Wednesday, December 31, 2014 -
0
comments
నూతన సంవత్సర శుభాకాంక్షలు
కోరిక-తీరిక
కూర్చుని మాట్లాడితే
చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది
కాని కూర్చోవాలనే కోరిక
మాట్లాడాలనే మక్కువ లేకే
చాల విషయాలు గోడవలకి,
విభేదాలకి దారి తీస్తాయి
-నందు
స్వీయానుభవంతో తెలుసుకోవలసిందే...!!!
సముద్రంలో ఉండే చేప కన్నీళ్ళు ఎవరికీ కనిపించవు,
ఒక వేళ అవి కనిపించినా ఎవరికీ అర్థం అవ్వవు...
మనిషి జీవితం కూడా అంతే
ప్రతి మనిషికి కన్నీళ్ళు, బాధలు ఉంటాయి...
కాని ఆ కన్నీళ్ళ వెనకాల కారణాలు
ఎవ్వరికి కనిపించవు,
ఒక వేళ కనిపించినా
వారి కష్టాలు ఎవ్వరికి అర్థం అవ్వవు...
ఏవైనా స్వీయానుభవంతో తెలుసుకోవలసిందే...!!!

Wednesday, December 10, 2014 -
నిజాలు,
ప్రేమ,
ప్రేమలు రకాలు,
ఫీలింగ్స్,
బాధ
0
comments
ప్రేమంటే గుర్తుకురావటం కాదు, గుర్తుంచుకోవటం...!!!
Monday, October 27, 2014 -
నిజాలు,
ప్రత్యేకం,
ప్రేమ,
ప్రేమలు రకాలు,
ఫీలింగ్స్,
బాధ,
సత్యాలు
0
comments
ఎదురుచూపులో ప్రేముంటుందా ???
ఎదురు చూపులో ప్రేముంటుందా....!!!
సైన్యంలో పనిచేసే కొడుకు కోసం తల్లిదండ్రులు/భర్త కోసం భార్య ఎదురుచూస్తుంటారు.
ఎప్పుడు తనోస్తాడో లేక,
ఏ వార్త వినాల్సి వస్తుందోనని....
రోజు వచ్చే సమయానికి మనం ఇంటికి రాకపోతే కంగారు పడి,
మనకి ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తుంటారు, అదే ప్రేమంటే...
రోజు సాయంత్రం ఆరింటికి నీవస్తావని తెలిసికూడా,
ఐదున్నరకే గుమ్మం వైపు చూస్తుంటుంది నీ భార్య, అదే ప్రేమంటే...
ఎక్కడో ఇంటికి దూరంగా మనకోసం పని చేసే నాన్న
నెలకోసారి వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు
మళ్ళి ఎపుడోస్తాడని ఎదురుచూస్తుంటాం
ఆ ఎదురుచూపే ప్రేమ...
నిన్నంతా మనతోనే ఉన్న మనం ప్రేమించిన అమ్మయికోసమో/ అబ్బాయికోసమో
అందరికంటే ముందుగా క్లాసు కి వెళ్లి తనకోసమే ఎదురుచూస్తుంటాం...
అదే ఎదురుచూపులో ప్రేమ...!!!
లోకం నింద కోసం సీతని అడవుల్లోకి పంపి,
సీత కోసమే పరితపించాడు రాముడు
తనెక్కడుందో తెలిసి కూడా చూడటానికి వెళ్ళలేదు...
ప్రేమ లేకనో, ఇష్టం లేకనో కాదు,
సమయం, పరిస్థితులు అనుకూలించక.
సీత కోసం రాముడు, శ్రీరాముడి కోసం సీత...
ఇలా ఒకరికొకరు ఎదురు చూస్తూ ఉండిపోయారు,
ఇదేనేమో ఎదురు చూపుల్లో ప్రేమంటే....
నేను రాముడంత గొప్పవాడిని కాదు కాని, నీవెప్పుడు నా సీతవే...
కేవలం నీకిచ్చిన మాటకోసం,
నీవెక్కడుంటావో తెలిసి కూడా,
రెండు నెలలుగా నాతో నేను నిశబ్ధ యుద్ధం చేస్తూ,
అనవసరమైన వాటిని కూడా భరిస్తూ,
నీకోసం, కేవలం నీ మాట వినటం కోసమే
ఎదురు చూస్తున్న నేను...

జీవితంలో పెళ్ళే చేసుకోవద్దనుకున్నాను...!!!
జీవితంలో పెళ్ళే చేసుకోవద్దనుకున్నాను,
కాని నిన్ను చూసాక, నీతో పరిచయం అయ్యాక
నిన్ను తప్ప వేరే వాళ్ళని చేసుకోవద్దని నిర్ణహించుకున్నాను
అంతలా మారిపోయేలా చేసావు,
ఎప్పుడు ఇలాంటి అమ్మాయి, అలాంటి అమ్మాయి
అవి, ఇవి అని ఏ క్వాలిఫికేషన్స్ పెట్టుకోలేదు...
నిన్ను చూసినప్పటి నుండి నేను పెట్టుకున్న క్వాలిఫికేషన్స్ అన్ని నువ్వే...
అన్నింట్లోను నువ్వెలా ఉన్నావో అలానే ఉండాలనుకున్నాను
నా జీవితం లో ఇంతగా ప్రేమించిన ప్రేమిస్తున్న జీవితాంతం ప్రేమించే ఏకైక వ్యక్తివి
నువ్వే చెలీ ...
నిన్ను తప్ప ఇంకేవ్వరిని ఊహించుకోలేను కూడా...
నీకోసం ఎదురుచూస్తున్న నేను -నందు
నీకెప్పుడైనా చావాలనిపించిందా ??
నీకెప్పుడైనా చావాలనిపించిందా ??
ప్రతి చిన్న విషయానికి చావే పరిష్కారం కాకూడదు
ఏమో నీ సమస్య పెద్దదే కావచ్చు,
కాని చావుకంటే పెద్ద సమస్య లేదేమో ఈ భూమ్మీద...!!!
బ్రతకటానికి ఏ దారైనా దొరుకుతుంది
కాని సమస్యోచ్చినపుడల్లా చావే రహదారి కాకూడదు
ప్రతి చిన్న బాధకి, నొప్పికి చావే మందు అయితే
నువ్వీ భూ ప్రపంచం మీదికి వచ్చేవాడివి కాదేమో...!!!
