Thursday, March 24, 2011 - , 0 comments

గమ్యాన్ని మరవకు ఓ నేస్తమా....!





నేస్తమా.. 


గతాన్ని మర్చిపో కాని గమ్యాన్ని మరవకు ,
ఏమైనా ఏదేమైనా అనుకున్న లక్ష్యం అందే వరకు అలసిపోకు...
నీవొక వజ్రం మెరిసి చూపించు,
నీవొక నిప్పు కణం వెలిగి చుపించు..
నీలోని శక్తి నీకే తెలుసు 
వెలికి తీసి ప్రపంచానికి చూపించు 
ఎం జరిగిన మన మంచికే...
నిరుత్సాహం   వద్దు, నిర్వేద్యం వద్దు...
ప్రయత్నించి,  ప్రయత్నించి ఫలితాన్ని సాధించు...
పట్టు వదలని విక్రమార్కుడిలా, పద్మవ్యూహం లో అభిమన్యుడిలా 
పట్టు భిగించు, పోరాడు, గెలుపొందు...
నిన్ను నమ్మిన వారి నమ్మకాలు నిలబెట్టు...
నిన్ను హేళన చేసిన వారికి నీవేంటో చూపెట్టు...
అందుకే 
ఏదేమైనా గతాన్ని మర్చిపో కాని గమ్యాన్ని మరవకు......

                                                - నందు 



0 comments: