నాకెందుకో చాలా సార్లు ఈ ప్రేమ గురించి రాద్దమనుకున్నపుడల్లా ఇంతకి ప్రేమంటే ఏంటి అనే ప్రశ్న మొదలవుతుంది...
నాకు తెలిసి ఈ భూప్రపంచం మీద ఇదే ప్రేమ అని సరైన నిర్వచనం ఇచ్చిన వారు లేరేమో...
ఎందుకంటే వారి దృష్టిలో ప్రేమ కి నిర్వచనం అదేనేమో, మనకి అది నచ్చదేమో ....
మనం సరిగ్గా ప్రేమంటే ఇదేనేమో అని ఒక భావనకి వచ్చేలోపే ప్రేమంటే ఇదేనా అనే సందేహం కూడా మొలకెత్తుతుంది ఒక్కసారి ...
మనం ప్రేమించిన నిచ్చెలి మనతోపాటే ఉంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఇదేనేమో ప్రేమంటే అని మనం అనుకునే లోపే,
మన కంట్లో ఏ చిన్న నలుసు పడినా మనకంటే ముందు తన కంట్లోంచి నీరు కార్చే కన్న తల్లి ప్రేమను చూసి ఇంత కంటే గొప్ప ప్రేమ ఉండదని ఎప్పుడు చెప్పుకుంటాము...
మన చిన్నప్పుడు నడిస్తే కాళ్ళు నొప్పెడుతాయని తన మోకాళ్లను మన కాళ్ళుగా మార్చి(మనకు కాళ్ళుగా అమర్చి) మనల్ని నడిపించిన నాన్న ప్రేమ,
ఎప్పుడు మనతో పోట్లాడే అక్క ప్రేమ,
ఏ పరిచయం లేకుండానే మన జీవితంలోకి ప్రవేశించి అడక్కుండానే అన్ని చేసి పెట్టే ఆప్త మిత్రుడి ప్రేమ....
ఇవన్నీ ఎప్పటికప్పుడు ప్రేమ అనే పదానికి నిర్వచనాన్ని మారుస్తూనే ఉన్నాయి....
ఒక్కోసారి ఒంటరి తనంలో కుడా ప్రేమను పొందే మనం ప్రేమలో ఇన్ని రకాలను ఆస్వాదించాక,
ఏ ఒక్క అనుభూతినో లేక, ఏ ఒక్క అనుభవాన్నో ప్రేమనుకోవటం పొరపాటే ...
ఎందుకంటే ప్రతి "ప్రేమ" మనకు "ప్రేమ" గానే ఉంటుంది.
మరి నిజమైన ప్రేమ ఏంటంటే మనం పొందే ప్రేమలో ఎంత వరకు నిజాయితి ఉందో గ్రహించడమే ...
ఆ నిజమైన ప్రేమ ఆనేది ఏంటో తెలుసుకునేలోపే,
దాన్ని గ్రహించేలోపే మనం ఆ ప్రేమకే దురమవుతామేమో...
దాన్ని గ్రహించేలోపే మనం ఆ ప్రేమకే దురమవుతామేమో...
ఒక్కోసారి ఈ జీవితానికి కూడా....
-నందు
7 comments:
no comments..bcz i too dnt knw:p
చాలా చక్కగా పొందుపరిచారు మీ ఆలోచనలని. ప్రేమ నిష్కల్మషమయినది అయితే దానినే నిజమయిన ప్రేమ అంటారని నా అభిప్రాయం.
రసజ్ఞ గారు చాలా థాంక్స్ అండి...
నా దృష్టిలో ప్రేమంటేనే నిజం.. అసలు నిజమైన ప్రేమ ఉండదు! జగమంత ప్రేమ దేని మీద అయిన కలగవచ్చురా నువ్వు చెప్పినట్లు..!
Excellent thammudu.. :)
తేజ అన్న మీరన్నది నిజం థాంక్యు....
http://satyam332.blogspot.in/...
naa blog lo prma ane shirshika rasanu ... okasari chadavandi ...
thank you
satya garu thappakunda.....
Post a Comment