Showing posts with label నందు. Show all posts
Showing posts with label నందు. Show all posts

నీకు నచ్చనంత మాత్రాన

 నీకు నచ్చనంత మాత్రాన చెడ్డొడ్నీ కాదు

నీకు మాత్రమే నచ్చితే గొప్పొడ్నికాదు


నేను నీకు నచ్చలేదంటే

నువు పాడే ప్రతి పాటకి 

నేను తందనాన అనకపోవడం

నువ్వు చెప్పినట్లు వినకపోవటం అంతే

అంతే కానీ నువ్వే మంచి 

నేను కాదు అని కాదు దానార్థం

- నందు

దేవుడున్నాడు

 మనకి కష్టాలు,బాధలు వస్తే

దేవుడున్నాడు, చూస్తాడని నమ్మే మనం,

వేరే వాళ్ళని బాధపెట్టేటప్పుడో,

మోసం చేసేటప్పుడో లేదా తప్పు చేసేటప్పుడో

మాత్రం దేవుడ్ని మర్చిపోతాం


ఎందుకంటే

కళ్ళు తెరిస్తేనే ఎవరో చూస్తారు 

అని కళ్ళు మూసుకుని పాలు తాగే 

పిల్లి రకం మనందరం

-నందు. 

#randomthoughts

అంతేగా !!

 కావాలనుకున్నప్పుడు 

ఏ కారణాన్ని ఎత్తి చూపము

కానీ వద్దన్నుకున్నపుడే 

వందల సాకులు వెతుకుతాం

 అది వస్తువుకైనా, మనిషికైనా....!!

-నందు

నేటి బంధాలు


 

విలువలు - ఉలవలు


మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి
ఇబ్బందుల్లో ఉన్నప్పుడు  విలువలు,
 ఉల్వలు  అంటూ మాట్లాడకూడదు
మనిషికి ఇచ్చే విలువ 
ఎప్పుడు ఒకేలా ఉండాలి
స్థాయిని బట్టి,
 డబ్బుని బట్టి మారకూడదు
-💚దు

మనం అనర్హులం

మనం పుట్టినప్పటి నుండి 
తను చనిపోయే వరకు 
మన గురించే ఆలోచించే 
మన అమ్మ గురించి 
ఎన్నడూ సరిగ్గా పట్టించుకోని మనం, 
మాతృదినోత్సవం జరుపుకోవటానికే కాదు 

మాట్లాడుకోవటానికిి కూడా అనర్హులం..!!!
-నందు
#HappyMothersDay
#MothersDay
#TheOtherSide

కొన్ని జ్ఞాపకాలంతే

కొన్ని జ్ఞాపకాలంతే
గుర్తొచ్చినప్పుడల్లా 
బాధ కలిగిస్తాయి

కొన్ని జ్ఞాపకాలంతే
జీవితాంతం 
గుర్తుంటాయి

-💚దు

దాచుకోలేనంత ప్రేమ- తట్టుకోలేనంత నొప్పి


దాచుకోలేనంత 
ప్రేమని ఇచ్చి చూడు 
తట్టుకోలేనంత నొప్పిని 
తిరిగిస్తుందీ ప్రేమ..! 
చెప్పలేనంత 
ఇష్ఠాన్ని చూపించు 
ఓర్చుకోలేనంత బాధని 
ఒదిలేసి వెళ్తుందీ ప్రేమ..!! 
-దు
08-03-2020

లోకం పోకడ !

బతికున్నప్పుడు మాటలతో చంపుకుని,
చచ్చాక జ్ఞాపకాలతో బ్రతికేస్తున్నాం
ఇదే నేటి లోకం పోకడ !

మనిషికి ఆర్ధిక ఇబ్బందులున్నా
తట్టుకోవచ్చు కానీ,
మానసిక ఇబ్బందులను 
తట్టుకుని నెగ్గుకురావడం చాలా కష్టం... !!

-💚దు



ప్రేమంటే ఇంతే

రోజంతా తను మనతో ఉన్నా 
పది నిముషాలు  కనపడకపోతే 
కంగారు పడతాం చూడు 
అదే  ప్రేమంటే...!!!

పది గంటల నుండి 
తనతో  కనీసం పది  నిముషాలైనా 
మాట్లాడటం కోసం 
ఎదురు చూస్తావు  చూడు 
అది కూడా ప్రేమే...!!!!
-💚దు

#ValentinesDay2018

నాన్న


నాన్న 

మన బాల్యం నాన్న 
మన చిన్నపాటి మొదటి హీరో నాన్నే 
నాన్నంటే భయం ,కాదు కాదు 
అంతకు మించిన గౌరవం కూడా 
మన చదువు నాన్న సమాన మార్కులు  నాన్న 
మన పరువు నాన్న  
మన సంతోషం అమ్మ కావొచ్చు 
కానీ మన దిగులు మాత్రం మళ్ళి నాన్నే

చిన్నతనంలో 
బుడి బుడి అడుగులు వేయటం నుండి 
మనం తప్పటడుగులు వేయకుండా 
మనల్ని వెంటాడుతున్న నీడ నాన్న!!
నాన్నంటే నమ్మకం 
నన్నుంటే  దైర్యం 
ఏదైనా అయితే చూసుకోవటానికి 
నాన్నున్నాడులే  అనుకునేంత పొగరు కూడా నాన్నే .   

