున్నవి  నీ గురించిన ఆలోచనలే.... నందు
Sunday, September 25, 2011 - 9 comments

తొలి చూపులో నిజమైన ప్రేమ...
మనం చాలా సిమాలలో చూసి ఉంటాం కదా హీరోగాని  హీరొయిన్ గాని
 ఎవరో ఒకరు చూసినప్పుడు వారు వారిలో ఒక రకమైన ఫీలింగ్....
అదే మన చాలా సార్లు విని ఉంటాం "లవ్ ఎట్ ఫస్ట్ సైట్" అని ....
నిజంగా అలా తొలి చూపులో నిజమైన ప్రేమ పుడుతుందా ?
 ఒక వేళ పుట్టిన ఆ ప్రేమ నిజమైనదేనా ?
తొలి చూపులో నిజమైన ప్రేమంటే
మనకు తెలియకుండానే మనలో ఏదో ప్రకంపన...
మన హృదయ స్పందనలలోనే కాదు మన దేహం లో కూడా...
అలా  మొదలైన ఆ మార్పు తను కనిపించిన ప్రతి సారి కలిగితే....
అలాంటి ఆ తోలిచుపు ప్రేమ జీవితాంతం ఉంటే నిజంగా ఎంత బావుంటుందో కదా...
 అలాంటి ప్రేమను పొందిన వారు ఎంత గొప్ప అదృష్టవంతులో....
మీలో ఎవరైనా ఉన్నారా మరి ?


                                                              -నందు.
Tuesday, September 13, 2011 - 6 comments

మన స్నేహం
ఎన్ని జన్మల బంధమో మన పరిచయం...
ఎలా మొదలైందో ఆ క్షణం...
ఒకరికొకరు తెలియని మనం మన తొలినాళ్ళలో మాట్లాడుకోవాలనే  ఆశకాని
 పరిచయాలు పెంచుకోవాలనే  ఆత్రుత కాని  లేకుండేవి కదా...
ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లుగా నీ దారి నీది, నాదారి నాదిలా ఉండేది..
వహ్ !
క్రమంగా ఎంత మార్పు...
చూడగానే చిరునవ్వులు
హాయ్ అంటూ ఆహాకారాలు 
గంటల కొద్ది గ్రూప్ మీటింగులు
ఏ సందర్బము లేకుండానే పార్టీలు
క్లాసురూం  క్యాంటీన్ క్యాంపస్ అంత మన ప్రపంచమే కదా...
టిఫిన్ బాక్స్  లనే  కాదు, కష్టాలను కూడా పంచుకుంటిమి... .
గెలిచినప్పుడే కాదు గొడవలలో కూడా వీడిపోకపోతిమి...
తోడు నీడగా కంటికి  కునుకు లేకుండా ఎన్నో రాత్రులను ముచ్చట్లతో మున్చేస్తిమి...
సరదాలు పెరిగిన మన సాన్నియిత్యంలోఅల్లరితనంతో  పాటు
చేరవలసిన గమ్యాలను ఆచరించాల్సిన మార్గాలను కూడా నిర్దేశించుకుంటిమి,      
ఇవన్నీ ఇప్పటికి నా మది నిండా పదిలమే...
మారుతున్న కాలానికి తోడు పెరుగుతున్న బాద్యతల నడుమ 
సతమతమవుతున్న మనకి మన స్నేహమొక్కటే ఆలంబన...
 మనం ఎంత ఎదిగిన మనమెప్పటికి అలనాటి  మిత్రులమే....
నేస్తం ఇలాగే ఎప్పటికి నిలవాలి మన స్నేహం కలకాలం..... 

                                                               -నందు.

 
                                      