ఎందుకంటే ప్రసవ వేదనను భరించలేక నీ కన్న తల్లి అప్పుడే చనిపోయేదేమో...!!!
బాధను భరించు అప్పుడే జీవితం విలువ తెలుస్తుంది
బ్రతకాలనే ఆశను బ్రతికిస్తూ,
చావాలనే కోరికను చంపేస్తు బ్రతుకు....!!!
-నందు
మిత్రుడి మరణానికి నివాళీగా....

స్వేచ్చకి అడ్డుపడకు...!!
జీవితంలో
ఎవ్వరికి అధిక ప్రాధాన్యత ఇవ్వకు...!!!
ఒక వేళ
నువ్వు ఎవరినైనా భాగా ఇష్టపడితే
వారికి
స్వేచ్ఛనివ్వు, వారి స్వేచ్చకి కూడా అడ్డుపడకు...!!
వారు కూడా
నిజంగా నిన్ను ఇష్టపడితే వారే తిరిగి జీవితంలోకి వస్తారు
ఒక వేళ
వారు తిరిగి రాలేదంటే నీ జీవితమనే పుస్తకంలో
వారి పేజి
సమాప్తమని అర్థం...
వినటానికి
ఇలాంటివి భానే ఉంటాయి,
కాని
భరించటానికి మాత్రం భరించలేనంతగా భాదగా ఉంటాయి
కాని
ఇలాంటివి మనకేవ్వరు చెప్పరు..
మనకు
ఎవ్వరు ఇలాంటివి చెప్పినా అర్థం కావు
ఒకటి
మాత్రం నిజం కొన్ని స్వీయానుభవంతోనే తెలుసుకోవాలి
-నందు
Friday, August 08, 2014 -
జీవితం,
నిజాలు,
ప్రత్యేకం,
సత్యాలు
0
comments
బ్రతకటం మాత్రం కామన్
ఒంటరితనం ఒక భాద్యత...!!!
ఏమి వద్దనుకున్నపుడు,
అన్నింటిని వదిలేసుకోవాలనుకున్నపుడు,
అన్ని బంధాలను వద్దనుకున్నపుడు
ఒంటరిగా బ్రతకటం పెద్ద కష్టమేమి కాదు
నేను ఎవ్వరికి ఏమి కాను
నన్ను ఎవ్వరు పట్టించుకోరు అని బాధ పడేకంటే
నాకు ఎవ్వరు లేరు, నేనెవ్వరిని పట్టించుకోను
అని బ్రతికితే ఒంటరితనం పెద్ద కష్టమేమి కాదు
అది ఒక బాధ్యతలా మారుతుంది
-నందు
Tuesday, July 15, 2014 -
నిజాలు,
ప్రత్యేకం,
ఫీలింగ్స్
4
comments
మౌనంగా ఉంటాను,మాట్లాడాలని లేక....!!!
Saturday, May 24, 2014 -
review,
ప్రత్యేకం,
రివ్యూ
2
comments
"మనం"దరం చూడాల్సిన సినిమా:మనం...!!!
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, నేనొక్కడినే తర్వాత
నేను రివ్యూ రాసిన నాలుగవ సినిమా: "మనం"
మళ్ళి మన తెలుగు చిత్ర పరిశ్రమలో..
చాలా రోజుల తర్వాత మళ్ళి ఒక మంచి సినిమా
ఎప్పుడు రొటీన్ గా 6 పాటలు, 4 పైట్లు, అవే కథలతో కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు కూడా వస్తాయ్, ఇక ముందు కూడా కొత్త రకమైన సినిమాలను తీయొచ్చు అని మరోసారి చాటి చెప్పిన చిత్రం "మనం"
మంచి సినిమాలు రావట్లేదు అని గగ్గోలు పెట్టే జనాలకి కనులవిందు ఈ సినిమా...!!!
తెలుగు దర్శకుల్లో ప్రతిభకి కొదవలేదు అని మరోసారి నిరూపించిన చిత్రం "మనం"...!!!
ఆ మధ్య కాలంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది సినిమాలు బంధాలు, అనుబంధాలు అనే అంశాలపై తీసి తెలుగు ప్రజల హృదయాని దోచుకుంటే...
చాలా రోజుల తర్వాత మళ్ళి ఒక చక్కటి కుటుంబ చిత్రం "మనం"
హంగు ఆర్భాటాలకి పోకుండా, కథని, దర్శకుడ్ని నమ్మి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందీ మనం...
అక్కినేని నాగేశ్వరరావు గారి నుండి నాగ చైతన్య వరకు,
శ్రీయ నుండి సమంతా వరకు...
ఎవరికీ ఎవరు తగ్గకుండా పాత్రలకు రూపం పోసిన అందమైన కథాంశమే ఈ "మనం"...
అమితాబ్ బచ్చన్ గారు,అమల,అక్కినేని అఖిల్ వీళ్ళంతా మెరుపులా కనిపిస్తారు..
కాని దర్శకుడు విక్రమ్ కుమార్ కథని నడిపించిన విధానం అద్భుతం ఒక తరంని దృష్టిలో పెట్టుకుని సినిమా తీయటమే కష్టమైన ఈ రోజుల్లో మూడు తరాలను కలిపి రెండున్నర గంటల్లో ఒక అందమైన సినిమా తీసిన అతని పొగడకుండా ఉండలేం,
మాటలు, ఫోటోగ్రఫీ, కెమెరా పనితనం, సంగీతం ఇలా అన్ని సరిగా కుదిరిన సినిమా అందమైన సినిమా "మనం"
ఖర్చుకి వెనకడుగు వేయకుండా ఎక్కడ కూడా తగ్గకుండా సినిమాని ఒక ఫ్రెష్ లుక్ లో ప్రెసెంట్ తీరు అమోఘం..
కథని నేను చెప్పదలుచుకోలేదు కాని చెప్పాలనుకున్నదల్లా ఒక్కటే
"మనం" మంచి సినిమా
కొన్ని సన్నివేశాలు హృదయాల్ని స్పృశిస్తాయి
తెలుగు చిత్ర పరిశ్ర్హమ లో "మనం" మరో మైలురాయి అవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు
అక్కినేని గారికి అశ్రునయనాలతో నివాళి అందించే అందమైన సినిమా
"మనం" మంచి ఫీల్ ఉన్న సినిమా...
కుదిరితే మీరు ఈ సినిమాని చూడండి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే కాని చూడండి ఒక మంచి సినిమా చూసామన్న సంతృప్తి మాత్రం తప్పకుండా కలుగుతుంది..
