పిల్లల దృష్టిలో ప్రేమంటే
అందం, కులం, మతం, జాతి, ఆస్తి, అంతస్తులాంటివేమి ఉండవు
కేవలం తను ప్రేమించిన వ్యక్తి,
ఆ వ్యక్తి పైన నమ్మకం, తనతో ఇక మిగిలిన జీవితం...!!
కాని పెద్దల దృష్టిలో
ప్రేమంటే పైవన్నీ...
వాటితో పాటే మూడు ముళ్ళు, ఏడు అడుగులు,
రెండు కుటుంబాలు,
వీళ్ళ బంధాన్ని ఆశీర్వదిస్తూ కొన్ని వందల జీవితాలు...
అంతకంటే ముఖ్యంగా ఎన్నో అనుభవాలు,
అవి పిల్లలకి చేదు జ్ఞాపకాలుగా మిగలకూడదని వీళ్ళ తాపత్రేయాలు...!!
పిల్లల దృష్టిలో వారి ప్రేమ,
పెద్దల దృష్టిలో వీరి ప్రేమ రెండు సరైనవే
ఇక్కడ ఒకరిని సమర్ధించి మరొకరిని నిందించటానికి వీల్లేదు
ఎందుకంటే ఈ ఇద్దరి ప్రేమల మద్య ఉన్నది కూడా ప్రేమే
అందరిలో ఉమ్మడిగా నలిగేది కూడా ప్రేమేగా...???
-నందు

0 comments:
Post a Comment