04-05-11
(ఇది రాసి చాలా రోజులైంది కుదరక పోస్ట్ చేయలేదు)
(ఇది రాసి చాలా రోజులైంది కుదరక పోస్ట్ చేయలేదు)
ప్రపంచం ఏంటి ఈ సమయం లో పండగ ఏమిటి అనుకుంటున్నారు కదా,
అదేనండి మన ముద్దుల బద్ద శత్రువు ఒసామా బిన్ లాడెన్ పోయాడు కదా అందుకు...
ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంతో మందికి నరకం చూపించిన ఒక కిరాతకుడిని మట్టుపెట్టినందుకు అందరు బాగా సంబరాలు చేసుకునట్లున్నారు...
సత్యభామ నరకాసురిడిని చంపినందుకు మన పూర్వికులు ఎలా గర్వించారో తెలిదు కాని, ఇప్పుడు ఏ ఒక్క అమెరికన్ ని చూసినా మన పుర్వికులా మొహాలాగే ఉంటాయేమో (అంటే గర్వం తో నిండి)...!
మన భారతీయులు కూడా బాగా సంతోషం లో ఉన్నట్లున్నారు, అమెరికా తరవాత బాగా నష్టపోయిన వారు మన వాళ్ళే కాబట్టి....
ప్రపంచం మొత్తం మీద ప్రజలు ఎంత సంతోషంలో ఉన్నారో, అంత కంటే వంద రెట్ల సంతోషం లో ఒకే ఒక వ్యక్తి ఉండి ఉంటాడు...
ఆయనే అమెరిక ప్రెసిడెంటు "బరాక్ ఒబామా"....
మార్పు పేరుతో అమెరికన్ల మనసు మార్చి, శాంతి పేరుతో నోబెల్ బహుమతి పొంది...
రోజు రోజుకి ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో ఈ ఆపరేషన్ అనేది మరో ఐదేళ్ళు ఒబామా పాలనకు తొలిమెట్టుగా మనం అంగీకరించవచ్చు
ఏదేమయినా ఒక చదువుకున్న రాక్షసుడి శకం ముగిసింది....
శత్రుశేషం మిగలకుండా మిగిలిన వారిని కూడా మట్టుపెడితే మనం ప్రపంచ శాంతి కోసం వేరే ప్రత్యేక యాగాలు, యుద్దాలు లాంటివి చేయనవసరం లేదేమో.....
మరి ఇవన్నీ జరిగినా మన పాలకులు మన శత్రువుల గురించి ఎం చేస్తున్నట్లో...
"కసబ్" లాంటి కసాయిలకు "కోట్లు" ఖర్చు పెట్టి 'కోర్టు'ల చుట్టూ తిప్పటం తప్ప.....
-నందు
1 comments:
బాగుంది నందు గారు .
కసాబ్ గాడికి ఖర్చు మాత్రమే కాదు జైల్లో వాడికి రాచ మర్యాదలు జరిగాయ్
Post a Comment