నా గురువులను గురించి చాలా గొప్పగా రాయాలని ఉంది. కాదు, కాదు వారి గొప్పదనాన్ని గూర్చి రాయాలని ఉంది...
వారిని గురించి రాయాలని నా మది కలవరపెడుతున్న వేళ,
ఎలా మొదలెట్టాలో తెలియక నా మనసు సతమతమవుతుంది.
నా మనసు అంతర్లీనంలో వారిని గూర్చి దాక్కొని ఉన్న భావాలను ఒక్క సారిగా మూట కట్టి బయటి ప్రపంచానికి పరిచయం చేయాలని ఉంది...
నా దృష్టిలో గురువంటే ఒక చదువు మాత్రమె చెప్పేవారు కాదు నైతిక విలువలను కూడా నేర్పగలగాలి...
గురువంటే మనకు చదువు చెప్పే వారే కాదు
మనకు నాలుగు మంచి మాటలు చెప్పి మనం సక్రమ దారిలో నడవటానికి కారణం అయినా ఏ వ్యక్తి అయిన ఉండవచ్చు
అమ్మ నాన్న ఇలా మన జాబితాలో చాలా మందే ఉంటారు కాదు.....
మరి నాకెందుకో నా జీవితం కుటుంబసభ్యుల కంటే నా గురువుల ప్రోత్సాహమే ఎక్కువగా ఉండింది(ఇంకా ఇప్పటికి కూడాను)...
దానికి కారణాలు నా కుటుంబ పరిస్థితులు కావొచ్చు, లేక మరేదయినా కారణం ఉండవచ్చు
కాని నా జీవితం లో మాత్రం కొద్ది మంది గొప్ప గురువులను పొందాను అని చెప్పుకోవటానికి ఇప్పటికి ఎప్పటికి గర్వపడతాను..
అంటే నా అబిప్రాయం లో మిగతావారు గొప్ప వారు కాదు అని నా ఉద్ద్యేశం కాదు కాని
నాకెందుకో వారితో అబిప్రాయాలు కలవకపోవచ్చు, తప్పు మాత్రం వారిది కాదు సుమా...!
గురువంటే చదువు చెప్పటం ఒక్కటే కాదు అని నేను నా స్కూల్ రోజులనుండి జరిగిన పరిణామాల నుండి గ్రయించాను...
నిజంగా వారికెంత ఓపిక ఉంటుందో మన గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటానికి మన బాగోగులు పట్టించుకోవటానికి....
ఒక పుస్తకం గొప్పగా ఉండాలంటే అందులోని ప్రతి వాక్యం అద్బుతంగా ఉండాల్సిన అవసరం లేదు, అందుకో కొన్ని భావున్న చాలు
అలాగే నా గురువులు గొప్పవారు అని చెప్పుకోవటానికి వారు అన్నిట్లోనూ గొప్ప వారు కాకపోవచ్చు కాని గొప్ప మనసున్న మనుషులు...
మనమేమి సాదించము వారి నుండి కాని వారు చూపే మార్గాల ద్వారా సాదించే లక్షణాలను పొందుతాము...
ఇప్పటికి నేనేమి సాదించకపోవచ్చు కాని సాధించటానికి అవసరమైన మార్గాన్ని శక్తిని మీ నుండే పొందాను....
కనీసం నేనీస్థితిలో ఉండటానికి కారణం వారేనని నేను ప్రత్యేకంగా చెప్పలేను ఎందుకంటే ముమ్మాటికి ఇది వారి చలవే...
3 comments:
ప్రతీ మనిషికీ ఎవరున్నా లేకపోయినా గురువు అనే వాళ్ళు మాత్రం ఉంటారు. ప్రకృతిలోని ప్రతీ వస్తువూ మనకి గురువే కదా!
nice one
రసజ్ఞ గారు మీరు చెప్పింది అక్షరాల నిజం ధన్యవాదములు. పైడి గారు మీకు కూడా ప్రతి పోస్ట్ ని చదువుతూ కామెంట్స్ రాస్తున్నందుకు...
Post a Comment