Saturday, September 10, 2011 - 4 comments

ఈ స్నేహం గొప్పది

స్నేహం దేవుడిచ్చిన గొప్ప వరాలలో ఒకటి...
ఎందుకంటే మన అమ్మ నాన్నలను ఆ దేవుడే నిర్ణహిస్తాడు 
 కాని మనకు మాత్రం మన  స్నేహితులను ఎంచుకునే అవకాశం కల్పిస్తాడు...
మనం ఎవరితోనైనా  స్నేహం చేసేటప్పుడు మనమేమి ఆశించం... 
అలాగని భవిష్యత్తుని అంచనా వేసి కూడా స్నేహం చేయము 
అప్పుడు ఆ సమయాన మన మనసులో కలిగే స్పందనల ద్వారా
మనకు  తెలియకుండానే వారి మీద మనకు ఒక రకమైన ఇష్టం ఏర్పడుతుంది
అక్కడి నుండి మొదలైన ఆ మజిలి 
మనల్ని ప్రపంచం వెలివేసినా  మన నేస్తం మనతో పాటే ఉండే అంత బలంగా పాతుకుపోతుంది.......
ఎల్లప్పుడూ మన మంచిని కోరుకుంటుంది
కష్టాలోచ్చిన కడదాక తోడుండేది...
తన కడుపు మాడ్చిన మన కడుపు నింపేది...
మనం గెలిస్తే ఎక్కువగా సంతోషించేది..
అన్నింటికీ నేనున్నానంటూ  ఎదురు నిలుస్తుంది...
అవసరమైతే ప్రాణ త్యాగాలకు కూడా వెనకడుగు వేయని నైజం ఈ స్నేహానిది...
అలాంటి గొప్పదనం గల ఈ బంధం... 
నీతో స్నేహం నాకేం లాభం అనే విధంగా మారుతున్న ఈ సమాజంలో 
కులమత భేదాలకతీతంగా  పేద ధనిక అనే దాపరికాలు లేకుండా 
పురాతనకాలంలో శ్రీ కృష్ణుడు కుచేలుడు
రాజుల కాలంలో అక్బరు బీర్బలు లాంటి వారి గొప్ప స్నేహాలు మనకి ఆదర్శం కావాలి 
నేస్తమా నీ మిత్రుల నుండి ఏదో ఆశించాలనే  వంకతో 
స్నేహం అనే పేరుతో  నమ్మకాన్ని నయవంచన చేయకు 
స్నేహనికున్న విలువను  పాడు చేయకు....

నేస్తం స్నేహం  గొప్పది...
                                                 -నందు.
Tuesday, September 6, 2011 - 3 comments

నా గురువులు పార్ట్-1నా గురువులను గురించి చాలా గొప్పగా రాయాలని ఉంది. కాదు, కాదు వారి గొప్పదనాన్ని గూర్చి రాయాలని ఉంది...
వారిని  గురించి రాయాలని నా మది కలవరపెడుతున్న వేళ, 
ఎలా మొదలెట్టాలో తెలియక నా మనసు సతమతమవుతుంది.
 నా మనసు అంతర్లీనంలో వారిని గూర్చి దాక్కొని ఉన్న భావాలను ఒక్క సారిగా మూట కట్టి బయటి ప్రపంచానికి పరిచయం చేయాలని ఉంది...
నా దృష్టిలో గురువంటే ఒక చదువు మాత్రమె చెప్పేవారు కాదు నైతిక విలువలను కూడా నేర్పగలగాలి...
గురువంటే మనకు చదువు చెప్పే వారే కాదు 
మనకు నాలుగు మంచి మాటలు చెప్పి మనం సక్రమ దారిలో నడవటానికి కారణం అయినా ఏ వ్యక్తి అయిన ఉండవచ్చు 
అమ్మ నాన్న  ఇలా మన జాబితాలో చాలా మందే ఉంటారు కాదు.....
మరి నాకెందుకో నా జీవితం కుటుంబసభ్యుల  కంటే నా గురువుల ప్రోత్సాహమే ఎక్కువగా ఉండింది(ఇంకా ఇప్పటికి కూడాను)...
దానికి కారణాలు నా కుటుంబ పరిస్థితులు కావొచ్చు, లేక మరేదయినా కారణం ఉండవచ్చు 
కాని నా జీవితం లో మాత్రం కొద్ది మంది గొప్ప గురువులను పొందాను అని  చెప్పుకోవటానికి ఇప్పటికి ఎప్పటికి గర్వపడతాను..
అంటే నా అబిప్రాయం లో మిగతావారు గొప్ప వారు కాదు అని నా ఉద్ద్యేశం కాదు కాని 
నాకెందుకో  వారితో అబిప్రాయాలు కలవకపోవచ్చు, తప్పు మాత్రం వారిది కాదు సుమా...!  
గురువంటే చదువు చెప్పటం ఒక్కటే కాదు అని నేను నా స్కూల్ రోజులనుండి జరిగిన పరిణామాల నుండి గ్రయించాను... 
నిజంగా వారికెంత ఓపిక ఉంటుందో మన గురించి ప్రత్యేక శ్రద్ధ  తీసుకోవటానికి మన బాగోగులు పట్టించుకోవటానికి....
ఒక పుస్తకం గొప్పగా ఉండాలంటే అందులోని ప్రతి వాక్యం అద్బుతంగా ఉండాల్సిన అవసరం లేదు, అందుకో కొన్ని భావున్న చాలు
అలాగే నా గురువులు గొప్పవారు అని చెప్పుకోవటానికి వారు అన్నిట్లోనూ గొప్ప వారు కాకపోవచ్చు కాని గొప్ప మనసున్న మనుషులు...
మనమేమి సాదించము వారి నుండి కాని వారు చూపే మార్గాల ద్వారా సాదించే లక్షణాలను పొందుతాము...
ఇప్పటికి నేనేమి సాదించకపోవచ్చు కాని సాధించటానికి అవసరమైన మార్గాన్ని శక్తిని మీ నుండే పొందాను....

