ప్రేమ ఈ రెండక్షరాల పదం ఒక పెద్ద ప్రపంచానికి ప్రాణవాయువేమో అంటే అతిశయోక్తి కాదేమో.....
నేను మొదట్లో ప్రేమ గురించి రాయటం మొదలెట్టినప్పుడు నాలో నాకే తెలియని అనుభూతి..
ఏవో పెనవేసుకున్న భావాలు నాలో...
నేను ఊహించికుని రాస్తేనే ప్రేమ నిజంగా ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది అలాంటిది నిజమైన ప్రేమను పొందితే అదృష్టవంతులమే
కదా...
ఈ మద్య కాలం లో మనం తరచుగా వింటున్న మాట నిజమైన ప్రేమ కనిపించట్లేదు దొరకట్లేదు అని....
అదేమన్న వస్తువా ? వెతికి పట్టుకోవటానికి.... కాదు కదా...
నిజంగా మనం కొంత మంది ప్రేమికులను చూస్తే ఇది కూడా ప్రేమేనా అనే సందేహం కలగక మానదు...
అది వారికి (ఆ ప్రేమికులకి)బాగానే ఉండొచ్చు కాని మనకే నచ్చక
పోవచ్చు....
ఇలాంటి ప్రేమలు మనకెన్నో కన్పిస్తూనే ఉంటాయి కదా...
ప్రేమంటే మనసుకి ముసుగులు తొడిగి మురిసిపోవటం కాదు...
నిజమైన ప్రేమంటే మనం పొందే ప్రేమలో నిజాయితి ఎంత ఉందో
గ్రహించటమే....
మనం ఎలా ఉన్న మనల్ని ఇష్టపడే కన్నవారి ప్రేమ,
నీలోని మంచితోపాటు చెడుని కూడా స్వీకరించే
స్నేహితుడి ప్రేమ
నువ్వెలా ఉన్న, నువ్వు మారినా కూడా తను మారకుండా నిన్ను నిన్నుగా ప్రేమించే వారి ప్రేమ...
మనకు ఇష్టమైన వారు ఎంత దూరంగా ఉన్న వారి పైన
ఇంచుక కూడా మారని మునుపటి ప్రేమ...
ఇదే నిజమైన ప్రేమ..
ప్రేమ ఎప్పుడు కనిపిస్తుంది కాని, నిజమైన ప్రేమ కొన్ని
సార్లే పుడుతుంది...
వర్షం ఎప్పుడు పడుతుంది కాని వడగండ్ల వాన కొన్ని
సార్లే పడుతుంది
ఒడిసి పట్టుకోవటానికి సిద్దంగా ఉండు వడగండ్లని,
నిజమైన ప్రేమని కూడా....
6 comments:
చాలా బాగుంది
"మనం ఎలా ఉన్న మనల్ని ఇష్టపడే కన్నవారి ప్రేమ,
నీలోని మంచితోపాటు చెడుని కూడా స్వీకరించే స్నేహితుడి ప్రేమ"
ఇ వాక్వాలు బాగా నచ్చాయ్
నాకు వడగళ్ళ వానంటే చాలా చాలా ఇష్టం అటువంటి వడగళ్ళ వానని ప్రపంచమంతా నిండి ఉన్న ప్రేమతో పోల్చడం బాగుంది.
Naayudu gaaru chala thanks andi..... Rasagna gaaru vadagandla vaala eppudu raadu kada anduke vaatitho polchanu.... Anywayz thanks a lot......
keep it up ra
well elagay rasthu mamalni anadimpajesthu meru me kavithalu chalabaguntay ani asisthu balachander
thappakundaa thank you.....
Post a Comment