Thursday, August 18, 2011 - , 6 comments

నిజమైన ప్రేమ



ప్రేమ ఈ రెండక్షరాల పదం ఒక పెద్ద ప్రపంచానికి ప్రాణవాయువేమో   అంటే అతిశయోక్తి కాదేమో.....


నేను మొదట్లో ప్రేమ గురించి రాయటం మొదలెట్టినప్పుడు నాలో నాకే  తెలియని అనుభూతి..
ఏవో పెనవేసుకున్న భావాలు నాలో...


నేను ఊహించికుని రాస్తేనే ప్రేమ నిజంగా ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది అలాంటిది నిజమైన ప్రేమను పొందితే అదృష్టవంతులమే  
కదా...


ఈ మద్య కాలం లో మనం తరచుగా వింటున్న మాట నిజమైన ప్రేమ కనిపించట్లేదు దొరకట్లేదు అని....

అదేమన్న వస్తువా ?  వెతికి పట్టుకోవటానికి.... కాదు కదా...

నిజంగా మనం కొంత  మంది ప్రేమికులను చూస్తే  ఇది కూడా ప్రేమేనా అనే సందేహం కలగక మానదు...

అది వారికి (ఆ ప్రేమికులకి)బాగానే ఉండొచ్చు కాని మనకే నచ్చక  

పోవచ్చు.... 

ఇలాంటి ప్రేమలు మనకెన్నో కన్పిస్తూనే ఉంటాయి కదా...

ప్రేమంటే మనసుకి ముసుగులు తొడిగి మురిసిపోవటం కాదు...

నిజమైన  ప్రేమంటే మనం పొందే ప్రేమలో నిజాయితి ఎంత ఉందో 

గ్రహించటమే....

మనం ఎలా ఉన్న మనల్ని ఇష్టపడే కన్నవారి ప్రేమ,

నీలోని మంచితోపాటు చెడుని కూడా స్వీకరించే 

స్నేహితుడి  ప్రేమ

నువ్వెలా ఉన్న, నువ్వు మారినా కూడా తను మారకుండా నిన్ను నిన్నుగా ప్రేమించే వారి ప్రేమ... 

మనకు ఇష్టమైన వారు ఎంత దూరంగా ఉన్న వారి పైన 

ఇంచుక కూడా మారని మునుపటి ప్రేమ...

 ఇదే నిజమైన ప్రేమ..

ప్రేమ ఎప్పుడు కనిపిస్తుంది కాని, నిజమైన ప్రేమ కొన్ని 

సార్లే పుడుతుంది...

వర్షం ఎప్పుడు పడుతుంది కాని  వడగండ్ల వాన కొన్ని 

సార్లే పడుతుంది 


ఒడిసి పట్టుకోవటానికి సిద్దంగా ఉండు వడగండ్లని, 

నిజమైన ప్రేమని కూడా....
                        -నందు


Love Orkut Scraps, love quotes graphics and comments









Monday, August 15, 2011 - , 5 comments

ఇదేనా స్వాతంత్ర్యం ? ఇదేమి స్వాతంత్ర్యం...

కొన్ని వందల ఏళ్ళ చరిత్ర గల ఒక గొప్ప దేశం లో పుట్టినందుకు గర్వపడాలో 


లేక ఇప్పుడున్న పరిస్థితులను తలుచుకుంటూ సిగ్గుపడాలో అర్థం కాని 


సమస్యగా మారింది.



15th august independence day scraps greetings for orkut

కావాలి ఇటువంటి స్వేచ్చ 




పరాయి పాలనలో ఉన్న మన దేశాన్ని రక్షించుకోవటమ కోసం ఎంతో మంది 

త్యాగ ధనులు తమ ప్రాణాలు అర్పించి మరీ  మనకి ఈ స్వాత్రంత్ర్యాన్ని 

సంపాదించి పెట్టారు...

ఈ స్వాతంత్ర్యం సాధించిన తరవాత విషయాన్ని ఒక సారి మనం 

తలచుకుంటే అసలు మనం ఎటువంటి పరిస్థితులలో ఉన్నాము ?

మల్లి స్వాతంత్ర్యం కోసం పోరాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి...