కనీసం నేనీస్థితిలో ఉండటానికి కారణం వారేనని  నేను ప్రత్యేకంగా చెప్పలేను ఎందుకంటే ముమ్మాటికి ఇది వారి చలవే... 
Monday, September 5, 2011 - 4 comments

గురువులకి...


ఓ గురువులారా మీకు శతకోటి వందనం.....
ఏమిచ్చి తీర్చుకోగలం మీ ఋణం...
మాలోని శక్తిని వెలికి తీసిన ఆధునిక  ఐన్ స్టీన్ లు     
మా  చర్య ప్రతి చర్యలను గుర్తించే నూతన యుగపు న్యుటన్లు మీరు
మాకర్థం కాని సమస్యల చిక్కుముడులను విడదీసిన అపర చాణక్యులు 
మేము అల్లరి చేస్తే మందలించే మీరే 
మేము గెలిస్తే (విజయం) సాధిస్తే సంతోషించే  వారిలో ముందుండే కూడా అనే నిజాన్ని ఎలా మరువగలం..
మేం బాధల్లో ఉంటే దైర్యాన్ని నింపిన దేవదూతలు మీరు
మా కష్టాలను పంచుకున్న కరుణామయులు  మీరు...
మీ పిల్లలలాగే మమ్మల్ని ఆదరించిన ప్రేమమూర్తులు  మీరు...
మా భవిష్యత్తును కళ్ళముందు చూపిన కంప్యూటర్ యుగపు కాలజ్ఞానులు  మీరు...
మీ మాటలతో మాయ చేసి మీ వాక్చాతుర్యంతో మమ్మల్ని మంచి వైపుకు మార్చేసారు..
మేము బ్రతుకుతున్న ఈ జీవితం మీరు పెట్టిన ప్రసాదమే
మీరు లేని మా జీవితం శూన్యమే ఏనాటికి...
నిజంగా ఈ చలవంత మీదే ముమ్మాటికి... 

                               గురువులందరికీ నా ఈ చిన్ని  కవిత అంకితం          
                


నా గురువులను గురించి త్వరలో రాస్తాను...

                                                                                -నందు..
Friday, August 26, 2011 - 3 comments

వీడిపోతే విలువ తెలుస్తుందా ?


మనకి ఇలాంటి సందేహం చాలా సార్లు కలిగి ఉంటుంది కదా
 కనీసం ఒక సారయిన  మనం మనసులో  అనుకుని ఉంటాం కదా...
ఒక్కోసారి ఏ కారణం లేకుండానే అ ప్రయత్నంగా మన కంటి నుండి కన్నిటీ  ధారా పడుతూనే ఉంది. 
తన సాహచర్యం లేకుండా ఈ జీవితాన్ని గడుపుతున్నందుకు...
ఇంకోసారి తన సాన్నిహిత్యంలో గడిపిన మధుర క్షణాలు  గుర్తుకు వచ్చినపుడు ఆనందభాష్పాల రూపంలో....
ఇలాంటి అనుభవాలు అనుభూతులు మనదగ్గేరెన్నో ఉండి ఉంటాయి కదా....
తన ఒడిలో కన్న బిడ్డను నిద్రపుచ్చే ఒక తల్లి  భూదేవిఒడిలో  నిదరోయినవేళ,
విద్యాబుద్దులు నేర్పిన గురువు చివరిసారిగా తన వీడ్కోలు సభలో ఉద్వేగంగా మాట్లాడుతున్న వేళ...
మనకన్ని తానే అయి  మననుండి ఏమి ఆశించకుండా ఆకస్మికంగా కన్ను మూసినా ఒక నేస్తాన్ని కడ సారి చూసిన వేళ....
జీవితాంతం తోడు ఉంటుందనుకున్న  ప్రేమ బంధం  కాలం వేసిన కాటుకి కనుమరుగైన వేళ....
ఇలాంటి జ్ఞాపకాలు మనదగ్గేరెన్నో...
వారెవరో తెలియకుండా మన పరిచయం మొదలవ్తుంది ఒక జ్ఞాపకాన్ని మాత్రం మిగులుస్తుంది..
వీడిపోతే వారి విలువ తెలుస్తుందని కాదు 
ఎందుకంటే మనకేందుకో మనం వారిని వీడిపోతామని వారికి దూరంగా ఉంటామనే  ఆలోచనే రాదు...

వీటన్నింటికి ఒకే ఒక కారణం 

అదే ప్రతి మనిషికి వీడ్కోలు ఒక భాగమేనని...
కాని మనం దీనికి ఒప్పుకోము  కాదా...
                                                 -నందు
Saturday, August 20, 2011 - 1 comments

ప్రపంచం పండగ చేసుకున్న వేళ....!


                                                                                        04-05-11


                                     (ఇది రాసి చాలా రోజులైంది కుదరక పోస్ట్ చేయలేదు)

ప్రపంచం  ఏంటి ఈ సమయం లో పండగ ఏమిటి అనుకుంటున్నారు కదా, 
 అదేనండి మన ముద్దుల బద్ద శత్రువు ఒసామా బిన్ లాడెన్ పోయాడు కదా అందుకు...
ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంతో మందికి నరకం చూపించిన ఒక కిరాతకుడిని మట్టుపెట్టినందుకు అందరు బాగా సంబరాలు చేసుకునట్లున్నారు...
సత్యభామ నరకాసురిడిని చంపినందుకు మన పూర్వికులు ఎలా గర్వించారో తెలిదు కాని, ఇప్పుడు ఏ ఒక్క అమెరికన్ ని చూసినా మన పుర్వికులా మొహాలాగే ఉంటాయేమో (అంటే గర్వం తో నిండి)...!
మన భారతీయులు కూడా బాగా సంతోషం లో ఉన్నట్లున్నారు, అమెరికా తరవాత బాగా నష్టపోయిన వారు  మన వాళ్ళే కాబట్టి....
ప్రపంచం మొత్తం మీద ప్రజలు ఎంత సంతోషంలో ఉన్నారో, అంత కంటే వంద రెట్ల సంతోషం లో ఒకే ఒక వ్యక్తి ఉండి ఉంటాడు...
ఆయనే అమెరిక ప్రెసిడెంటు "బరాక్ ఒబామా"....
మార్పు పేరుతో అమెరికన్ల మనసు మార్చి, శాంతి పేరుతో నోబెల్ బహుమతి  పొంది...
రోజు  రోజుకి ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో ఈ ఆపరేషన్ అనేది మరో ఐదేళ్ళు ఒబామా పాలనకు తొలిమెట్టుగా మనం అంగీకరించవచ్చు    
 ఏదేమయినా ఒక చదువుకున్న రాక్షసుడి శకం ముగిసింది.... 
శత్రుశేషం మిగలకుండా మిగిలిన వారిని కూడా మట్టుపెడితే మనం ప్రపంచ శాంతి కోసం వేరే ప్రత్యేక యాగాలు, యుద్దాలు లాంటివి చేయనవసరం లేదేమో.....
మరి ఇవన్నీ  జరిగినా మన పాలకులు మన శత్రువుల గురించి ఎం చేస్తున్నట్లో...
"కసబ్" లాంటి కసాయిలకు "కోట్లు" ఖర్చు  పెట్టి 'కోర్టు'ల  చుట్టూ  తిప్పటం తప్ప.....  
                                            -నందు
Thursday, August 18, 2011 - 6 comments

నిజమైన ప్రేమప్రేమ ఈ రెండక్షరాల పదం ఒక పెద్ద ప్రపంచానికి ప్రాణవాయువేమో   అంటే అతిశయోక్తి కాదేమో.....