మార్పును స్వాగతించండి మంచి సినిమాలను ఆదరించండి
-ఎ రివ్యూ బై నందు.
Thursday, May 08, 2014 -
నిజాలు,
ప్రత్యేకం,
ఫీలింగ్స్,
సత్యాలు
2
comments
పిచ్చోళ్ళు - గొప్పోళ్ళు
Friday, April 25, 2014 -
4
comments
అడుక్కునే వాళ్లోస్తున్నారు జాగ్రత్త...!!!
వస్తున్నారు వస్తున్నారు అడుక్కునే వాళ్ళు
రోజుకో పార్టీ మార్చి, రాజ్యంగా సిద్ధాంతాలను పక్కకు పెట్టి,
తన స్వార్థం కోసం ఏమైనా చేయగల సిగ్గు మాలిన నాయకులు
పూటకో మాట మార్చి మనల్ని ఎమార్చేవాళ్ళు వస్తున్నారు...!!!
అది చేస్తాం, ఇది చేస్తాం,
అవసరమైతే ప్రాణాలిస్తాం అంటారే గాని
ఇప్పటి దాక జరిగిన ఉద్యమాలలో
ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా
ప్రాణ త్యాగం చేశాడా ??
పదవినే త్యాగం చేయాని వాడు ప్రాణాన్ని ఎం త్యాగం చేస్తాడు ??
ఏ పదవి ఆశించని నాయకులు ఎంత మంది ఉన్నారీ స్వతంత్ర బారత దేశంలో ??
టికెట్ ఇస్తే పార్టీలో ఉండుడు లేదంటే మరోక దాంట్లోకి దూకుడు..!!!
నా వల్లే అదోచ్చింది ఇదొచ్చింది
అంటూ బొంకే దొంగనాయ(కు)లను నిలదీసే హక్కు నీ వోటు
వృధా చేయకు నేస్తం నీ వోటు వృధా చేయకు
తల తాకట్టు పెట్టి అయినా అది చేస్తాం ఇది చేస్తాం
అనే వాడి మాటను నమ్మకు
గుర్తుంచుకో
వాడు తాకట్టు పెట్టేది నీ నమ్మకాన్ని ,
నీ ఆత్మాభిమానాన్ని,
మన భారత జాతి గౌరవాన్ని...!!!
ఎన్నికల్లో ఆఫిడవిట్ దాఖలు చేసినప్పుడు
సొంత కారు కూడా ఉండదు కాని
వీళ్ళు మాత్రం ఖరీదైనా వాహనాల్లో తిరుగుతారు.
ఎవరు చేసిన పుణ్యమో ? లేక ఎవరికీ చేసిన ప్రతిఫలమో మరి...!!!
ఆస్తి లక్షల్లో ఉందంటారు,
కోట్లు కొల్లగొట్టి తిరుగుతుంటారు....
మన బ్యాంకుల్లో అప్పుంటుంది
"అసలు" మాత్రం స్విస్ బ్యాంకుల్లో నిద్రపోతుంటుంది... !!!
కొటరు కోసం నువ్వు ఆశపడకుండా ఉంటేనే బెటరు
అప్పుడే చేయగలవు నీవీ సిస్టంని మానిటరు... !!!
నీ భవిష్యత్తు వాడిచ్చే 500ల నోటులో లేదు,
నువ్వేసే ఓటుతో వచ్చే అయిదేళ్ళ ప్రభుత్వంతో నువ్ చేయించే(చేయించుకునే) పనులలో ఉంది....
ఓటు వేయటం కోసం అడుగు ముందుకేయ్
అడుగేయ్ అడిగి కడిగెయ్
నీ ఓటుతో దుమ్ము దులిపేయ్
కాని నువ్ ముందు వోటు వేయ్
-నందు
Thursday, April 24, 2014 -
ప్రత్యేకం,
ఫీలింగ్స్
1 comments
సచిన్ కో ఒక ఉత్తరం...!!!
నేను పుట్టిన కొన్ని రోజులకే నువ్ క్రికెట్ ఆడటం మొదలెట్టావు,
నాకు క్రికెట్ గురించి ఊహ తెలిసే సరికి క్రికెట్ లో నువ్వొక సంచలనం..
అప్పటికి మా ఊర్లో క్రికెట్ అనే ఆటని ప్రత్యక్షంగా చూసే అవకాశమే లేదు
ఒక సారి రేడియోలో క్రికెట్ వస్తుంది మద్యలో "సచిన్ సాచిన్" ఇలా వినిపిస్తుంది,
నేను మొదట్లో అనుకునే వాడ్ని ఇది కూడా ఒక రకమైనా మంత్రమేమో(గాయత్రి మంత్రం లాగా ) అని కాని అప్పుడే తెలిసింది సచిన్ అనేది నీ పేరని
అలా రేడియో లో నీ ఆటని వింటూ అలవాటు పడుతుండగా
ఒక సారి వేరే ఉరు వెళ్ళినపుడు అదిగో అక్కడే మొదటి సారి నీ ఆటని,
క్రికెట్ ని చూసింది కూడా అక్కడే...
కొన్ని రోజులకి పేపర్లో నీ ఫోటోలని చూస్తూ వాటిని మా ఇంట్లో గోడలపై అతికించుకుని మురిసిపోయే వాడ్ని
నాకింకా గుర్తుంది సచిన్ మీ నాన్న చనిపోయిన తరువాత నువ్ సెంచరీ చేసి మీ నాన్నకి అంకితం చేసిన తీరు ఎప్పటికి పదిలమే
రాను రాను మా ఊర్లో కూడా మధ్యాన్నం కరెంటు ఉండటం,
టీవీ అతుక్కుపొవటం సాధారణం అయిపోయాయి
క్రికెట్ మ్యాచ్ వస్తే చాలు, బాటింగ్ ఎవరిదీ సచిన్ స్కోర్ ఎంతా ?
ఈ ప్రశ్న కొన్ని సంవత్సరాలుగా నాకు అలవాటైంది
నాకు బాగా గుర్తుంది నువ్ ప్రపంచ కప్ లో ఆడిన తీరు
ముఖ్యంగా పాకిస్తాన్ పై నువ్వాడిన తీరు అమోఘం
అలా ఎప్పటికప్పుడు నిన్ను నువ్వే ప్రతిసారి సృష్టించుకుంటూనే ఉన్నావు
ఇక నీకు బాగా ఇష్టమైన సాయి బాబా చనిపోయినపుడు,
ప్రపంచ కప్ గెలిచినప్పుడు చిన్నపిల్లాడిలా నువ్ గెంతులేసినప్పుడు ..