మూడు దఫాలుగా సాగిన ఈ స్వాత్రంత్ర్య  సంగ్రామంలో

చివరి దశలో  సరైన నాయకత్వం లేక దారే తెలియని చీకటిలో ఉన్న మన

భారత దేశానికి  తానే ఒక  వెలుగై  దిక్కుని చూపిన గాంధి గారు, 

సత్యం, అహింసా అనే అస్త్రాలతో ఆంగ్లేయుల గుండెల్లో గుబులుపుట్టించిన 

ఒక మహామహనీయుడు కలలు కన్న  స్వరాజ్యం ఇదేనా ?

ఏ ఆశయం కోసం తెల్లవాళ్ళ లాటి దెబ్బలు రుచి చూసారో ?

ఏ స్వేచ్చ కోసం సత్యాగ్రహం చేసారో ?

అమర వీరులంత దేశాన్ని ఎలాంటి పరిస్థితులలో  చూడాలనుకున్నారో 

అందులో మనం మొదటి మజిలీ లోనే ఉన్నాం అదే స్వాతంత్ర్యం.....

నిజంగా మనకి స్వాతంత్ర్యం వచ్చిందా ?



15th august independence day scraps greetings for orkut
                                                    ఇంకేన్నాల్లి  పేదరికపు దుస్థితి


ఈ ప్రశ కి  మన దగ్గర సరైన   సమాధానం లేదంటే ఆశ్చర్యపడనక్కర్లేదు....


ఎటు చూసిన దొంగలు దోపిడిదారులు వీరికి తోడు తీవ్రవాదులు...

హర్ష ద్వనుల మద్య జరుపుకోవలసిన జాతీయ పతాక ఆవిష్కరణ కొన్ని 

వేల సాయుధ బలగాల మద్య జరుపుకుంటున్నాం అంటే  మన దేశ పరిస్థితి 

ఎలా  ఉందో అర్థం చేసుకోవచ్చు ...



 15th august independence day scraps greetings for orkut
                                       ఓ త్రివర్ణమా  ఎప్పుడు ఎగురుతావిల స్వేచ్చగా ?



అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచినపుడే అసలైన  స్వాతంత్ర్యం అని అన్న ఆ 

మహనీయుడి వాక్కులు గాలిలోనే మిలితమైనట్లున్నాయి .....

కనీస మగవాళ్ళు కూడా ఒంటరిగా బయటికేల్లలేని  పరిస్థితులలో మనం 

బ్రతుకుతున్నాం....

వీటికి తోడు లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ఉంది మన పాలకుల 

పరిస్థితి...

తమకేమి పట్టనట్లు తమదేమి పోలేధన్నట్లు ప్రవర్తిస్తున్న తీరు నిజంగా 

భాదకరం....

కాసులవేటలో కుర్చీల కుమ్ములాటలో కామకేళిలో మునిగితేలుతూ ....

అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా సంపాదించిన  అవినీతి 

ఆస్తులు,అంతస్తులు.  

కదిలిస్తే ప్రపంచానే కుదిపెసేటటువంటి కుంభకోణాలు ఇవేనా ?

అవినీతి సొమ్మంత లెక్కగడితే మన పిల్లలతరాలకి కూడా 

ఉపయోగపదేటంత  సంపద......

మనం చిన్నప్పుడు భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే 

చదువుకున్నాం ఇప్పటికి అదే చదువుతున్నారు   

ఇలాగే ఉంటే మన దేశం ఎప్పటికి అభివృద్ధి చెందుతున్న దేశంగానే 

ఉంటుందేమో... 

Independence day scraps greetings for orkut
                                                కనీసం మీరయినా  చదవండి మన దేశం అభివృద్ధి చెందినది అని.


మన ముందు తరాల పిల్లలు కూడా మన లాగే చదువుకుంటారేమో  

ఉన్నన్నాళ్ళు తెల్లవాళ్ళు  దోచుకున్నారు ఇప్పుడు మన వాళ్ళు  

అనుకున్న  వాళ్ళే మనల్ని దోచుకుంటున్నారు...  

వీళ్ళే సరిగా ఉంటే
కసబ్ లాంటి కసాయిల నుండి  కర్కరే లాంటి అధికారులని వారిని కాపాడుకునే వాళ్ళమేమో... 
వీళ్ళు మన కోసమే పని చేస్తే మరో అన్నా హజారేలు,రాందేవ్ బాబా లాంటి వాళ్ళు మల్లి
 స్వతంత్రం  కోసం (అవినీతి నుండి) పోరాడే పరిస్థితి వచ్చి   ఉండేది కాదేమో..