నువ్వెలా చదువుతావో పదిమందిలో 
సంతోషాన్ని పంచుకునేది అమ్మ 
కానీ నువ్వెలా చదవాలో ఎలా ఎదగాలో  
ఎలా నిలవాలో పది మందిని పరిశీలించి,
నీకు మంచిని చెప్పేది మాత్రం నాన్నే
బాగా ఉండటం నుండి త్వరగా బాగుపడి 
ప్రయోజకులం అవ్వాలని ఆశించేది నాన్న 

తాను కన్న కళలు కళ్ళతోనే దాచుకుని 
పిల్లల కలల్ని కళ్ళముందు చూసుకుంటూ 
వారి బాగుగోసం నిరంతరం కష్టపడే శ్రమజీవి నాన్న 
కష్టాలు బాధలు వచ్చినప్పుడు 
ఎవ్వరు ఉన్న లేకున్నా  
మన వెనకాలే ఉండి 
మనల్ని ముందుకి నడిపించేది మన 'అమ్మానానే'

మ్మ ప్రేమను ఆస్వాదిస్తే అర్థమవుతుంది నాన్న 
ప్రేమను 'నాన్న' అనే బాధ్యతను మొస్తే తెలుస్తుంది

-💚దు
21.02.16

జ్ఞాపకాలతో బ్రతికేస్తాం

బతికునప్పుడు మాటల్తో చంపుకుంటాం
చచ్చాక జ్ఞాపకాలతో బ్రతికేస్తాం
-న💚దు

మధ్య రాత్రి కలలు..!!

కొన్ని పరిచయాలు,
కొన్ని బంధాలు,
మద్య రాత్రి గాఢ నిద్రలో
వచ్చే కలల్లగా ఉంటాయి
ఎక్కడ మొదలయ్యాయో గుర్తుండవు,
ఎందుకు ఆగిపోతాయో తెలియవు,
కానీ కలల్లాగే
కొన్నెప్పుడు 
వెంటాడుతూనే ఉంటాయి..!
ఇంకొన్ని మాత్రం 
జ్ఞాపకాల్ని వదిలేసి వెళ్తాయి..!!
- దు





దూరంగా - దగ్గరగా

నువ్వు దూరంగా ఉన్నప్పుడు  
నీ విలువ తెలిసిరాకపోతే 
నువ్వు దగ్గరగా ఉన్నా కూడా 
ఏమి ప్రయోజనం ఉండదు..!
-న💚దు

సరే వెళ్ళు !!


సరే వెళ్ళు !!
వచ్చిపోయే 'వాన'లా నువ్వుంటే
ఎదురుచూసే 'నేల'లా నేనుంటా..!!
- న♥️దు

సమాధానం తెలిసిన ప్రశ్న !!


సమాధానం తెలియనప్పుడు 
మనం ఎన్ని సార్లు ప్రశ్నించినా, 
వెతికినా అర్ధముంటుంది...
కానీ సమాధానం ఇదే 
అని తెలిసినప్పుడు 
ఆ ప్రశ్న గురించి 
ఆలోచింకేకపోవటమే మంచిది..!!
సమాధానం తెలిసినా కూడా 
అదే ఆలోచిస్తున్నామంటే 
మన కంటే మూర్ఖులు 
ఇంకెవ్వరు ఉండకపోవచ్చు 
- నందు

బ్రతికున్నప్పుడు లేని బంధాలు


బ్రతికున్నప్పుడు ఒకరి మొహం
ఒకరు చూసుకోలేనంతగా బ్రతికి ,
పలకరిస్తే మొహం తిప్పుకుని తిరిగి,
చచ్చాక మాత్రం చివరి చూపులకి 
ఆరాటపడటం ఎందుకు ??

తన ఆత్మ శాంతించదనా ?
లేక నీ అంతరాత్మ సంతృప్తి చెందదనా ??
బ్రతికున్నప్పుడు లేని బంధాలు
చచ్చాక మాత్రం ఎందుకు ??
- ☹️దు

రియాలిటీ చెక్

రియాలిటీ చెక్:
1.'కొన్నిసార్లు' మనుషులకంటే
వస్తువులకే విలువివ్వాలి !!
ఎందుకంటే
వర్షంలో నువ్వు తడిస్తే వచ్చే
జలుబుకయ్యే ఖర్చుకంటే
నీ కంపెనీ ఇచ్చిన లాప్టాప్ తడిస్తే
అయ్యే ఖర్చే ఎక్కువ.!!

2. చిన్నప్పుడు తమ పిల్లల్ని
శ్రీ కృషుడి వేషాల్లో చూసి
మురిసిపోతారు.!
అదే పెద్దయ్యాక కృషుడి
వేషాలు వేస్తే
తోలు తీస్తారు..!!

-నందు
 

దెబ్బతిన్న శిథిలాలు..!!



దెబ్బతిని మిగిలిపోయిన 
శిథిలాల కింద 
ఏ జీవం ఉండదు, 
కొన్ని జ్ఞాపకాలు మాత్రమే ఉంటాయి
గత చరిత్రను 
గుర్తుచేయటానికి
భావితరాలను 
జాగురూక పరచటానికి
-నందు

నచ్చనితనం !!


నచ్చని మనిషి, 
నచ్చని వస్తువు,
అంటూ దూరం చేసుకుంటు ఉంటే 
ఏదో ఒకరోజు 
మనకు మనమే నచ్చని పరిస్థితి రావొచ్చు !!
అప్పుడేం చేస్తాం ???

అందుకే కుదిరితే
మనుషులతో కలుపుకుని పోవాలి..!
వస్తువులతో సర్దుకుపోవాలి..!!
-నందు