అలా నిన్ను చూసి "ఇలాంటి కల్మషం లేని నీ మనసు ఎంత మందికి ఉంటుంది" అని
నాలా ఎంత మంది అనుకున్నారో నీకేం తెలుసు ?
చివరికి మేము కలలో కూడా ఇలా వినోద్దనుకున్న మాట నీ రిటైర్మెంట్
ఆ మాట విని ఎన్ని గుండెలు పగిలాయో, ఎంత మంది రోధించారో...!!!
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎన్నో మ్యాచ్ లు జరుగుతాయి కాని
ఆ మ్యాచ్ మాత్రం మేం బ్రతికి ఉన్నంత వారకి మరవం
ఆ రోజు ఎవరు గెలుస్తారని కాదు, అది ప్రపంచ కప్ ఫైనల్ కానే కాదు
మా దృష్టిలో అది మాకు గొప్ప మ్యాచ్ అదే నీ ఆఖరి మ్యాచ్,
నువ్వు సెంచరీ చేయాలనీ కాని,
నువ్ ఎక్కువ పరుగులు చేయాలని కాదు
మా దృష్టంతా నీ పైనే నువ్వు గ్రౌండ్లో ఉంటే చాలని,
మొదటి సారిగా మన మ్యాచ్ ఇన్నింగ్స్ డిక్లేర్ ఇచ్చి మళ్ళి వాళ్ళని బ్యాటింగ్ కి పంపాలనిపించింది,
వాళ్ళని త్వరగా అవుట్ చేసి మళ్ళి నీ బాటింగ్ చూడొచ్చని ఆశ అదే నీ చివరి మ్యాచ్,
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక బ్యాట్ మెన్ 200వ మ్యాచ్ ...
చివరికి ఆ రోజు రానే వచ్చింది
అదే నీ వీడ్కోలు స్పీచ్..
ఎంతో మంది తమ పనులు పక్కన పెట్టి,
ఎంతో మంది తమ ప్రయాణాలు వాయిదా వేసుకుని మరీ చూస్తున్నారు
ఎందుకంటే మళ్ళి నువ్వెప్పుడు ఇలా మాట్లాడవేమో...!!
నువ్ మాట్లాడుతుంటే మా మనసంతా నిశ్శబ్దం
ఒక పాతికేళ్ళ కుర్రోడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు తనేమి పరీక్షలో ఫెయిల్ అవ్వలేదు, ప్రేమలోనూ ఫెయిల్ అవ్వలేదు,
గుక్కతిప్పుకోకుండా ఏడుస్తున్న ఒకమ్మాయిని తన తండ్రి ఒదారుస్తున్నాడు తనేమి అత్తారింటికి వెళ్ళట్లేదు,
మద్యస్థ వయసులో ఉన్న ఒక భార్య భర్త తమ బంధాన్ని నెమరువేసుకుంటున్నారు
ఒక తల్లి తన కొడుకుని గుర్తు చేసుకుంటుంది,
ఒక తండ్రి మౌనంగా రోదిస్తున్నాడు,
ఒక గురువు పొంగిపోతున్నాడు,
ఇలా ప్రతి ఒక్కరు తమలో తామే, నిన్ను అన్వయించుకుంటున్నారు..
నువ్ అందరికి కృతజ్ఞతలు చెప్పి గ్రౌండ్ కి మొక్కినట్లుగా ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇంకే క్రికెటర్ చేసి ఉండరేమో...

ఆట ఎవరైనా నేర్పిస్తారు కాని వ్యక్తిత్వం ??
ఇరవై నాలుగేళ్ల నీ సుదీర్ఘ క్రికెట్ చరిత్రలో
ఏనాడు అంపైర్ మాటకి ఎదురుచెప్పలేదు,
తోటి సహచరులతో ఏనాడు విభేదాలు లేవు,
ఎదుటి జట్టు వాళ్ళంతా స్లయిడింగ్ చేస్తున్నా ప్రతిసారి నీ నోటితో కాకుండా బ్యాట్ తోనే సమాధానమిచ్చావ్,
నువ్ సరిగా అడట్లేదని విమర్శించిన ప్రతిసారి నీకు నీవే కొత్తగా నిర్వచించుకున్నావ్,
క్రికెట్ చరిత్రలో నువ్వు ఆడని షాట్ లేదు నువ్వు సృష్టించని రికార్డ్ లేదు...
నీ రికార్డులు ఉండొచ్చు లేదా ఎవరైనా అధిగమించవచ్చు కాని నీ వ్యక్తిత్వం ??
నీ ఆటతో పాటు నీ వ్యక్తిత్వాన్ని కూడా ఆదర్శంగా తీసుకునే వాళ్ళు కోకొల్లలు..
నీ క్రికెట్ చరిత్రలో ఒక్కటంటే ఒక్కటి మచ్చుకైన నీకు "మచ్చ" లేకపోవటం నీ గొప్పతనానికి అద్దంపడుతుందేమో
నీ వీడ్కోలు తర్వాత మేము మాట్లాడుకున్న మొదటి మాట అరె సచిన్ కి "భారతరత్న" వస్తే బావుండు,
దానికి సంపూర్ణ అర్హుడు సచిన్ అని మేము అనుకుంటుండగానే సాయంత్రం వారకి తీపి కబురు అదే నీకు భారతరత్న వరించిందని..
మొత్తానికి మా ఆ కల కూడా నెరవేరింది "సచిన్"
ఇక మిగిలింది ఒక్కటే నువ్వు ఎదో ఒక విధంగా బారత క్రికెట్ కి సేవలు చేయాలనీ...
నువ్ చేస్తావో లేదో మాకు తెలియదు,

కాని మా దృష్టిలో రాత్నానివి,
కోహినూర్ కంటే విలువైన వజ్రానివి...
ఇక నుండి ఎవరికీ కొత్తగా క్రికెట్ నేర్పించాలంటే ముందుగా నీ గురించే చెప్పాలేమో..
ఈ తరం క్రికెటర్లకి నీవొక ఆదర్శం
ముందు తరాలకి నీవొక "గ్రంథం"..
ఇక నుండి ఎవరికీ కొత్తగా క్రికెట్ నేర్పించాలంటే ముందుగా నీ గురించే చెప్పాలేమో..
