ఒక పదహారణాల పడుచు ఫీలింగ్స్.....
వస్తాడు నా రాజు అంటూ
నా పదహారేళ్ళ ప్రాయం నుండి
నా మది నీ తలపులు తడుతూనే ఉంది....
నా ఎదుట నీవే నా ఎద సవ్వడిలో నీవే...
పొడిచే పొద్దులో నా వెంటే నడిచే నీడలో....
పంట చేలల్లో పచ్చిక బయళ్ళలో..
ఎటుచూసినా అటునీవే కనిపిస్తుంటే ఏవైపు చూడను...?
నా మది దోచిన ఓ చోరుడా...
నా కళల సామ్రాజ్యపు ఓ రాకుమారుడా...
ఎన్నో ఆశలతో నీతో కొత్త జీవితంలోకి
అడుగేద్దామనుకుంటున్న ఈ చిన్న దాని
ఆశల పల్లకిని మోస్తావో
లేక అమాంతంగా ముంచేస్తావో
ఆశల పల్లకిని మోస్తావో
లేక అమాంతంగా ముంచేస్తావో
నీకే తెలియాలి సుమ..
మరి ఏది నీ జాడ
కనిపించదు కనీసం నీ నీడ...
క్షణానికోసారి గుర్తొస్తావు
మరుక్షణం కనుమరుగావుతున్నావు...
నీవు అందగాడివే కానక్కర్లేదు
నన్ను అర్థం చేసుకుంటే చాలు...
నీవు కోటిశ్వరుడివే కానక్కర్లేదు
నీ కనుసైగల్లో దాచుకుంటే చాలు.....
నీ మనసులో కాసింత చోటివ్వు,
నీ గుండెల్లో గుడి కట్టుకుంటాను కలకాలం...
-నీ వెన్నెల్లో ఆడపిల్ల...
-నందు.
14 comments:
చాలా బాగుందండీ! పదారణాల తెలుగు పడుచు హృదయాన్ని నిండు వెన్నెలలో చక్కగా చూపారు.
నీలాంటి మంచి మనసుకు మంచి మనసే జత కడుతుందని ఆశిస్తున్నాను.
కాని ఆశలు పెంచుకోవద్దు తల్లి వచ్చే వాడిని నీకు నచ్చినట్లుగా మలుచుకో.అది నీలోనే ఉంది.
బాగుంది నందు గారు
చాలా బాగా వ్రాసావు,
వెన్నెల్లో ఆడపిల్ల అను నవల ఆధారంగా DD8 లో వచ్చిన సీరియల్ నేను ఎప్పటికీ మర్చిపోలేను
చాలా బాగా వ్రాసావు,
వెన్నెల్లో ఆడపిల్ల అను నవల ఆధారంగా DD8 లో వచ్చిన సీరియల్ నేను ఎప్పటికీ మర్చిపోలేను
చిన్ని ఆశ గారు థాంక్ యు...
పైడి గారు ఏదో అలా రాసాను తప్పో ఒప్పో నాకు తెలీదు, థాంక్ యు ....
వర్మ అన్న థాంక్ యు
నీవు కోటిశ్వరుడివే కానక్కర్లేదు
నీ కనుసైగల్లో దాచుకుంటే చాలు..... baagundandee!
రసజ్ఞ గారు ధన్యవాదములు... అందులో కొన్ని నేను నా జీవితం లోకి తన గురించి రాసుకున్నవి.....
అందుకే అంత అందముగా వచ్చింది మీ ఈ టపా! మనసు మాటల అద్భుతం ఇదేనేమో!
రసజ్ఞ గారు కృతజ్ఞతలు
Hi anand Goud garu niceee :)
Hi anand Goud Garu Nice Poetry Andi...
Hi Anand Goud garu Nice Poetry andi....
అందమైన భావాలా హరివిల్లు
నాగు నాని గారు,
పద్మార్పిత గారు థ్యాంక్ యు అండి....
Post a Comment