ఒక సామాన్య పౌరుడిగా ఇలా అనుకోవటం తప్ప ఇంతకంటే ఏమి చేయగలం 
ఒక వేళ మనమేమన్న ప్రయత్నం  చేసిన మనల్ని  అణిచివేయటానికి   పుట్టుకొచ్చే పుట్టగొడుగులు కోకొల్లలు  అని చెప్పనక్కర్లేదేమో...?


                                                               ఎవరినైనా నొప్పిస్తే క్షమించండి.


                                                  -నందు
Saturday, August 13, 2011 - , 0 comments

రక్షాబంధనం శుభాకాంక్షలు.....




Rakhi greetings, wishes and comments for Orkut, Myspace





భిన్నత్వం లో ఏకత్వం గల మన భారత దేశం లో మతాలకి  భాషలకి కొదువ లేదు అలాగే పండుగలకి కూడా...
సాధారణంగా పండుగ  అంటే అందరు కలిసిమెలిసి  ఒక శుభ సందర్భంలో ఏకతాటిపై ఉండి జరుపుకునే ఒక కమనీయ దృశ్యము అని నా ఫీలింగ్...
ఇకపోతే ఇవాళ రాకీ పౌర్ణమి సందర్భం గా నాకు ఈ పండుగ  గురించి తెలిసింది రాయాలనిపించింది...

నీకు నేను రక్ష నాకు నీవు రక్ష మనందరం కలిసి దేశానికి రక్ష అని  ఒక సోదరి  తమ  సోదరులకి రాఖి  కడుతారు, తమ కర్తవ్యాలను గుర్తుచేస్తారు .... 
మరి మనమెంత మంది ఆ కట్టుబాట్లకు  కట్టుబడి ఉన్నాము, ఆ కర్తవ్యాలను నేరవేరుస్తున్నాము  అనేదే నా  చిన్న సందేహం...
కట్ట్లుబాట్లు, కర్తవ్యాలు  మొక్కుబడిగా  కాకుండా  
మనమంతా స్నేహంగా సౌబ్రాతుత్వంతో కలిసిమెలిసి మెలగాలని, ఒకరికొకరు తోడుగా  నిలవాలని కోరుకుంటూ ...
ప్రతి సోదరాసోదరీమనులకు ఇవే నా "రక్షాబంధనం" పండుగ  శుభాకాంక్షలు.....
                                            -నందు.
Rakhi orkut scraps, greetings, cards & comments for Myspace, Facebook
Friday, August 12, 2011 - 5 comments

ప్రేమ కోసం....!









మనిషి ఒకసారి ప్రేమలో పడితే ఏదైనా చేస్తాడు, ఎంతైనా చేస్తాడు..... 
త్యాగమైనా , 
పెళ్ళైనా...
చివరికి చంపటానికైనా, 
చావటానికైనా....
 కాని ఒకటి మాత్రం నిజం ఆ మనిషి తన ప్రేమని చూపించటానికే  ఇదంతా  చేస్తాడు....
నిజంగా ఒక మనిషి  ప్రేమలో పడటానికి కొన్ని యుగాలు,
 కొన్ని సంవత్సరాలు అవసరం లేదేమో ....
ఒక్క క్షణం చాలేమో కంచులా ఉన్న మన   హృదయాన్ని  మంచులా కరిగించి  ప్రేమలో పడేయటానికి ప్రేమ మాధుర్యాన్ని పంచటానికి...
  నేను ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను
ప్రేమలో పడటం కోసం,
 ప్రేమించటం కోసం, 
ప్రేమించబడటం కోసం కూడాను...
                      


                                              -నందు .
Thursday, August 11, 2011 - 6 comments

నా ప్రేమ


ప్రేమ గురించి రాయటం మొదలెట్టినప్పటి నుండి ఈ మధ్య చాలా  మంది 

అడుగుతున్నారు 

ఇంతకి నువ్వు ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరు అని...!

నాకెందుకో ఎప్పుడు ప్రేమించాలనే ఆలోచనే రాలేదు,

ఎందుకంటే ప్రేమంటే ఇది అని కచ్చితమైన అవగాహన నాకిప్పటికి రాలేదు 

ఫ్రెండ్  

ప్రేమ అముల్యమైనది

అందుబాటు  ఉన్నపుడే ఆస్వాదించాలి

ఒక్కసారి ప్రేమ  దూరమైతే ప్రపంచానికి దూరమైనంత  బాధగా ఉంటుంది...