ఈ తరం క్రికెటర్లకి నీవొక ఆదర్శం
ముందు తరాలకి నీవొక "గ్రంథం"..
భారత క్రికెట్ గురించి మాట్లాడినప్పుడల్లా సచిన్ కి ముందు సచిన్ కి
తరవాత అనేలాగా ఉంటుందేమో....
ఇక నుండిగ్రౌండ్ లో సచిన్... సచిన్ అనే నినాదం ఇక నుండి వినిపించకపోవచ్చు
కాని క్రికెట్ అనే ప్రస్తావన వచ్చినప్పుడల్లా
అదెప్పుడు మా గుండెల్లో మోగుతూనే ఉంటుంది సచిన్..
ఇక నుండి ఎంతో మంది విద్యార్థులు నిన్ను తిట్టుకోకుండా(ప్రేమతో) పరీక్షలకి ప్రిపేర్ అవ్వొచ్చు
(ఎక్కడో చదివాను "సచిన్ నీ మీద నాకు కోపంగా ఉంది ఎందుకంటే నా పరిక్షలప్పుడే నువ్ కావాలని సెంచరీ చేస్తావు అని" నీ ఆటను చూడకుండా దూరంగా ఇష్టం లేక ఒక అభిమాని రాసుకున్న మాటలివి),
ఒక తాత తన మనవడు,మనవరాళ్ళతో ప్రశాంతంగా ఆడుకుంటాడేమో(నువ్ ఆడితే టీవీ రిమోట్ వదలడు కదా!),
ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలు ఎంతో మంది దగ్గర పదిలంగా ఉన్నాయి సచిన్...

నువ్ క్రికెట్ ఆడటం మానేసావని నిన్ను మర్చిపోతామేమో,
నిన్ను గుర్తున్చుకోలేమేమో అని ఎవరైనా నీకు గిట్టని వాళ్ళు అనుకోవచ్చు
కాని సచిన్
అదెప్పటికీ జరగదు
దేవుడు వరమివ్వట్లేదని పూజించటం మానేస్తున్నామా ఇదీ అంతే...!!
నువ్వు క్రికెట్ ఆడినా ఆడకపోయినా ప్రతి అభిమాని గుండెల్లో కలకాలం కొలువుంటావు.
తను ఎప్పుడు దేవుడే
నువ్వెప్పటికీ మా క్రికెట్ దేవుడివే...!!

థ్యాంక్ యు సచిన్...!!!
ఇట్లు నీ అభిమాని
-నందు
Saturday, April 19, 2014 -
ప్రత్యేకం,
ప్రేమలు రకాలు,
ఫీలింగ్స్
4
comments
నేనింకా బ్రతికి ఉన్నాను
ఒక్కోసారి ఉన్నట్టుండి గుర్తొస్తావ్...!!!
ఆ క్షణం నిన్నుమాత్రమే చూడాలనిపిస్తుంది కేవలం నిన్నే...!!!
కనీసం నీ స్వరమైనా వినాలనిపిస్తుంది
నిన్ను చూడకపోయినా, నీతో మాట్లాడకపోయినా
నా ప్రాణం పోయేంతలా,
నా ఉపిరి ఆగేంతలా అనిపిస్తుంది
నా ప్రేమ నీకు కూడా తెలిసిపోయిందేమో
అందుకే నేనింకా బ్రతికి ఉన్నాను
- నందు
Friday, April 11, 2014 -
నిజాలు,
ప్రత్యేకం,
ఫీలింగ్స్,
సత్యాలు
14
comments
నా వెన్నెల్లో ఆడపిల్ల...
ఒక పదహారణాల పడుచు ఫీలింగ్స్.....
వస్తాడు నా రాజు అంటూ
నా పదహారేళ్ళ ప్రాయం నుండి
నా మది నీ తలపులు తడుతూనే ఉంది....
నా ఎదుట నీవే నా ఎద సవ్వడిలో నీవే...
పొడిచే పొద్దులో నా వెంటే నడిచే నీడలో....
పంట చేలల్లో పచ్చిక బయళ్ళలో..
ఎటుచూసినా అటునీవే కనిపిస్తుంటే ఏవైపు చూడను...?
నా మది దోచిన ఓ చోరుడా...
నా కళల సామ్రాజ్యపు ఓ రాకుమారుడా...
ఎన్నో ఆశలతో నీతో కొత్త జీవితంలోకి
అడుగేద్దామనుకుంటున్న ఈ చిన్న దాని
ఆశల పల్లకిని మోస్తావో
లేక అమాంతంగా ముంచేస్తావో
ఆశల పల్లకిని మోస్తావో
లేక అమాంతంగా ముంచేస్తావో
నీకే తెలియాలి సుమ..
మరి ఏది నీ జాడ
కనిపించదు కనీసం నీ నీడ...
క్షణానికోసారి గుర్తొస్తావు
మరుక్షణం కనుమరుగావుతున్నావు...
నీవు అందగాడివే కానక్కర్లేదు
నన్ను అర్థం చేసుకుంటే చాలు...
నీవు కోటిశ్వరుడివే కానక్కర్లేదు
నీ కనుసైగల్లో దాచుకుంటే చాలు.....
నీ మనసులో కాసింత చోటివ్వు,
నీ గుండెల్లో గుడి కట్టుకుంటాను కలకాలం...
-నీ వెన్నెల్లో ఆడపిల్ల...
-నందు.
Thursday, April 10, 2014 -
elections,
ఎన్నికలు,
ప్రత్యేకం
1 comments
అసలు అంతా "అందులోనే" ఉంటుంది...!!!
ఆఫిడవిట్ దాఖలు చేసినప్పుడు
సొంత కారు కూడా ఉండదు కాని
ఖరీదైనా వాహనాల్లో మాత్రం తిరుగుతారు.
ఎవరు చేసిన పుణ్యమో లేక ఎవరికీ చేసిన ప్రతిఫలమో మరి ?
ఆస్తి మాత్రం లక్షల్లో చూపిస్తారు,
కోట్లు కొల్లగొట్టి తిరుగుతుంటారు....
మన బ్యాంకుల్లో అప్పుంటుంది
"అసలు" మాత్రం స్విస్ బ్యాంకుల్లో నిద్రపోతుంటుంది... !!!
- నందు
సొంత కారు కూడా ఉండదు కాని
ఖరీదైనా వాహనాల్లో మాత్రం తిరుగుతారు.