నేను మొదట్లో ప్రేమ గురించి రాయటం మొదలెట్టినప్పుడు నాలో నాకే  తెలియని అనుభూతి..
ఏవో పెనవేసుకున్న భావాలు నాలో...


నేను ఊహించికుని రాస్తేనే ప్రేమ నిజంగా ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది అలాంటిది నిజమైన ప్రేమను పొందితే అదృష్టవంతులమే  
కదా...


ఈ మద్య కాలం లో మనం తరచుగా వింటున్న మాట నిజమైన ప్రేమ కనిపించట్లేదు దొరకట్లేదు అని....

అదేమన్న వస్తువా ?  వెతికి పట్టుకోవటానికి.... కాదు కదా...

నిజంగా మనం కొంత  మంది ప్రేమికులను చూస్తే  ఇది కూడా ప్రేమేనా అనే సందేహం కలగక మానదు...

అది వారికి (ఆ ప్రేమికులకి)బాగానే ఉండొచ్చు కాని మనకే నచ్చక  

పోవచ్చు.... 

ఇలాంటి ప్రేమలు మనకెన్నో కన్పిస్తూనే ఉంటాయి కదా...

ప్రేమంటే మనసుకి ముసుగులు తొడిగి మురిసిపోవటం కాదు...

నిజమైన  ప్రేమంటే మనం పొందే ప్రేమలో నిజాయితి ఎంత ఉందో 

గ్రహించటమే....

మనం ఎలా ఉన్న మనల్ని ఇష్టపడే కన్నవారి ప్రేమ,

నీలోని మంచితోపాటు చెడుని కూడా స్వీకరించే 

స్నేహితుడి  ప్రేమ

నువ్వెలా ఉన్న, నువ్వు మారినా కూడా తను మారకుండా నిన్ను నిన్నుగా ప్రేమించే వారి ప్రేమ... 

మనకు ఇష్టమైన వారు ఎంత దూరంగా ఉన్న వారి పైన 

ఇంచుక కూడా మారని మునుపటి ప్రేమ...

 ఇదే నిజమైన ప్రేమ..

ప్రేమ ఎప్పుడు కనిపిస్తుంది కాని, నిజమైన ప్రేమ కొన్ని 

సార్లే పుడుతుంది...

వర్షం ఎప్పుడు పడుతుంది కాని  వడగండ్ల వాన కొన్ని 

సార్లే పడుతుంది 


ఒడిసి పట్టుకోవటానికి సిద్దంగా ఉండు వడగండ్లని, 

నిజమైన ప్రేమని కూడా....
                        -నందు


Love Orkut Scraps, love quotes graphics and comments

Monday, August 15, 2011 - 5 comments

ఇదేనా స్వాతంత్ర్యం ? ఇదేమి స్వాతంత్ర్యం...

కొన్ని వందల ఏళ్ళ చరిత్ర గల ఒక గొప్ప దేశం లో పుట్టినందుకు గర్వపడాలో 


లేక ఇప్పుడున్న పరిస్థితులను తలుచుకుంటూ సిగ్గుపడాలో అర్థం కాని 


సమస్యగా మారింది.15th august independence day scraps greetings for orkut

కావాలి ఇటువంటి స్వేచ్చ 
పరాయి పాలనలో ఉన్న మన దేశాన్ని రక్షించుకోవటమ కోసం ఎంతో మంది 

త్యాగ ధనులు తమ ప్రాణాలు అర్పించి మరీ  మనకి ఈ స్వాత్రంత్ర్యాన్ని 

సంపాదించి పెట్టారు...

ఈ స్వాతంత్ర్యం సాధించిన తరవాత విషయాన్ని ఒక సారి మనం 

తలచుకుంటే అసలు మనం ఎటువంటి పరిస్థితులలో ఉన్నాము ?

మల్లి స్వాతంత్ర్యం కోసం పోరాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి...


మూడు దఫాలుగా సాగిన ఈ స్వాత్రంత్ర్య  సంగ్రామంలో

చివరి దశలో  సరైన నాయకత్వం లేక దారే తెలియని చీకటిలో ఉన్న మన

భారత దేశానికి  తానే ఒక  వెలుగై  దిక్కుని చూపిన గాంధి గారు, 

సత్యం, అహింసా అనే అస్త్రాలతో ఆంగ్లేయుల గుండెల్లో గుబులుపుట్టించిన 

ఒక మహామహనీయుడు కలలు కన్న  స్వరాజ్యం ఇదేనా ?

