స్నేహం దేవుడిచ్చిన గొప్ప వరాలలో ఒకటి...
ఎందుకంటే మన అమ్మ నాన్నలను ఆ దేవుడే నిర్ణహిస్తాడు
కాని మనకు మాత్రం మన స్నేహితులను ఎంచుకునే అవకాశం కల్పిస్తాడు...
మనం ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు మనమేమి ఆశించం...
అలాగని భవిష్యత్తుని అంచనా వేసి కూడా స్నేహం చేయము
అప్పుడు ఆ సమయాన మన మనసులో కలిగే స్పందనల ద్వారా
మనకు తెలియకుండానే వారి మీద మనకు ఒక రకమైన ఇష్టం ఏర్పడుతుంది
మనకు తెలియకుండానే వారి మీద మనకు ఒక రకమైన ఇష్టం ఏర్పడుతుంది
అక్కడి నుండి మొదలైన ఆ మజిలి
మనల్ని ప్రపంచం వెలివేసినా మన నేస్తం మనతో పాటే ఉండే అంత బలంగా పాతుకుపోతుంది.......
ఎల్లప్పుడూ మన మంచిని కోరుకుంటుంది
కష్టాలోచ్చిన కడదాక తోడుండేది...
తన కడుపు మాడ్చిన మన కడుపు నింపేది...
మనం గెలిస్తే ఎక్కువగా సంతోషించేది..
అన్నింటికీ నేనున్నానంటూ ఎదురు నిలుస్తుంది...
అవసరమైతే ప్రాణ త్యాగాలకు కూడా వెనకడుగు వేయని నైజం ఈ స్నేహానిది...
అలాంటి గొప్పదనం గల ఈ బంధం...
నీతో స్నేహం నాకేం లాభం అనే విధంగా మారుతున్న ఈ సమాజంలో
కులమత భేదాలకతీతంగా పేద ధనిక అనే దాపరికాలు లేకుండా
పురాతనకాలంలో శ్రీ కృష్ణుడు కుచేలుడు
రాజుల కాలంలో అక్బరు బీర్బలు లాంటి వారి గొప్ప స్నేహాలు మనకి ఆదర్శం కావాలి
నేస్తమా నీ మిత్రుల నుండి ఏదో ఆశించాలనే వంకతో
స్నేహం అనే పేరుతో నమ్మకాన్ని నయవంచన చేయకు
స్నేహనికున్న విలువను పాడు చేయకు....
నేస్తం స్నేహం గొప్పది...
-నందు.
4 comments:
చాలా బాగా రాసారు
స్నేహం అనేది ఒక సర్వరోగ నివారిణి. కష్టాన్ని పంచుకుంటూ సుఖాన్ని పంచిపెడుతూ ఓటమిని ఓదార్చుతూ గెలుపును గర్విస్తూ మనకు ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. ఈ విషయంలో నేను చాలా అదృష్త వంతుడినే
స్నేహం అనేది లేకపోతే నిజంగానే మనం గొప్ప దురదృష్ట వంతులం..
పైడి గారు ధన్యవాదములు....
మిత్రమా చక్కగా వ్రాశారు.అనుభవం తోనా !భావుకతతోనా !కొనసాగించండి.
రవిశేఖర్ ఒద్దుల
www.ravisekharo.blogspot.com
dhanyavaadhamulu ravisekar garu
Post a Comment