ఎవరు చేసిన పుణ్యమో లేక ఎవరికీ చేసిన ప్రతిఫలమో మరి ?
ఆస్తి మాత్రం లక్షల్లో చూపిస్తారు,
కోట్లు కొల్లగొట్టి తిరుగుతుంటారు....
మన బ్యాంకుల్లో అప్పుంటుంది
"అసలు" మాత్రం స్విస్ బ్యాంకుల్లో నిద్రపోతుంటుంది... !!!
- నందు
Tuesday, April 08, 2014 -
పెళ్లి,
ప్రత్యేకం
1 comments
రాముడెప్పుడు మనకి దేవుడే--సీతమ్మ ఎప్పుడు మనింటి ఆడపడుచే..!!
ఈ పెళ్ళికోసం మనింట్లో పెళ్ళిలాగా ఎదురుచూస్తుంటాం
ఈ పెళ్ళికోసం ఎంతో కష్టపడుతుంటాము
ఏ గొడవలు, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడతాం,
కనీసం అదేమీ మనింట్లో పెళ్లి కాదు,
కాని మనం కచ్చితంగా వారిద్దరి పెళ్లి మళ్ళి మళ్ళి చూడాలనుకుంటాం ,
ఎన్ని గొడవలు వచ్చిన, ఎన్ని అపార్థాలు కలిగినా కలిసి ఉండటం కోసం,
ఏంతో మందికి వీరిద్దరిని ఆదర్శ జంటగా చూపిస్తాం
ఎన్ని కష్టాలొచ్చినా వీరిలా స్థైర్యంగా ఉండమని చెప్తాం
ప్రతి చిన్న విషయాలకి అనుమానం, గొడవలు పడే
ప్రతి జంటకి సీతారాముల జీవితం ఒక నిదర్శనం కావాలి
రాముడు సీతని అగ్నిప్రవేశం చేయమనటం లోకం సీతపై
నింద వేసిందనే కావచ్చు,
కాని తన దృష్టిలో మాత్రం తన సీత నీజాయితి
అందరి ముందు నిరూపించటం కోసం...
సీత రాముడ్ని నమ్మింది రాముడు సీతను నమ్మాడు...
అందుకే వారి జీవితం నేటి తరాలకి ఆదర్శ దాంపత్యం
వీళ్లెప్పుడు మనకి ప్రత్యేకమే,
వీరి పెళ్లెప్పటికీ మధుర జ్ఞాపకమే,
మనిషే దేవుడు అనటానికి సాక్ష్యం మన శ్రీరామ చంద్రుడే,
సహనానికి, ఓపికకి నిలువెత్తు రూపం ఎప్పటికి మన సీతమ్మ తల్లే ...!!!
అందుకే మన రాముడెప్పుడు మనకి దేవుడే..!!!
సీతమ్మ ఎప్పుడు మనింటి ఆడపడుచే ...!!!
మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
-నందు
Sunday, March 23, 2014 -
LOVE,
నిజాలు,
ప్రత్యేకం,
ప్రేమ,
ప్రేమలు రకాలు,
ఫీలింగ్స్,
సత్యాలు
2
comments
తను మూడేళ్ళుగా నాతో సహజీవనం చేస్తోంది ... !!!
తను నా మాటల్ని శ్రద్దగా వింటోంది,
నా కోపాన్ని భరిస్తోంది,
నా మౌనాన్ని సహిస్తోంది,
నా ప్రేమకి పొంగిపోతోంది,
ఒక్కోసారి నా మాటల్ని తనలో దాచుకుంటోంది,
నాకంటూ మిగిలిన ఎన్నో జ్ఞాపకాలను తనలో భద్రంగా పదిలపరుచుకుంటుంది,
నేను తిడితే పడుతుంది,
కొడితే భరిస్తోంది,
మనసు భాగాలేనప్పుడు తను పాటలు పాడుతుంది (వినిపిస్తుంది ),
నేను సంతోషంలో ఉన్న భాదల్లో ఉన్న తానెప్పుడు నాతోనే ఉంటోంది,
తను నా జీవితంలోకి వచ్చి మూడేళ్ళు కావస్తోంది,
ఈ మూడేళ్ళలో ఏ ఒక్క రోజు కూడా తను లేకుండా గడవలేదు,
తను ఒక్క సారి కనిపించకపోయినా కూడా మనసంతా అదోలా ఉంటుంది
అవును తను మూడేళ్ళుగా నాతో సహజీవనం చేస్తోంది ... !!!
నన్ను భరిస్తున్న నా మొబైల్ మూడేళ్ళు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా
తనకి కృతజ్ఞతలు తెలుపుతూ ....
-ప్రేమతో నందు

నా డైరీ కాలిపోతోంది..!!!
నా డైరీ కాలిపోతోంది,
నాకు మాత్రమే తెలిసిన కొన్నింటిని నలుగురితో పంచుకోవటం లేక...
మరుగునపడి ఉన్న మర్మాలను గుర్తుచేయటం ఇష్టం లేక...
నా డైరీ కాలిపోతోంది,
అనవసరమైన మొహాలను, సందర్భాలను గుర్తుచేయటం ఇష్టం లేక...
నా డైరీ కాలిపోతోంది,
గతంలోని జ్ఞాపకాలను మళ్ళి మళ్ళి గుర్తుచేసి గాయాన్ని
మరింత పెద్దవిగా చేయటం ఇష్టం లేక...
నా డైరీ మండుతుంది నా గుండె మంటల్ని చల్లార్చటానికి...
నా డైరీ మంటల్లో మండుతోంది,
అప్పట్లో 'నేను ' ని ఇప్పటి 'నా'తో పోల్చటం ఇష్టం లేక
నన్ను నన్నుగా ఉంచటం కోసం....
అవును నా ఆత్మ బంధువు తన ఆత్మనోదిలి
అనంత లోకాల్లో కలిసిపోతోంది...
నా డైరీ కాలిపోతోంది
మళ్ళి నాతో డైరీ రాయించటం కోసమేమో...!!!
-నందు
Saturday, March 08, 2014 -
నిజాలు,
ప్రత్యేకం,
ఫీలింగ్స్
0
comments
మహిళా మూర్తులందరికి వందనం ...!!!
