Thursday, August 11, 2011 - 6 comments

నా ప్రేమ


ప్రేమ గురించి రాయటం మొదలెట్టినప్పటి నుండి ఈ మధ్య చాలా  మంది 

అడుగుతున్నారు 

ఇంతకి నువ్వు ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరు అని...!

నాకెందుకో ఎప్పుడు ప్రేమించాలనే ఆలోచనే రాలేదు,

ఎందుకంటే ప్రేమంటే ఇది అని కచ్చితమైన అవగాహన నాకిప్పటికి రాలేదు 

ఫ్రెండ్  

ప్రేమ అముల్యమైనది

అందుబాటు  ఉన్నపుడే ఆస్వాదించాలి

ఒక్కసారి ప్రేమ  దూరమైతే ప్రపంచానికి దూరమైనంత  బాధగా ఉంటుంది...

మీకు ఒక్కోసారి అనిపిస్తుంది కదు...! (ప్రేమలో ఉన్న వాళ్ళు, ప్రేమలో పడ్డ 

వాళ్ళు).

ప్రేమ గురించి రాయటానికి కచ్చితంగా ప్రేమించాల్సిన అవసరం లేదేమో...

ప్రేమని ఆస్వాదించినా  చాలేమో...

ప్రేమంటే ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య ప్రేమే కానవసరం లేదు

మనసున్న ఏ రెండు హృదయాల మధ్య అయినా ఉండొచ్చు.... 
 
నేను ఆస్వాదిస్తున్నాను అందుకే రాస్తున్నాను. 





                                             -నందు  
                                      





                                           

6 comments:

రసజ్ఞ August 11, 2011 at 1:07 AM

చక్కగా చెప్పారు విషం తాగితే చనిపోతాడు అని చెప్పడానికి విషం తాగిన వాడిని చూసినా చాలు కదా!! అయినా మనం పుట్టినపుడే తొలి చూపు ప్రేమలో పడతాం కదా మన తల్లితో!!!

నందు August 11, 2011 at 1:18 AM

రసజ్ఞ గారు మంచి కంపారిసన్ ధన్యవాదములు....నందు.

ఇందు August 11, 2011 at 3:19 AM

బాగుంది ప్రేమ గురించి మీరు చెప్పింది. హ్మ్! ప్రేమ గురించి తెలుసుకోవాలంటే.. ప్రేమించాల్సిందేనేమో. కానీ మీరన్నట్టు అమ్మాయి-అబ్బాయి మధ్య పుట్టేదే ప్రేమ కాదు. తల్లి-బిడ్డ, అక్క-చెల్లి-తమ్ముడు... ఆఖరికి మనింట్లో పెంచుకునే చిన్న కుక్కపిల్లయినా...పెరటిలో జాజి మొక్కయినా.... మనం ఒకదాన్ని ఎటువంటు నిబంధనలు లేకుండా సంపూర్ణంగా ఇష్టపడితే అదే ప్రేమ! :)

నందు August 11, 2011 at 10:33 AM

ఇందు గారు అమ్మాయి-అబ్బాయి మధ్య పుట్టేదే ప్రేమ కాదు కరెక్టే కదా......నందు.

RajendraVarma August 11, 2011 at 1:18 PM

చాలా బాగా చెప్పవు

నందు August 12, 2011 at 12:11 AM

వర్మ గారు ధన్యవాదములు...