Tuesday, April 26, 2011 - 4 comments

నువ్వు లేకుండా....!


            
                          నువ్వంటే నాకెందుకిష్టమో తెలీదు,
                          నువ్వెందుకు నాకు ప్రత్యేకమో తెలీదు,
                          నీ  గురించి నేనెందుకు  జాగ్రత్త తీసుకుంటానో తెలీదు,
                          నిన్నెందుకు ప్రేమిస్తున్నానో తెలిదు,
                          కాని ఒక్కటి మాత్రం నిజం 
                          నువ్వు లేకుంటే నా జీవితం ఇలా ఉండేది 
                          కాదేమో..!
                                      -నందు 

Friday, April 22, 2011 - 6 comments

ఇంత వ్యత్యాసం ఎందుకో...!





ప్రతి మనిషి జీవితం లో మనల్ని ఇష్టపడే వారు, 
మనం ఇష్టపడే వారు ఉంటారు
మనం ప్రతి సారి మనం ఇష్ట పడే వారితోనే గడపాలి,
వారితోనే మాట్లాడాలి వారి తోనే కలకాలం కలిసుండాలి  అనుకుంటాం...
వారు తిట్టిన సరే వారిని మాత్రం వదిలి ఉండలేం ....
కుదిరితే వారితో, కుధరకపోతే వారి జ్ఞాపకాలతోనైనా  బ్రతికేస్తుంటాం...

కాని,

ఒక్క సారైనా మనల్ని ఇష్టపడే వారి గురించి ఆలోచిస్తామా ?
వారు మనల్ని కలవాలని మనతో మాట్లాడాలని ఎదురు చూస్తుంటారు,
 కాని మనం మాత్రం ఏమి తెలియనట్లు, మాట్లాడే తీరికలేనంత బిజీగా అయిపోతాము.
మనం నిజంగానే బిజీగా ఉంటామ లేక బిజీగా ఉన్నట్లు నటిస్తామా....
 అదికాక వారు మనల్ని విడిచి ఉండలేరన్న ధీమాతోనా  ?    
మనం ఇష్టపడే వారి గురించి ఆలోచించిన దానిలో ఒక బాగామైన మనల్ని ఇష్టపడే వారి గురించి ఆలోచిస్తామా....?
రెండు ఇష్టాలే  కాని ఇంత వ్యత్యాసం ఎందుకో...!

                                            -నందు.
Friday, April 08, 2011 - 2 comments

అలసి పోయా ప్రియా "నీకోసం" ....!


తనని నిజంగా మర్చిపోయాన, లేక మర్చిపోతున్ననా ,
 లేక మర్చిపోయినట్లు నటిస్తున్ననో తెలిదు 
 మనసుకి దేహానికి  శాశ్వత  సంబంధం తెగిపోయినట్లుంది...
నా ప్రమేయం లేకుండానే నా పాదాల  అడుగులు క్యాంటీన్  వైపు పరుగులు తీస్తున్నాయి 
ఆకలితో ఉన్న్న నా కడుపుని  నింపుకోవటానికి  కాదు
ఆద్రుతతో ఎదురు చూస్తున్న నా మనసు తన ముఖారవిందాన్ని  చూడాటానికి , 
నా కనులకు ఎంతకీ  బారం కాదేమో ,
 తను కనిపించదని తెలిసినా  కుడా క్యాంపస్,
కాలేజీ అంతా కలియచూస్తున్నాయి  ...
నా పాదాలకు  ఎంతకీ  అలసట రాదేమో, 
 తను కనిపించదని  తెలిసినా  కూడా తిరుగుతూనే ఉన్నాయి.. 
ఉన్నట్లుంది వెనకి తిరిగి చూస్తుంటాను తను కనిపిస్తుందేమోనని 
కాని అదేంటో తను తప్ప అందరు కనిపిస్తారు నాకు ... 
తన కోసం తిరిగి తిరిగి నా పాదాల నడక కూడా ఆగి పోతుంది... 
ఆగింది  నా పాదాల నడకో, నా ప్రాణమో తెలియదు...
కాని ఒక్కటి మాత్రం నిజం 
ఏనాటికైనా  తను   కనిపిస్తుందనే   చిన్ని ఆశే నన్ను ఇంకా  బ్రతికిస్తుంది.....


అలుసైపోయా,  ప్రియా "నీకోసం" అలసి పోయా ....!
                                  