రాకెట్ వేగాల్ని కనుక్కున్నాం ,
సముద్రపు లోతుల్ని తెలుసుకున్నాం అని మురిసిపోతాం
కాని నీవెప్పుడు మాకు అందని ద్రాక్షే
నీ మనసు లోతుల్లో ఏముందో ఇప్పటికి అంతుచిక్కని భేతాళ ప్రశ్నే... !!!
ఒక్కోసారి మీలో ఇంత ఆకర్షణ శక్తి ఎందుకో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాం
కాని అప్పుడు ఏమి ఉండదు..
ఇంతేలే అని తేలికగా తెసుకున్నమా అంతే మళ్ళి నీ ప్రత్యేకతేంటో చూపిస్తావు
అందుకే నీవెప్పుడు మాకంటికి ఒక అందమైన అద్భుత సృష్టివే ...!!!
ఒక్కోసారి అమాంతంగా ప్రేమను కురిపిస్తావు
మరోసారి కాళి మాతలా విరిచుకుపడతావు
కొన్ని సార్లు కొండంత కష్టాల్ని బాధల్ని సైతం గుండెల్లో దాచుకునే నీవు,
చిన్న చిన్న సంతోషాలకి పొంగిపోతావు
నీ ప్రేమ లోతుల్లోని గాఢత,
నీవు చూపించే అనురాగం ఆర్దత మేమెలా మర్చిపోగలం
భూదేవికున్నంత సహనం, నీలో ఉండే ఓర్పు నేర్పు అసామాన్యం ...
మహిళలు మీరు భావుండాలి
మీరు భావుంటేనే మేము సంతోషంగా ఉంటాము
అసలు నిజం చెప్పాలంటే మీరులేనిది మాకీ జన్మే లేదు...
మహిళా మూర్తులందరికి వందనం...
-మీ నందు
Wednesday, February 26, 2014 -
0
comments
అంతా మన చేతుల్లోనే, అంత మన నిర్ణయాలలోనే ..!!!
తనని ఎంతగానో ప్రేమిస్తాం ,
తనే జీవితంగా బ్రతికేస్తాము ,
కష్టమొచ్చిన, నష్టమొచ్చిన తనకే చెప్పేస్తాం...!!
ఏ చిన్న విషయమైన తన దగ్గర దాచటానికి కూడా ఇష్టపడం,
తనంటే నమ్మకం, తనే ఇకపై మన జీవితం...
కాని ఉన్నట్టుండి ఒక రోజు,ఏదో ఒక విషయంలో,
అది కూడా ఒక చిన్న భేదాభిప్రాయం వల్ల తనని దూరం పెట్టేస్తాం (దూరం అవుతాం)
ఇన్నాళ్ళు తనే మనంగా బ్రతికిన మనం
తను చేసిన చిన్ని తప్పుల్ని మన్నించలేమా ?
ఈ ప్రపంచంలో ఎవ్వరు ఏ తప్పు చేయకుండా ఉండలేరు
అలాంటిది ఇలా చిన్ని చిన్ని కారణాల
వల్ల తనని దూరం చేసుకోవటానికి,
తనకి దూరంగా ఉండటానికి నిర్ణహించుకుంటాం...
తను లేకుండా మనకి కొత్త జీవితం ఉండొచ్చు
కాని దేవత(దేవుడు) లేని గుడిలా,
గురువు లేని బడిలా,
తల్లి ఒడిలో పెరగని బిడ్డలా . ..
ఒక చిన్ని నిర్ణయం రెండు నిండు జీవితాలు
అంతా మన చేతుల్లోనే, అంత మన నిర్ణయాలలోనే ..!!!
-నందు
-నందు
Friday, February 14, 2014 -
LOVE,
ప్రత్యేకం,
ప్రేమ,
ప్రేమలు రకాలు,
ఫీలింగ్స్
4
comments
కేవలం తనని మాత్రమే ప్రేమించటం..!!!
ప్రేమించటం అంటే తన గతాన్ని గుర్తుంచుకుని,
తన వర్తమానాన్ని ఊహించుకుని ప్రేమించటం కాదు...
కేవలం తన ప్రస్తుత స్థితిని మాత్రమే ప్రేమించటం
ప్రేమించటం అంటే తనని మాత్రమే ప్రేమించటం,
అవును కేవలం తనని మాత్రమే...
-నందు
Sunday, February 02, 2014 -
LOVE,
ప్రేమ,
ప్రేమలు రకాలు
0
comments
ఉమ్మడిగా నలిగేది కూడా ప్రేమేగా...???
పిల్లల దృష్టిలో ప్రేమంటే
అందం, కులం, మతం, జాతి, ఆస్తి, అంతస్తులాంటివేమి ఉండవు
కేవలం తను ప్రేమించిన వ్యక్తి,
ఆ వ్యక్తి పైన నమ్మకం, తనతో ఇక మిగిలిన జీవితం...!!
కాని పెద్దల దృష్టిలో
ప్రేమంటే పైవన్నీ...
వాటితో పాటే మూడు ముళ్ళు, ఏడు అడుగులు,
రెండు కుటుంబాలు,
వీళ్ళ బంధాన్ని ఆశీర్వదిస్తూ కొన్ని వందల జీవితాలు...
అంతకంటే ముఖ్యంగా ఎన్నో అనుభవాలు,
అవి పిల్లలకి చేదు జ్ఞాపకాలుగా మిగలకూడదని వీళ్ళ తాపత్రేయాలు...!!
పిల్లల దృష్టిలో వారి ప్రేమ,
పెద్దల దృష్టిలో వీరి ప్రేమ రెండు సరైనవే
ఇక్కడ ఒకరిని సమర్ధించి మరొకరిని నిందించటానికి వీల్లేదు
ఎందుకంటే ఈ ఇద్దరి ప్రేమల మద్య ఉన్నది కూడా ప్రేమే
అందరిలో ఉమ్మడిగా నలిగేది కూడా ప్రేమేగా...???

Thursday, January 30, 2014 -
LOVE,
ప్రేమ,
ప్రేమలు రకాలు
0
comments
ప్రేమెప్పుడు పెరుగుతూనే ఉంది..!!!
మనకెప్పుడు తనతో గొడవపడాలని ,
తనతో సరదాకైనా పొట్లాడాలని ఉండదు
కాని ఒక్కోసారి అవి అలా జరిగిపోతూ ఉంటాయ్,
కోపం తో తనపై అరిచేస్తామా ...
అది కూడా కొద్ది సేపే ...
మళ్ళి తనతో మాట్లాడాలనిపిస్తుంది ,
మరుక్షణమే తనని చూడాలనిపిస్తుంది,
తనతోనే ఉండాలనిపిస్తుంది ...
