ప్రియమైన అమ్మకి ఎలా ఉన్నావ్ ?
నీకేం భావుంటావ్ ఎందుకంటే నేనున్నాను కదా నీకు...! (అని నేననుకుంటాను కాని, నువ్వే నన్ను కంటికి రెప్పల చూసుకుంటావని నేనెప్పుడు అనుకోను )
సృష్టిని సృష్టించిన సృష్టి కర్తవి నీవు
ప్రపంచానికి ప్రేమను పరిచయం చేసిన ప్రేమ మూర్తివి నీవు
మా స్వార్థం కోసం నీ జీవితాన్నే త్యాగం చేసిన త్యాగ మూర్తివి నీవు
నాకు చాలా సార్లు అమ్మ నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాలనిపించింది,
కాని నేను చెప్పేలోపే నీకు నేనంటే ఇంత ఇష్టమో నా మీద నీకెంత ప్రేముందో చూపిస్తావు చూడు ఆ ప్రేమ ముందు నా చిన్ని ప్రేమ బలాదూర్ అనిపిస్తుంది అందుకే నాకెప్పుడు చెప్పాలనిపించదు
నేనే తప్పు చేసినా నన్నే వెనకేసుకోస్తావు చూడు, ఆ ప్రేమను చూసి నాలో గర్వం మరింత పెరుగుతుంది..
నా మనసులో ఏముందో నాకే అర్థం కాదు అలాంటిది, నేను ఎపుడైనా ఏదైన మనసులో అనుకునే లోపే చేసి పెడతావు
డాక్టర్ కంటే ముందుగా నా మౌనాన్ని పసిగాడతావు
నేను ఎప్పుడైనా నీతో మాట్లాడామని ఫోన్ తీసి నెంబర్ నొక్కుతుంటే నాకన్నా ముందే నువ్వే ఫోన్ చేస్తావు (నాకు ఇప్పటికి ఆశర్యమే నువ్ నా గుంచి ఆలోచిస్తావని కాని నువ్వు నా కోసమే బ్రతుకుతున్నవని నేను ఇంకా అర్థం చేసుకోను ఎందుకని )
నువ్ గెలుస్తావ్ కన్నా... అని నా నుదిటి మీద ముద్ధాడుతావ్ చూడు
ఆ ముద్దు నా గెలుపుకి మూలం అని అనుకోను నేను...
నీ గురించి ఎంత రాసుకున్న, ఎంత మాట్లాడుకున్న
నాకు ఎప్పుడు ఒక బాధ ఉంటూనే ఉంది
అదే నీకోసం ఎం చేయలేదనే బాధ...
ఇలాంటి ఉత్తరాలు ఇప్పటికి చాలా సార్లు రాసాను కాని
నీకు పంపించాలనిపించదు
ఎందుకంటే నా మనసునే చదివేసావు కదా
ఈ ఉత్తరంలో ఎం రాసానో ఈపాటికే నీకు తెలిసిపోయి ఉంటుందనే....
-నీ నందు