ఏ ఆశయం కోసం తెల్లవాళ్ళ లాటి దెబ్బలు రుచి చూసారో ?

ఏ స్వేచ్చ కోసం సత్యాగ్రహం చేసారో ?

అమర వీరులంత దేశాన్ని ఎలాంటి పరిస్థితులలో  చూడాలనుకున్నారో 

అందులో మనం మొదటి మజిలీ లోనే ఉన్నాం అదే స్వాతంత్ర్యం.....

నిజంగా మనకి స్వాతంత్ర్యం వచ్చిందా ?15th august independence day scraps greetings for orkut
                                                    ఇంకేన్నాల్లి  పేదరికపు దుస్థితి


ఈ ప్రశ కి  మన దగ్గర సరైన   సమాధానం లేదంటే ఆశ్చర్యపడనక్కర్లేదు....


ఎటు చూసిన దొంగలు దోపిడిదారులు వీరికి తోడు తీవ్రవాదులు...

హర్ష ద్వనుల మద్య జరుపుకోవలసిన జాతీయ పతాక ఆవిష్కరణ కొన్ని 

వేల సాయుధ బలగాల మద్య జరుపుకుంటున్నాం అంటే  మన దేశ పరిస్థితి 

ఎలా  ఉందో అర్థం చేసుకోవచ్చు ... 15th august independence day scraps greetings for orkut
                                       ఓ త్రివర్ణమా  ఎప్పుడు ఎగురుతావిల స్వేచ్చగా ?అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచినపుడే అసలైన  స్వాతంత్ర్యం అని అన్న ఆ 

మహనీయుడి వాక్కులు గాలిలోనే మిలితమైనట్లున్నాయి .....

కనీస మగవాళ్ళు కూడా ఒంటరిగా బయటికేల్లలేని  పరిస్థితులలో మనం 

బ్రతుకుతున్నాం....

వీటికి తోడు లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ఉంది మన పాలకుల 

పరిస్థితి...

తమకేమి పట్టనట్లు తమదేమి పోలేధన్నట్లు ప్రవర్తిస్తున్న తీరు నిజంగా 

భాదకరం....

కాసులవేటలో కుర్చీల కుమ్ములాటలో కామకేళిలో మునిగితేలుతూ ....

అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా సంపాదించిన  అవినీతి 

ఆస్తులు,అంతస్తులు.  

కదిలిస్తే ప్రపంచానే కుదిపెసేటటువంటి కుంభకోణాలు ఇవేనా ?

అవినీతి సొమ్మంత లెక్కగడితే మన పిల్లలతరాలకి కూడా 

ఉపయోగపదేటంత  సంపద......

మనం చిన్నప్పుడు భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే 

చదువుకున్నాం ఇప్పటికి అదే చదువుతున్నారు   

ఇలాగే ఉంటే మన దేశం ఎప్పటికి అభివృద్ధి చెందుతున్న దేశంగానే 

ఉంటుందేమో... 

Independence day scraps greetings for orkut
                                                కనీసం మీరయినా  చదవండి మన దేశం అభివృద్ధి చెందినది అని.


మన ముందు తరాల పిల్లలు కూడా మన లాగే చదువుకుంటారేమో  

ఉన్నన్నాళ్ళు తెల్లవాళ్ళు  దోచుకున్నారు ఇప్పుడు మన వాళ్ళు  

అనుకున్న  వాళ్ళే మనల్ని దోచుకుంటున్నారు...  

వీళ్ళే సరిగా ఉంటే
కసబ్ లాంటి కసాయిల నుండి  కర్కరే లాంటి అధికారులని వారిని కాపాడుకునే వాళ్ళమేమో... 
వీళ్ళు మన కోసమే పని చేస్తే మరో అన్నా హజారేలు,రాందేవ్ బాబా లాంటి వాళ్ళు మల్లి
 స్వతంత్రం  కోసం (అవినీతి నుండి) పోరాడే పరిస్థితి వచ్చి   ఉండేది కాదేమో..

