భిన్నత్వం లో ఏకత్వం గల మన భారత దేశం లో మతాలకి భాషలకి కొదువ లేదు అలాగే పండుగలకి కూడా...
సాధారణంగా పండుగ అంటే అందరు కలిసిమెలిసి ఒక శుభ సందర్భంలో ఏకతాటిపై ఉండి జరుపుకునే ఒక కమనీయ దృశ్యము అని నా ఫీలింగ్...
ఇకపోతే ఇవాళ రాకీ పౌర్ణమి సందర్భం గా నాకు ఈ పండుగ గురించి తెలిసింది రాయాలనిపించింది...
నీకు నేను రక్ష నాకు నీవు రక్ష మనందరం కలిసి దేశానికి రక్ష అని ఒక సోదరి తమ సోదరులకి రాఖి కడుతారు, తమ కర్తవ్యాలను గుర్తుచేస్తారు ....
మరి మనమెంత మంది ఆ కట్టుబాట్లకు కట్టుబడి ఉన్నాము, ఆ కర్తవ్యాలను నేరవేరుస్తున్నాము అనేదే నా చిన్న సందేహం...కట్ట్లుబాట్లు, కర్తవ్యాలు మొక్కుబడిగా కాకుండా
మనమంతా స్నేహంగా సౌబ్రాతుత్వంతో కలిసిమెలిసి మెలగాలని, ఒకరికొకరు తోడుగా నిలవాలని కోరుకుంటూ ...
ప్రతి సోదరాసోదరీమనులకు ఇవే నా "రక్షాబంధనం" పండుగ శుభాకాంక్షలు..... -నందు.
0 comments:
Post a Comment