                                                -నందు 





ఒక కల్పిత కవితకి అక్షర రూపం....
Wednesday, April 06, 2011 - , 4 comments

రాంగోపాల్ వర్మ(ఒక మంచి పిచ్చోడు )




రాంగోపాల్  వర్మ

రాంగోపాల్ వర్మ... ఈ  పేరు వినగానే సిని జనాలకి  కాని, మాములు ప్రేక్షకులకు కాని ఎక్కడ లేని ఇంట్రస్తూ పుట్టుకొస్తుంది..
అటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసుకున్నది కూడా వర్మా నే....
సాదారణంగా జనాలలో పిచోళ్ళు ఉంటారని అందులో మంచి పిచోళ్ళు ఉంటారని నేనంటాను, పిచోళ్ళను కుడా అభిమానించే  పిచ్చి ఫాన్స్ లో నేను మినహాహింపేమి కాదు...

మాములుగా  అయితే మనల్ని మనం పోగుడుకోవటం లో ముందుంటాం ,అదే తిట్టుకోవటంలో అయితే  చివరలో  ఉంటాం.. 
కాని వర్మ తనని తనే ముందు తిట్టుకుని మిగతా వాళ్ళని తరవాత తిట్టడం మొదలెడతాడు...
అందుకు "అప్పలరాజు" సినిమా ఒక ఉదాహరణ మాత్రమే.....
ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ న్యూస్ లో ఉంటూ ,సేన్సషన్ పుట్టిస్తాడు...
పన్నెండు  సంవత్సరాల తరవాత తెలుగు సినిమా అని జనాలంతా  ఎగబడి "అప్పలరాజు" సినిమా కెళ్తే పాపం  చుక్కలు చూపించాడు... 
కామెడీ, ట్రాజెడి  అంటూ తిక మక పెట్టి అర్థం కాకుండా చేసాడు..
వర్మ ఎప్పుడు   అంటుంటాడు నేనేవరికోసం సినిమాలు తీయను అని...
కాని నాకెందుకో మొదటి సారి తను చెప్పింది  కూడా నిజమేమో అనిపించింది...
ఎందుకంటే "అప్పలరాజు" అనే సినిమా ఎవరికీ అర్థం  కావాలో వారికి అర్థం  అయింది, అవుతుంది..
కాని  ఒక్కటి మాత్రం నిజం... 
ఎన్ని ప్లాప్ సినిమాలు  తీసినా జనాలు ఇంకా వర్మ సినిమా చూడటానికి ఇష్టపడతారు ఇది నిజం, 
కారణం ఎందుకంటే  వర్మ అనే ఒక పేరు అనటంలో అతియోశక్తి లేదు....
వర్మ కి భాగ తెలుసు ఫాన్స్ లేకపోతే తన సినిమాలు ఆడవు అని, తను మాత్రం ఈ విషయాన్నీ ఒప్పుకోడు...

ఏదేమైనా  ఎక్కడ ఇంకో రెండు విషయాలు చెప్పాలి..
ఈసారైనా  వర్మ సినిమా భావుంటుదేమోనని  జనాలు తన  సినిమా చూస్తారు...
ఈ సినిమా కుడా భావుంటుంది అని వర్మ సినిమాలు తీస్తాడు..
ఇవన్నీ వదిలేస్తే ఫిలిం ఇండస్ట్రి లో ఇంతక ముందు ఇలాంటి చెత్త (వింత) సినిమాలు తీసిన, ఇక ముందు ఇలాంటి సినిమాలు తీయబోయే  డైరెక్టర్ ఒకే ఒక్కరున్నరూ .....ఆయనే ది గ్రేట్ "రాంగోపాల్  వర్మ"
వర్మ తన ఫ్యూచర్ లో ఇంక వంద సినిమాలు తీసిన జనాలు చూస్తారు .
 దానికి  కారణం జనాలకి "వర్మ" పై, వర్మకి   "జనాల"పై  నమ్మకం..
ఆ నమ్మకమే తనని ఇంక సిని పరిశ్రమలో పేరుతెచ్చి పెడుతుంది...


వర్మ పై అల్లిన ఈ  కథకి మాత్రం స్క్రీన్ ప్లే, డైరెక్షన్  నాదే..
మీ అబిమాని

                 ఎ స్టొరీ బై ఆనంద్ గౌడ్ పెద్దూరి...



Thursday, March 31, 2011 - , 0 comments

మన్నించు మిత్రమా....