ఒక సామాన్య పౌరుడిగా ఇలా అనుకోవటం తప్ప ఇంతకంటే ఏమి చేయగలం 
ఒక వేళ మనమేమన్న ప్రయత్నం  చేసిన మనల్ని  అణిచివేయటానికి   పుట్టుకొచ్చే పుట్టగొడుగులు కోకొల్లలు  అని చెప్పనక్కర్లేదేమో...?


                                                               ఎవరినైనా నొప్పిస్తే క్షమించండి.


                                                  -నందు
Saturday, August 13, 2011 - 0 comments

రక్షాబంధనం శుభాకాంక్షలు.....
Rakhi greetings, wishes and comments for Orkut, Myspace

భిన్నత్వం లో ఏకత్వం గల మన భారత దేశం లో మతాలకి  భాషలకి కొదువ లేదు అలాగే పండుగలకి కూడా...
సాధారణంగా పండుగ  అంటే అందరు కలిసిమెలిసి  ఒక శుభ సందర్భంలో ఏకతాటిపై ఉండి జరుపుకునే ఒక కమనీయ దృశ్యము అని నా ఫీలింగ్...
ఇకపోతే ఇవాళ రాకీ పౌర్ణమి సందర్భం గా నాకు ఈ పండుగ  గురించి తెలిసింది రాయాలనిపించింది...

నీకు నేను రక్ష నాకు నీవు రక్ష మనందరం కలిసి దేశానికి రక్ష అని  ఒక సోదరి  తమ  సోదరులకి రాఖి  కడుతారు, తమ కర్తవ్యాలను గుర్తుచేస్తారు .... 
మరి మనమెంత మంది ఆ కట్టుబాట్లకు  కట్టుబడి ఉన్నాము, ఆ కర్తవ్యాలను నేరవేరుస్తున్నాము  అనేదే నా  చిన్న సందేహం...
కట్ట్లుబాట్లు, కర్తవ్యాలు  మొక్కుబడిగా  కాకుండా  
మనమంతా స్నేహంగా సౌబ్రాతుత్వంతో కలిసిమెలిసి మెలగాలని, ఒకరికొకరు తోడుగా  నిలవాలని కోరుకుంటూ ...
ప్రతి సోదరాసోదరీమనులకు ఇవే నా "రక్షాబంధనం" పండుగ  శుభాకాంక్షలు.....
                                            -నందు.
Rakhi orkut scraps, greetings, cards & comments for Myspace, Facebook
Friday, August 12, 2011 - 5 comments

ప్రేమ కోసం....!

మనిషి ఒకసారి ప్రేమలో పడితే ఏదైనా చేస్తాడు, ఎంతైనా చేస్తాడు..... 
త్యాగమైనా , 
పెళ్ళైనా...
చివరికి చంపటానికైనా, 
చావటానికైనా....
 కాని ఒకటి మాత్రం నిజం ఆ మనిషి తన ప్రేమని చూపించటానికే  ఇదంతా  చేస్తాడు....
నిజంగా ఒక మనిషి  ప్రేమలో పడటానికి కొన్ని యుగాలు,
 కొన్ని సంవత్సరాలు అవసరం లేదేమో ....
ఒక్క క్షణం చాలేమో కంచులా ఉన్న మన   హృదయాన్ని  మంచులా కరిగించి  ప్రేమలో పడేయటానికి ప్రేమ మాధుర్యాన్ని పంచటానికి...
  నేను ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను
ప్రేమలో పడటం కోసం,
 ప్రేమించటం కోసం, 
ప్రేమించబడటం కోసం కూడాను...
                      


                                              -నందు .
Thursday, August 11, 2011 - 6 comments

నా ప్రేమ


ప్రేమ గురించి రాయటం మొదలెట్టినప్పటి నుండి ఈ మధ్య చాలా  మంది 

అడుగుతున్నారు 

ఇంతకి నువ్వు ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరు అని...!

నాకెందుకో ఎప్పుడు ప్రేమించాలనే ఆలోచనే రాలేదు,

ఎందుకంటే ప్రేమంటే ఇది అని కచ్చితమైన అవగాహన నాకిప్పటికి రాలేదు 

ఫ్రెండ్  

ప్రేమ అముల్యమైనది

అందుబాటు  ఉన్నపుడే ఆస్వాదించాలి

ఒక్కసారి ప్రేమ  దూరమైతే ప్రపంచానికి దూరమైనంత  బాధగా ఉంటుంది...