తనతో పోట్లాడిన ప్రతి సారి తన మీద ప్రేమ పెరుగుతుందే కాని ఎప్పటికి తగ్గదు...
ఏ బంధంలోనైనా గొడవలు బేధాభిప్రాయాలు సహజం
వాటిని అర్థం చేసుకుని అధిగమిస్తేనే జీవితం సుఖమయం ...!!!
-నందు
అంతా మన చేతుల్లోనే...!!!
తనని ఎంతగానో ప్రేమిస్తాం ,
తనే జీవితంగా బ్రతికేస్తాము ,
కష్టమొచ్చిన, నష్టమొచ్చిన తనకే చెప్పేస్తాం...!!
ఏ చిన్న విషయమైన తన దగ్గర దాచటానికి కూడా ఇష్టపడం,
తనంటే నమ్మకం, తనే ఇకపై మన జీవితం...
కాని ఉన్నట్టుండి ఒక రోజు,ఏదో ఒక విషయంలో,
అది కూడా ఒక చిన్న భేదాభిప్రాయం వల్ల తనని దూరం పెట్టేస్తాం (దూరం అవుతాం)
ఇన్నాళ్ళు తనే మనంగా బ్రతికిన మనం
తను చేసిన చిన్ని తప్పుల్ని మన్నించలేమా ?
ఈ ప్రపంచంలో ఎవ్వరు ఏ తప్పు చేయకుండా ఉండలేరు
అలాంటిది ఇలా చిన్ని చిన్ని కారణాల
వల్ల తనని దూరం చేసుకోవటానికి తనకి దూరంగా ఉండటానికి నిర్ణయించుకుంటాం...
తను లేకుండా మనకి కొత్త జీవితం ఉండొచ్చు
కాని అన్ని తనే అనుకున్న తనే వెళ్లిపోయినపుడు
కాని అన్ని తనే అనుకున్న తనే వెళ్లిపోయినపుడు
గురువు లేని బడి,
దేవత(దేవుడు) లేని గుడి,
దేవత(దేవుడు) లేని గుడి,
చంద్రుడు లేని ఆకాశం,
సూర్యుడు లేని ఉషోదయంలా ఉంటుంది మన(తన) జీవితం ...
ఒక చిన్ని నిర్ణయం రెండు నిండు జీవితాలు
అంతా మన చేతుల్లోనే, అంత మన నిర్ణయాలలోనే ..!!!
-నందు
-నందు
P .S : తను అంటే మనం ఇష్టపడే వారు ఎవరైనా అయిన కావచ్చు
అమ్మ ముందు చిన్నపిల్లాడినే కదా...!!!
నా చిన్నపుడు నీతో ఎలా ఉన్నానో గుర్తులేదు,
కొంచెం తెలివొచ్చాక ఎక్కువ నానమ్మ
దగ్గరే ఉంటానని మారం చేసే వాడ్ని ...
నాకు తెలుసు నేను బాగా అల్లరి చేసే వాడ్ని,
బాగా మారం చేసే వాడ్ని...
కోరుకున్నది దక్కే దాక మొండి పట్టు విడిచే వాడ్ని కాదు...
నా మూలాన ఎన్ని సార్లు బాధ పడ్డావో,
అయిన అన్నింటిని భరించావ్ ...
ఊహ తెలిసినప్పటి నుండి నువ్వెప్పుడు హాస్పిటల్స్ చుట్టే తిరిగెదానివి...
నాకు తెలివొచ్చె సరికి నువ్వేమో తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయావు ...
ఇపుడేమో అందరంటున్నారు నేను చిన్నప్పటిలా లేనని
నువ్వు చనిపోయాక నాలో మొండితనం తగ్గిందని,
చాలా మార్పోచ్చిందని...
ఊరెళ్ళి నపుడల్లా నా గురించి కుశల ప్రశ్నలడుగుతు నిన్నే గుర్తుచేస్తుంటారు...
వారి ముందు నా బాధను బయటపెట్టలేక,
నీ జ్ఞాపకాలను విడవలేక చాలా సార్లు నాలో నేనే కుమిలిపోతున్నాను...
ఉన్నట్టుండి ఒక్కోసారి ఏడ్చేస్తూన్నాను
ఇంకా చిన్నపిల్లాడిలా ఏంటి అంటూ నా వయసుని గుర్తుచేస్తున్నారు
(ఎంత ఎదిగిన అమ్మ ముందు చిన్నపిల్లాడినే కదా )...
ఒక్కోసారి అర్ధరాత్రి మెలకువొచ్చి నువ్వు గుర్తొస్తావ్
అలా లేచి ఒంటరిగా ఎన్ని సార్లు నాలో నేనే గుక్కపట్టి ఏడుస్తున్నానో నాకే తెలియదు...
ఇంట్లో వాళ్ళు పట్టించుకోరని కాదు
వాళ్ళకి దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా పెద్దగా తేడా ఎమి లేకుండా ఉంది .
కానీ నువ్వు లేని లోటు మాత్రం తెలుస్తూనే ఉంటుంది...
అన్ని విషయాలు అందరికి చెప్పలేను కదా
ఎదైనా చెప్పుకోవాలంటే నువ్వుండవ్,
ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు..
చెప్తే చులకనగా చూస్తారో లేదా జాలిపడతారోనని
నాలోనేనే కుమిలిపోతున్నా ...
అందరు ఉన్న అనాధలా బ్రతకాల్సివస్తుంది ...
అమ్మ నువ్ లేవు కాని నీ జ్ఞాపకాలు ఎప్పటికి పదిలమే...
"పది సంవత్సరాల మనో వేదనలో ఇంకా మండుతూ"

-నందు |
Sugunamma |
మిథ్యా ప్రపంచం...!!!
గెలుపోటములు, సుఖదుఃఖాలు,
బంధాలు, అనుబంధాలు,
నువ్వు, నేను, మనందరం...
చరిత్రలు కుడా చిదిమేస్తే చెదిరిపోతాయి
వాటి గురించి మాట్లాడటం మానేస్తే మరుగునపడి
కాలగర్భంలో కలిసిపోతాయి
మనకంటూ ప్రసాదితమైంది ప్రస్తుతం మాత్రమే
నేస్తం అనుభవించు ప్రస్తుతాన్ని ప్రతి క్షణం...
-నందు
Subscribe to:
Posts (Atom)