నువ్వు నవ్వితే నేనానందించాను
నువ్వు గెలిస్తే నే సంతోషించాను 
నీ గెలుపే నా గెలుపనుకున్నాను 
నువ్వు ఓడితే నే భాద పడ్డాను
నీ కడదాక తోడు ఉండాలనుకున్నాను 
కాని ఈ నేస్తాన్ని అర్థం చేసుకోలేదని  లేదని తెలిసి భాదపడుతున్నాను...
అందుకే  మిత్రమా మన్నించు... 

                                -నందు 
Thursday, March 24, 2011 - , 0 comments

గమ్యాన్ని మరవకు ఓ నేస్తమా....!





నేస్తమా.. 


గతాన్ని మర్చిపో కాని గమ్యాన్ని మరవకు ,
ఏమైనా ఏదేమైనా అనుకున్న లక్ష్యం అందే వరకు అలసిపోకు...
నీవొక వజ్రం మెరిసి చూపించు,
నీవొక నిప్పు కణం వెలిగి చుపించు..
నీలోని శక్తి నీకే తెలుసు 
వెలికి తీసి ప్రపంచానికి చూపించు 
ఎం జరిగిన మన మంచికే...
నిరుత్సాహం   వద్దు, నిర్వేద్యం వద్దు...
ప్రయత్నించి,  ప్రయత్నించి ఫలితాన్ని సాధించు...
పట్టు వదలని విక్రమార్కుడిలా, పద్మవ్యూహం లో అభిమన్యుడిలా 
పట్టు భిగించు, పోరాడు, గెలుపొందు...
నిన్ను నమ్మిన వారి నమ్మకాలు నిలబెట్టు...
నిన్ను హేళన చేసిన వారికి నీవేంటో చూపెట్టు...
అందుకే 
ఏదేమైనా గతాన్ని మర్చిపో కాని గమ్యాన్ని మరవకు......

                                                - నందు 



Friday, March 18, 2011 - 0 comments

నీ జ్ఞాపకం...


బహుశ  నేను తనని ప్రేమిస్తున్నానేమో...
చెప్పాలని ఉంది, కాని చెప్పలేకపోతున్న
తనని  ప్రేమిస్తున్నాననే ఈ ఊహె  చాలా భావుంది ... 
రోజు తనని చూస్తానా,
 తనతో మాట్లాడతానా  అయినా చెప్పాలనిపించదు .....
అయినా ఇప్పుడు భాద పడి ఎం  లాభం అంతా  అప్పుడే చెప్పాల్సింది
తను బ్రతికేదేమో,
నాకోసం, నా ప్రేమకోసం....  
కాలం వేసిన కాటుకి తను కన్ను మూసినా,
కరిగి పోయిన కాలం  నా కన్నీటి సాక్షిగా, 
మా గతాన్ని జ్ఞాపకంగా మార్చినా ,
తను నా నుండి దూరమైంది బౌతికంగానే  కాని మానసికంగా కాదు... 
మిగిలిపోయింది  నా మనసులో మరపురాని తీయని జ్ఞాపకంగా.....

                                                    -నందు 
Friday, March 11, 2011 - , 0 comments

Our relatoinships

By requesting and forcing we cannot maintain more days, any relationship with any one...
if the person really trust YOU,
really believes YOU, they never forgets U
they may be far to you but they always thinks about YOU....!
if they doesn't like YOU they dont care of YOU

Strange but TRUE...
                                                        -Nandu
Thursday, March 10, 2011 - , 0 comments

నేస్తమా ఏది నీ చిరునామా...?





నువ్వే నా అప్తమిత్రుడివన్నావు,

నీ పరిచయం గొప్ప వరమన్నావు,

నీతో మాట్లాడకపోతే రోజు గడవదన్నావు,

చివరికి నువ్వ్వు లేకుండా బ్రతకలేన్నన్నావు,

ఇన్ని చెప్పి చివరికి ఒంటరిని చేసి వెళ్లావు... 

 నేస్తమా మరి ఇన్నాళ్ళు  నటించావా లేక నమ్మించావా...
 
అయితే  మరి ఏది నీ చిరునామా...?


                                -నందు 
Wednesday, March 09, 2011 - 0 comments

ఎవరు నీవు ...?



నాలో ఉపిరి  నీవు..... 

నాలో సగం నీవు... 

నా ఆశ , నా శ్వాస నీవు ...

నా సంతోషం, భాద  నీవు.... 

నా ఉచ్వాస నిచ్వాస  నీవు 

అసలు నాకే  అర్థం  నాలో ఎవరు నీవు.....?
                         
                                        -నందు