కొన్ని వందల ఏళ్ళ చరిత్ర గల ఒక గొప్ప దేశం లో పుట్టినందుకు గర్వపడాలో
లేక ఇప్పుడున్న పరిస్థితులను తలుచుకుంటూ సిగ్గుపడాలో అర్థం కాని
సమస్యగా మారింది.
కావాలి ఇటువంటి స్వేచ్చ |
పరాయి పాలనలో ఉన్న మన దేశాన్ని రక్షించుకోవటమ కోసం ఎంతో మంది
త్యాగ ధనులు తమ ప్రాణాలు అర్పించి మరీ మనకి ఈ స్వాత్రంత్ర్యాన్ని
సంపాదించి పెట్టారు...
ఈ స్వాతంత్ర్యం సాధించిన తరవాత విషయాన్ని ఒక సారి మనం
తలచుకుంటే అసలు మనం ఎటువంటి పరిస్థితులలో ఉన్నాము ?
మల్లి స్వాతంత్ర్యం కోసం పోరాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి...
మూడు దఫాలుగా సాగిన ఈ స్వాత్రంత్ర్య సంగ్రామంలో
చివరి దశలో సరైన నాయకత్వం లేక దారే తెలియని చీకటిలో ఉన్న మన
భారత దేశానికి తానే ఒక వెలుగై దిక్కుని చూపిన గాంధి గారు,
సత్యం, అహింసా అనే అస్త్రాలతో ఆంగ్లేయుల గుండెల్లో గుబులుపుట్టించిన
ఒక మహామహనీయుడు కలలు కన్న స్వరాజ్యం ఇదేనా ?
ఏ ఆశయం కోసం తెల్లవాళ్ళ లాటి దెబ్బలు రుచి చూసారో ?
ఏ స్వేచ్చ కోసం సత్యాగ్రహం చేసారో ?
అమర వీరులంత దేశాన్ని ఎలాంటి పరిస్థితులలో చూడాలనుకున్నారో
అందులో మనం మొదటి మజిలీ లోనే ఉన్నాం అదే స్వాతంత్ర్యం.....
నిజంగా మనకి స్వాతంత్ర్యం వచ్చిందా ?
ఈ ప్రశ కి మన దగ్గర సరైన సమాధానం లేదంటే ఆశ్చర్యపడనక్కర్లేదు....
ఎటు చూసిన దొంగలు దోపిడిదారులు వీరికి తోడు తీవ్రవాదులు...
హర్ష ద్వనుల మద్య జరుపుకోవలసిన జాతీయ పతాక ఆవిష్కరణ కొన్ని
వేల సాయుధ బలగాల మద్య జరుపుకుంటున్నాం అంటే మన దేశ పరిస్థితి
ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ...
అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచినపుడే అసలైన స్వాతంత్ర్యం అని అన్న ఆ
మహనీయుడి వాక్కులు గాలిలోనే మిలితమైనట్లున్నాయి .....
కనీస మగవాళ్ళు కూడా ఒంటరిగా బయటికేల్లలేని పరిస్థితులలో మనం
బ్రతుకుతున్నాం....
వీటికి తోడు లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ఉంది మన పాలకుల
పరిస్థితి...
తమకేమి పట్టనట్లు తమదేమి పోలేధన్నట్లు ప్రవర్తిస్తున్న తీరు నిజంగా
భాదకరం....
కాసులవేటలో కుర్చీల కుమ్ములాటలో కామకేళిలో మునిగితేలుతూ ....
అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా సంపాదించిన అవినీతి
ఆస్తులు,అంతస్తులు.
కదిలిస్తే ప్రపంచానే కుదిపెసేటటువంటి కుంభకోణాలు ఇవేనా ?
అవినీతి సొమ్మంత లెక్కగడితే మన పిల్లలతరాలకి కూడా
ఉపయోగపదేటంత సంపద......
మనం చిన్నప్పుడు భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే
చదువుకున్నాం ఇప్పటికి అదే చదువుతున్నారు
ఇలాగే ఉంటే మన దేశం ఎప్పటికి అభివృద్ధి చెందుతున్న దేశంగానే
ఉంటుందేమో...
మన ముందు తరాల పిల్లలు కూడా మన లాగే చదువుకుంటారేమో
ఉన్నన్నాళ్ళు తెల్లవాళ్ళు దోచుకున్నారు ఇప్పుడు మన వాళ్ళు
అనుకున్న వాళ్ళే మనల్ని దోచుకుంటున్నారు...
వీళ్ళే సరిగా ఉంటే
కసబ్ లాంటి కసాయిల నుండి కర్కరే లాంటి అధికారులని వారిని కాపాడుకునే వాళ్ళమేమో...
కసబ్ లాంటి కసాయిల నుండి కర్కరే లాంటి అధికారులని వారిని కాపాడుకునే వాళ్ళమేమో...
వీళ్ళు మన కోసమే పని చేస్తే మరో అన్నా హజారేలు,రాందేవ్ బాబా లాంటి వాళ్ళు మల్లి
స్వతంత్రం కోసం (అవినీతి నుండి) పోరాడే పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో..
ఒక సామాన్య పౌరుడిగా ఇలా అనుకోవటం తప్ప ఇంతకంటే ఏమి చేయగలం
ఒక వేళ మనమేమన్న ప్రయత్నం చేసిన మనల్ని అణిచివేయటానికి పుట్టుకొచ్చే పుట్టగొడుగులు కోకొల్లలు అని చెప్పనక్కర్లేదేమో...?
ఎవరినైనా నొప్పిస్తే క్షమించండి.
-నందు
5 comments:
నందు గారు మీరు చెప్పింది నిజం.నూతన ప్రసాద్ డైలాగ్ లో చెప్పాలంటే దేశం క్లిష్ట పరిస్తితుల్లో ఉంది ఆంధ్ర మరీ క్లిష్ట పరిస్తితుల్లో ఉంది. నాయకులైతే మరీనూ ఈ పరిస్తితుల్లో వీళ్ళకు ఈ రోజు గుర్తుంటుందో లేదో ఉన్నా........... గంట మాత్రమే.వార్తా పత్రికలకు ఐతే మరీనూ మొదటి పేజిలో చిన్న శీర్షిక పెట్టి మిగతా 5 వ పేజీలోకి వెళిపోతుంది.మనం అభివృద్ధి చెందాలంటే ఎవరో రానవసరం లేదు మీడియా తన పని తను చేసుకుంటూ పోతే అదే చాలు కానీ ఇప్పుడు వారు వారి PRP రేటింగ్స్ కోసం చూస్తున్నాయో లేదా మన నాయకులను పబ్లిష్ కోసం పుట్టుకోచ్చాయో అర్ధం కావడం లేదు.కానీ ఇలాంటి నిజాలు ఎప్పుడూ బాద గానే ఉంటాయి. చివర్లో మీరు అన్నారు ఎవరినైనా నొప్పిస్తే క్షమించండి. అని ఇది వద్దు అని నా ఉద్దేశ్యం.
nice post...
keep it up Anand.
మీరు చెపింది నిజమే నందు గారు ఒక సామాన్య పౌరుడిగా చూస్తూ ఉంది పోవడం తప్ప మనం ఏమి చెయ్యలేం
నాయుడు గారు, గీతిక గారు రాజేష్ థాంక్యు అండి...
Bhagundhi
it is better to publish news papers?
Post a Comment