మీకు ఒక్కోసారి అనిపిస్తుంది కదు...! (ప్రేమలో ఉన్న వాళ్ళు, ప్రేమలో పడ్డ 

వాళ్ళు).

ప్రేమ గురించి రాయటానికి కచ్చితంగా ప్రేమించాల్సిన అవసరం లేదేమో...

ప్రేమని ఆస్వాదించినా  చాలేమో...

ప్రేమంటే ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య ప్రేమే కానవసరం లేదు

మనసున్న ఏ రెండు హృదయాల మధ్య అయినా ఉండొచ్చు.... 
 
నేను ఆస్వాదిస్తున్నాను అందుకే రాస్తున్నాను. 

                                             -నందు  
                                      

                                           
Monday, August 8, 2011 - 4 comments

ఒక వర్షాకాలపు సాయంత్రపు వేళ...!

అదొక వర్షాకాలపు సాయంత్రం అందులోనూ అమావాస్య,ఆకాశం కారుమబ్బులతో నిండిపోయింది, ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయి... 
అప్పుడప్పుడే చీకటి పడుతుంది, నేను ఆఫీసు నుండి  బయలుదేరే సమయానికే చాలా చీకటి పడింది,
ఇంటికి వెళ్ళాలనే తొందరలో నేను వడి వడిగా అడుగులు వేస్తున్నాను నా అవస్థ చూసి మేఘాలకి కూడా జాలేసినట్లుంది
అందుకేనేమో కన్నీరు కారుస్తుంది (వర్షం కురవటం మొదలయింది)....!
నేను అలా నడుస్తూనే ఉన్నాను, నా వెనకాల ఏదో అలికిడి వినిపిస్తుంది ఎవరో నాలాగ ఇంటికి వెళ్ళాలనే తొందరలో ఉన్నట్లున్నారు నేనేమి పట్టించుకోకుడా త్వరత్వరగా నడుస్తున్నాను.... 
ఇంతలో ఒక్కసారిగా  నా అవస్థకు  బాదపడుతూ  మెరుపులు మారోసారి రోధించాయి(మెరిసాయి), ఇంతలో ఒక అందమైన ఆకారం నన్ను దాటుకుంటూ వెళ్లిపోయింది... 
 అంత వరకు తెలియదు ఇంత సేపు నా వెనకాల నుండి నడుస్తున్నది ఒక అందమైన అమ్మాయి అని.... ఎర్రటి ఆ మెరుపులో,  ఎర్రటి నిండైన చీరలో తన  మొహాన్ని చూసాను.... దేవలోకం నుండి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది తన రూపం, ఆ కళ్ళైతే మరీను ఎంత సేపు చూసినా తనివితీరదేమో....
చూసిన క్షణం లోనే ఒక్కసారి ఆకాశపుటంచులదాక  అలా అలా తేలియాడి వచ్చాను...
తను వెళ్తూనే ఉంది నేను త్వరగా తేరుకుని తన  వెంటే వెళ్ళాను తనతో ఎలాగైనా మాట్లాడాలనిపించింది ఇక దైర్యం  చేసి తన పక్కకి వెళ్ళాను  అంత లోపే తను నా వైపు చూసింది ఆ కళ్ళల్లో ఏదైనా శక్తి దాగి ఉందేమో... ఒక్కసారిగా నా మనసును  తనవైపే లాగేసింది అదేదో గురుత్వాకర్షణ శక్తి లాగ....
తను ముందు నన్ను చూసి ఉలిక్కి(బయపడినా) పడినా, నా అవస్థ చూసి కళ్ళతోనే మట్లాడేసింది... 
"ఎం మాట్లాడాలో తెలీక మీతో నడవవచ్చా అని అడిగాను.... తను కాసేపు ఏదో ఆలోచించింది, తరువాత  చిరునవ్వు నవ్వి  నా చేతిని  అందుకోబోయింది......
అంతలోపే

అగ్ని పర్వతం నుండి పొంగుతున్న లావాను ఉప్పొంగిన సముద్రపు కెరటాలు ముంచేసినంత   ఫీలింగ్...
 చిన్నపాపలాగా గెంతుతూ తీరాన్ని తాకబోతున్న ఒక చిన్న అలను  తిమింగలం లాంటి ఒక పెద్ద అల మింగేసినట్లు.... 
నాకొచ్చిన ఒక అందమైన "కల"ను నా మెలకువ మింగేసింది.........
                                                                     -నందు