ఈ పెళ్ళికోసం మనింట్లో పెళ్ళిలాగా ఎదురుచూస్తుంటాం
ఈ పెళ్ళికోసం ఎంతో కష్టపడుతుంటాము
ఏ గొడవలు, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడతాం,
కనీసం అదేమీ మనింట్లో పెళ్లి కాదు,
కాని మనం కచ్చితంగా వారిద్దరి పెళ్లి మళ్ళి మళ్ళి చూడాలనుకుంటాం ,
ఎన్ని గొడవలు వచ్చిన, ఎన్ని అపార్థాలు కలిగినా కలిసి ఉండటం కోసం,
ఏంతో మందికి వీరిద్దరిని ఆదర్శ జంటగా చూపిస్తాం
ఎన్ని కష్టాలొచ్చినా వీరిలా స్థైర్యంగా ఉండమని చెప్తాం
ప్రతి చిన్న విషయాలకి అనుమానం, గొడవలు పడే
ప్రతి జంటకి సీతారాముల జీవితం ఒక నిదర్శనం కావాలి
రాముడు సీతని అగ్నిప్రవేశం చేయమనటం లోకం సీతపై
నింద వేసిందనే కావచ్చు,
కాని తన దృష్టిలో మాత్రం తన సీత నీజాయితి
అందరి ముందు నిరూపించటం కోసం...
సీత రాముడ్ని నమ్మింది రాముడు సీతను నమ్మాడు...
అందుకే వారి జీవితం నేటి తరాలకి ఆదర్శ దాంపత్యం
వీళ్లెప్పుడు మనకి ప్రత్యేకమే,
వీరి పెళ్లెప్పటికీ మధుర జ్ఞాపకమే,
మనిషే దేవుడు అనటానికి సాక్ష్యం మన శ్రీరామ చంద్రుడే,
సహనానికి, ఓపికకి నిలువెత్తు రూపం ఎప్పటికి మన సీతమ్మ తల్లే ...!!!
అందుకే మన రాముడెప్పుడు మనకి దేవుడే..!!!
సీతమ్మ ఎప్పుడు మనింటి ఆడపడుచే ...!!!
మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
-నందు
1 comments:
జైశ్రీరాం
Post a Comment