మనకి ఇలాంటి సందేహం చాలా సార్లు కలిగి ఉంటుంది కదా
కనీసం ఒక సారయిన మనం మనసులో అనుకుని ఉంటాం కదా...
ఒక్కోసారి ఏ కారణం లేకుండానే అ ప్రయత్నంగా మన కంటి నుండి కన్నిటీ ధారా పడుతూనే ఉంది.
తన సాహచర్యం లేకుండా ఈ జీవితాన్ని గడుపుతున్నందుకు...
ఇంకోసారి తన సాన్నిహిత్యంలో గడిపిన మధుర క్షణాలు గుర్తుకు వచ్చినపుడు ఆనందభాష్పాల రూపంలో....
ఇలాంటి అనుభవాలు అనుభూతులు మనదగ్గేరెన్నో ఉండి ఉంటాయి కదా....
తన ఒడిలో కన్న బిడ్డను నిద్రపుచ్చే ఒక తల్లి భూదేవిఒడిలో నిదరోయినవేళ,
విద్యాబుద్దులు నేర్పిన గురువు చివరిసారిగా తన వీడ్కోలు సభలో ఉద్వేగంగా మాట్లాడుతున్న వేళ...
మనకన్ని తానే అయి మననుండి ఏమి ఆశించకుండా ఆకస్మికంగా కన్ను మూసినా ఒక నేస్తాన్ని కడ సారి చూసిన వేళ....
జీవితాంతం తోడు ఉంటుందనుకున్న ప్రేమ బంధం కాలం వేసిన కాటుకి కనుమరుగైన వేళ....
ఇలాంటి జ్ఞాపకాలు మనదగ్గేరెన్నో...
వారెవరో తెలియకుండా మన పరిచయం మొదలవ్తుంది ఒక జ్ఞాపకాన్ని మాత్రం మిగులుస్తుంది..
వీడిపోతే వారి విలువ తెలుస్తుందని కాదు
ఎందుకంటే మనకేందుకో మనం వారిని వీడిపోతామని వారికి దూరంగా ఉంటామనే ఆలోచనే రాదు...
వీటన్నింటికి ఒకే ఒక కారణం
అదే ప్రతి మనిషికి వీడ్కోలు ఒక భాగమేనని...
కాని మనం దీనికి ఒప్పుకోము కాదా...
-నందు