మీకు ఒక్కోసారి అనిపిస్తుంది కదు...! (ప్రేమలో ఉన్న వాళ్ళు, ప్రేమలో పడ్డ 

వాళ్ళు).

ప్రేమ గురించి రాయటానికి కచ్చితంగా ప్రేమించాల్సిన అవసరం లేదేమో...

ప్రేమని ఆస్వాదించినా  చాలేమో...

ప్రేమంటే ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య ప్రేమే కానవసరం లేదు

మనసున్న ఏ రెండు హృదయాల మధ్య అయినా ఉండొచ్చు.... 
 
నేను ఆస్వాదిస్తున్నాను అందుకే రాస్తున్నాను. 





                                             -నందు  
                                      





                                           
Monday, August 08, 2011 - , 4 comments

ఒక వర్షాకాలపు సాయంత్రపు వేళ...!





అదొక వర్షాకాలపు సాయంత్రం అందులోనూ అమావాస్య,ఆకాశం కారుమబ్బులతో నిండిపోయింది, ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయి... 
అప్పుడప్పుడే చీకటి పడుతుంది, నేను ఆఫీసు నుండి  బయలుదేరే సమయానికే చాలా చీకటి పడింది,
ఇంటికి వెళ్ళాలనే తొందరలో నేను వడి వడిగా అడుగులు వేస్తున్నాను నా అవస్థ చూసి మేఘాలకి కూడా జాలేసినట్లుంది
అందుకేనేమో కన్నీరు కారుస్తుంది (వర్షం కురవటం మొదలయింది)....!
నేను అలా నడుస్తూనే ఉన్నాను, నా వెనకాల ఏదో అలికిడి వినిపిస్తుంది ఎవరో నాలాగ ఇంటికి వెళ్ళాలనే తొందరలో ఉన్నట్లున్నారు నేనేమి పట్టించుకోకుడా త్వరత్వరగా నడుస్తున్నాను.... 
ఇంతలో ఒక్కసారిగా  నా అవస్థకు  బాదపడుతూ  మెరుపులు మారోసారి రోధించాయి(మెరిసాయి), ఇంతలో ఒక అందమైన ఆకారం నన్ను దాటుకుంటూ వెళ్లిపోయింది... 
 అంత వరకు తెలియదు ఇంత సేపు నా వెనకాల నుండి నడుస్తున్నది ఒక అందమైన అమ్మాయి అని.... ఎర్రటి ఆ మెరుపులో,  ఎర్రటి నిండైన చీరలో తన  మొహాన్ని చూసాను.... దేవలోకం నుండి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది తన రూపం, ఆ కళ్ళైతే మరీను ఎంత సేపు చూసినా తనివితీరదేమో....
చూసిన క్షణం లోనే ఒక్కసారి ఆకాశపుటంచులదాక  అలా అలా తేలియాడి వచ్చాను...
తను వెళ్తూనే ఉంది నేను త్వరగా తేరుకుని తన  వెంటే వెళ్ళాను తనతో ఎలాగైనా మాట్లాడాలనిపించింది ఇక దైర్యం  చేసి తన పక్కకి వెళ్ళాను  అంత లోపే తను నా వైపు చూసింది ఆ కళ్ళల్లో ఏదైనా శక్తి దాగి ఉందేమో... ఒక్కసారిగా నా మనసును  తనవైపే లాగేసింది అదేదో గురుత్వాకర్షణ శక్తి లాగ....
తను ముందు నన్ను చూసి ఉలిక్కి(బయపడినా) పడినా, నా అవస్థ చూసి కళ్ళతోనే మట్లాడేసింది... 
"ఎం మాట్లాడాలో తెలీక మీతో నడవవచ్చా అని అడిగాను.... తను కాసేపు ఏదో ఆలోచించింది, తరువాత  చిరునవ్వు నవ్వి  నా చేతిని  అందుకోబోయింది......
అంతలోపే

అగ్ని పర్వతం నుండి పొంగుతున్న లావాను ఉప్పొంగిన సముద్రపు కెరటాలు ముంచేసినంత   ఫీలింగ్...
 చిన్నపాపలాగా గెంతుతూ తీరాన్ని తాకబోతున్న ఒక చిన్న అలను  తిమింగలం లాంటి ఒక పెద్ద అల మింగేసినట్లు.... 
నాకొచ్చిన ఒక అందమైన "కల"ను నా మెలకువ మింగేసింది.........
                                                                     -నందు
Sunday, August 07, 2011 - , 14 comments

