ఎన్ని జన్మల బంధమో మన పరిచయం...
ఎలా మొదలైందో ఆ క్షణం...
ఒకరికొకరు తెలియని మనం మన తొలినాళ్ళలో మాట్లాడుకోవాలనే ఆశకాని
పరిచయాలు పెంచుకోవాలనే ఆత్రుత కాని లేకుండేవి కదా...
ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లుగా నీ దారి నీది, నాదారి నాదిలా ఉండేది..
వహ్ !
క్రమంగా ఎంత మార్పు...
చూడగానే చిరునవ్వులు
హాయ్ అంటూ ఆహాకారాలు
గంటల కొద్ది గ్రూప్ మీటింగులు
ఏ సందర్బము లేకుండానే పార్టీలు
క్లాసురూం క్యాంటీన్ క్యాంపస్ అంత మన ప్రపంచమే కదా...
టిఫిన్ బాక్స్ లనే కాదు, కష్టాలను కూడా పంచుకుంటిమి... .
గెలిచినప్పుడే కాదు గొడవలలో కూడా వీడిపోకపోతిమి...
తోడు నీడగా కంటికి కునుకు లేకుండా ఎన్నో రాత్రులను ముచ్చట్లతో మున్చేస్తిమి...
సరదాలు పెరిగిన మన సాన్నియిత్యంలోఅల్లరితనంతో పాటు
చేరవలసిన గమ్యాలను ఆచరించాల్సిన మార్గాలను కూడా నిర్దేశించుకుంటిమి,
ఇవన్నీ ఇప్పటికి నా మది నిండా పదిలమే...
మారుతున్న కాలానికి తోడు పెరుగుతున్న బాద్యతల నడుమ
సతమతమవుతున్న మనకి మన స్నేహమొక్కటే ఆలంబన...
మనం ఎంత ఎదిగిన మనమెప్పటికి అలనాటి మిత్రులమే....
నేస్తం ఇలాగే ఎప్పటికి నిలవాలి మన స్నేహం కలకాలం.....
-నందు.