వస్తున్నారు వస్తున్నారు అడుక్కునే వాళ్ళు
రోజుకో పార్టీ మార్చి, రాజ్యంగా సిద్ధాంతాలను పక్కకు పెట్టి,
తన స్వార్థం కోసం ఏమైనా చేయగల సిగ్గు మాలిన నాయకులు
పూటకో మాట మార్చి మనల్ని ఎమార్చేవాళ్ళు వస్తున్నారు...!!!
అది చేస్తాం, ఇది చేస్తాం,
అవసరమైతే ప్రాణాలిస్తాం అంటారే గాని
ఇప్పటి దాక జరిగిన ఉద్యమాలలో
ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా
ప్రాణ త్యాగం చేశాడా ??
పదవినే త్యాగం చేయాని వాడు ప్రాణాన్ని ఎం త్యాగం చేస్తాడు ??
ఏ పదవి ఆశించని నాయకులు ఎంత మంది ఉన్నారీ స్వతంత్ర బారత దేశంలో ??
టికెట్ ఇస్తే పార్టీలో ఉండుడు లేదంటే మరోక దాంట్లోకి దూకుడు..!!!
నా వల్లే అదోచ్చింది ఇదొచ్చింది
అంటూ బొంకే దొంగనాయ(కు)లను నిలదీసే హక్కు నీ వోటు
వృధా చేయకు నేస్తం నీ వోటు వృధా చేయకు
తల తాకట్టు పెట్టి అయినా అది చేస్తాం ఇది చేస్తాం
అనే వాడి మాటను నమ్మకు
గుర్తుంచుకో
వాడు తాకట్టు పెట్టేది నీ నమ్మకాన్ని ,
నీ ఆత్మాభిమానాన్ని,
మన భారత జాతి గౌరవాన్ని...!!!
ఎన్నికల్లో ఆఫిడవిట్ దాఖలు చేసినప్పుడు
సొంత కారు కూడా ఉండదు కాని
వీళ్ళు మాత్రం ఖరీదైనా వాహనాల్లో తిరుగుతారు.
ఎవరు చేసిన పుణ్యమో ? లేక ఎవరికీ చేసిన ప్రతిఫలమో మరి...!!!
ఆస్తి లక్షల్లో ఉందంటారు,
కోట్లు కొల్లగొట్టి తిరుగుతుంటారు....
మన బ్యాంకుల్లో అప్పుంటుంది
"అసలు" మాత్రం స్విస్ బ్యాంకుల్లో నిద్రపోతుంటుంది... !!!
కొటరు కోసం నువ్వు ఆశపడకుండా ఉంటేనే బెటరు
అప్పుడే చేయగలవు నీవీ సిస్టంని మానిటరు... !!!
నీ భవిష్యత్తు వాడిచ్చే 500ల నోటులో లేదు,
నువ్వేసే ఓటుతో వచ్చే అయిదేళ్ళ ప్రభుత్వంతో నువ్ చేయించే(చేయించుకునే) పనులలో ఉంది....
ఓటు వేయటం కోసం అడుగు ముందుకేయ్
అడుగేయ్ అడిగి కడిగెయ్
నీ ఓటుతో దుమ్ము దులిపేయ్
కాని నువ్ ముందు వోటు వేయ్
-నందు
4 comments:
పదవినే త్యాగం చేయాని వాడు ప్రాణాన్ని ఎం త్యాగం చేస్తాడు ??
well written.
thank you :)
దుమ్ము దులిపావ్
thank you pydi naidu
Post a Comment