అమ్మకో ఉత్తరం



ప్రియమైన అమ్మకి ఎలా ఉన్నావ్ ?
నీకేం భావుంటావ్  ఎందుకంటే నేనున్నాను కదా నీకు...! (అని నేననుకుంటాను కాని, నువ్వే నన్ను కంటికి రెప్పల  చూసుకుంటావని  నేనెప్పుడు అనుకోను )
సృష్టిని సృష్టించిన సృష్టి కర్తవి నీవు 
ప్రపంచానికి ప్రేమను పరిచయం చేసిన ప్రేమ మూర్తివి నీవు 
మా స్వార్థం కోసం నీ జీవితాన్నే త్యాగం చేసిన త్యాగ మూర్తివి నీవు 
నాకు చాలా సార్లు అమ్మ నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాలనిపించింది,
కాని నేను చెప్పేలోపే నీకు నేనంటే ఇంత ఇష్టమో నా మీద నీకెంత ప్రేముందో చూపిస్తావు చూడు ఆ ప్రేమ ముందు నా చిన్ని ప్రేమ బలాదూర్ అనిపిస్తుంది అందుకే నాకెప్పుడు చెప్పాలనిపించదు
నేనే తప్పు చేసినా నన్నే వెనకేసుకోస్తావు  చూడు, ఆ  ప్రేమను చూసి నాలో గర్వం మరింత పెరుగుతుంది..
నా మనసులో ఏముందో నాకే అర్థం కాదు అలాంటిది, నేను ఎపుడైనా ఏదైన  మనసులో అనుకునే లోపే చేసి పెడతావు
డాక్టర్  కంటే ముందుగా నా మౌనాన్ని పసిగాడతావు 
నేను ఎప్పుడైనా నీతో మాట్లాడామని ఫోన్ తీసి నెంబర్ నొక్కుతుంటే నాకన్నా ముందే నువ్వే ఫోన్ చేస్తావు  (నాకు ఇప్పటికి ఆశర్యమే నువ్ నా గుంచి ఆలోచిస్తావని కాని నువ్వు నా కోసమే బ్రతుకుతున్నవని నేను ఇంకా అర్థం  చేసుకోను ఎందుకని ) 
నువ్ గెలుస్తావ్  కన్నా... అని నా నుదిటి మీద ముద్ధాడుతావ్ చూడు 
ఆ ముద్దు నా  గెలుపుకి మూలం అని అనుకోను నేను... 


నీ గురించి ఎంత రాసుకున్న, ఎంత మాట్లాడుకున్న 
నాకు ఎప్పుడు ఒక బాధ ఉంటూనే ఉంది
అదే నీకోసం ఎం  చేయలేదనే బాధ...



ఇలాంటి  ఉత్తరాలు ఇప్పటికి చాలా సార్లు రాసాను కాని 
నీకు పంపించాలనిపించదు 
ఎందుకంటే నా మనసునే చదివేసావు కదా 
ఈ ఉత్తరంలో ఎం రాసానో ఈపాటికే నీకు తెలిసిపోయి ఉంటుందనే....


