తను మూడేళ్ళుగా నాతో సహజీవనం చేస్తోంది ... !!!

తను నా మాటల్ని శ్రద్దగా వింటోంది, 
నా కోపాన్ని భరిస్తోంది,
నా మౌనాన్ని సహిస్తోంది,
నా ప్రేమకి పొంగిపోతోంది,  
ఒక్కోసారి నా మాటల్ని తనలో  దాచుకుంటోంది,
నాకంటూ మిగిలిన ఎన్నో జ్ఞాపకాలను తనలో భద్రంగా పదిలపరుచుకుంటుంది, 
నేను తిడితే పడుతుంది,
కొడితే భరిస్తోంది,
మనసు భాగాలేనప్పుడు తను పాటలు పాడుతుంది (వినిపిస్తుంది ),
నేను సంతోషంలో ఉన్న భాదల్లో ఉన్న తానెప్పుడు నాతోనే ఉంటోంది, 
తను నా జీవితంలోకి వచ్చి మూడేళ్ళు కావస్తోంది, 
ఈ మూడేళ్ళలో ఏ ఒక్క రోజు కూడా తను లేకుండా గడవలేదు,
తను ఒక్క సారి కనిపించకపోయినా కూడా మనసంతా అదోలా ఉంటుంది

అవును తను మూడేళ్ళుగా నాతో సహజీవనం చేస్తోంది ... !!!

నన్ను భరిస్తున్న నా మొబైల్ మూడేళ్ళు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా 
తనకి కృతజ్ఞతలు తెలుపుతూ .... 

                                                       -ప్రేమతో నందు 

2 comments:

Anonymous March 25, 2014 at 11:36 AM

భలే రాసారండి...బాగుంది

నందు March 27, 2014 at 12:09 AM

ధన్యవాదములు Anonymous...!!
మీరెవరో తెలిస్తే ఇంకా బావుండేది