                                                        -నీ నందు 




Wednesday, August 03, 2011 - , 7 comments

జగమంత ప్రేమ



ప్రేమంటే ఏంటి...?  ప్రేమంటే ఇదేనా ... ఇంకేదోనా....?
నాకెందుకో చాలా సార్లు ఈ ప్రేమ గురించి రాద్దమనుకున్నపుడల్లా ఇంతకి ప్రేమంటే ఏంటి అనే ప్రశ్న మొదలవుతుంది...
నాకు తెలిసి ఈ భూప్రపంచం మీద ఇదే ప్రేమ అని సరైన నిర్వచనం ఇచ్చిన వారు లేరేమో...
 ఎందుకంటే వారి దృష్టిలో  ప్రేమ కి నిర్వచనం అదేనేమో, మనకి అది నచ్చదేమో .... 
మనం సరిగ్గా ప్రేమంటే ఇదేనేమో అని ఒక భావనకి  వచ్చేలోపే ప్రేమంటే ఇదేనా  అనే సందేహం కూడా మొలకెత్తుతుంది ఒక్కసారి ...
మనం ప్రేమించిన నిచ్చెలి మనతోపాటే ఉంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోయి  ఇదేనేమో ప్రేమంటే అని మనం అనుకునే లోపే,
 మన కంట్లో ఏ చిన్న నలుసు పడినా మనకంటే ముందు తన కంట్లోంచి నీరు కార్చే కన్న తల్లి ప్రేమను చూసి ఇంత కంటే గొప్ప ప్రేమ ఉండదని ఎప్పుడు చెప్పుకుంటాము...
మన చిన్నప్పుడు నడిస్తే కాళ్ళు నొప్పెడుతాయని తన మోకాళ్లను మన కాళ్ళుగా మార్చి(మనకు కాళ్ళుగా అమర్చి)  మనల్ని నడిపించిన నాన్న ప్రేమ,
 ఎప్పుడు మనతో పోట్లాడే అక్క ప్రేమ, 
ఏ పరిచయం లేకుండానే  మన జీవితంలోకి ప్రవేశించి అడక్కుండానే అన్ని చేసి పెట్టే  ఆప్త మిత్రుడి ప్రేమ....
ఇవన్నీ  ఎప్పటికప్పుడు ప్రేమ అనే పదానికి నిర్వచనాన్ని  మారుస్తూనే  ఉన్నాయి....
ఒక్కోసారి ఒంటరి తనంలో కుడా  ప్రేమను  పొందే మనం ప్రేమలో ఇన్ని రకాలను ఆస్వాదించాక,
 ఏ ఒక్క అనుభూతినో లేక, ఏ ఒక్క  అనుభవాన్నో ప్రేమనుకోవటం పొరపాటే ...
ఎందుకంటే ప్రతి "ప్రేమ" మనకు  "ప్రేమ" గానే ఉంటుంది.
 మరి నిజమైన ప్రేమ ఏంటంటే  మనం పొందే  ప్రేమలో ఎంత వరకు నిజాయితి ఉందో గ్రహించడమే ...
ఆ  నిజమైన  ప్రేమ ఆనేది ఏంటో తెలుసుకునేలోపే, 
దాన్ని గ్రహించేలోపే మనం ఆ ప్రేమకే దురమవుతామేమో... 
ఒక్కోసారి ఈ జీవితానికి  కూడా.... 
                                                                    
                                      -నందు 
Sunday, July 31, 2011 - , 11 comments

ఎం కోల్పోతున్నాం మనం ?


మనం  జీవితంలో ఏదో కోల్పోతున్నాము,
శాస్త్రీయ విజ్ఞానంలో ఎంత వేగంగా అబి వృద్ది చెందుతున్నమో 
 మానవీయ విలువలను మాత్రం అంతకు మించిన వేగం తో అంతరించుకుంటున్నాము .

ఒక సారి గతం లోకి తిరిగి చూసుకుంటే..
కల్మషం లేని చిరునవ్వులు,
ప్రేమానురాగాలతో పెనవేసుకున్న బంధాలు,
అభిమానం, ఆప్యాయతలతో అలుముకున్న అనుబంధాలు, 
కాఫీ కబుర్లతో కాలాన్ని మించిన కాలక్షేపాలు, 
అంతేనా, ఇవన్నీ పై పెచ్చుకే......
కాని ఇదంతా ఒకప్పుడు

ఇప్పుడున్నదల్ల  
పైపైకి ప్లాస్టిక్ నవ్వులు, రెడీమేడ్ బంధాలు, 
డాలర్ల  మోజులో దూరమైన అనుబంధాలు,
మాట్లాడే తీరిక లేక "మిస్ యు" అంటూ మెసేజులు,
కంప్యూటర్లతో  కాపురాలు, మరయంత్రాలతో  మీటింగులు...
ఇవేనా ఇంక ఎన్నెన్నో..!

ఎన్ని కోల్పోయినా 
జీవచ్చవంలా  బ్రతుకుతూ ప్రాణాలు కోల్పోకుండా మిగిలింది మన ప్రాణమొక్కటే ...  
'కోట్ల'కు వెలకట్టలేని ఆస్తులను కోల్పోయాక 
'పైసా'కి పనికిరాని ప్రాణమెందుకో ......    
                                  
                                      -నందు 
                               



Saturday, July 30, 2011 - , 0 comments

గమ్యాన్ని వెతుక్కుంటూ....



వెళ్తున్నా వెళ్తున్నా దూరంగా వెళ్తున్నా
కానరాని దూరాలకు, కనిపించని తీరాలకు....
పయనమెటో తెలియదు పాదాల అడుగులు ముందుకే  
గమనమేటో తెలియదు కాని గమ్యాన్ని చేరేటందుకే...


-నందు