ప్రేమ జ్ఞాపకాలు

ఎవరినో ప్రేమిస్తావు

మరెవరినో పెళ్లి చేసుకుంటావు

గుండె లోతుల్లో ఒకరు గుండెలపై మరొకరు..

నీలో ఒకరు, నీతో ఒకరు..

తనపై నీ ప్రేమకు గుర్తుగా నీ మెయిల్ ఐడికో,

లేక నీ కంప్యూటర్ కో తన పేరుని పాస్ వర్డ్ గా తగిలిస్తావు

తన పేరునో లేక తన పేరులోని మొదటి అక్షరంతోనో నీ పిల్లలకి పేరు పెట్టుకుని మురిసిపోతావు

తను గుర్తోచ్చినపుడల్లా నీలో అనాలోచితంగా ఏవో స్పందనలు

తను గుర్తొచ్చిన ఆనందంలోనో లేక తనతో వీడిపోయినందుకు కలుగుతున్న ఆవేదనతోనో.

ఆ రెండింటిని గుర్తుపట్టకుండా

సాయంకాలపు వెలుగులను కమ్ముకొస్తున్న కారు చీకట్లు

కప్పెసినట్లు ఎప్పుడు నింపాదిగా ఉండే నీ నిర్మలమైన మనసు...


ఓ మనిషి...!!!

ఇవేనా నీ విరహ వేదనకు సాక్షాలు...








సుఖంగా ఉండి సంతోషంగా లేని జీవితాలకి అంకితం...నందు

Thursday, December 20, 2012 - , 0 comments

ఎం జరిగినా మన మంచికే ......!!!


'నేడు' ఎం జరుగుతుందో తెలియని తెలియదు  కాని 'రేపటి' గురించి బెంగ ఎందుకు ?

జరుగుతుందో లేదో తెలియని యుగాంతం గురించి  స్కూల్స్ కాలేజీలు వదిలేసి, 

ఆఫీసులు పనులన్నీ పక్కన పెట్టి భయంతో 

ఒక మూలలో పడుకోవటం కాదు  

ఒక వేళ  నిజంగా ఈ ఈ యుగాంతం జరిగితే(!)  జరగనీ,

మనమేమి ఆపలేము కదా  సృష్టి కార్యాన్ని ఎవ్వరు ఆపలేరు ఆ సృష్టిని సృష్టించిన సృష్టి కర్త అయినా...  

పనులన్నీ వదిలేసి చావుకి బయపడటం కాదు  

మన విది నిర్వహణలో, మన బాద్యతలను మనం నేరవేర్చినప్పుడే మన 

జన్మకి నిజమైన సార్థకత

ఒక వేళ  మనం చేసే రోజు వారి పనిలో ఉండి  మనం చనిపోతే  అదే  మన 

ఆత్మకి అసలైన  శాంతి(ఇంట్లో ఉండి  చనిపోవటం కంటే పనిలో ఉండి  

చనిపోవటం ఉత్తమం కదా ?) 

చేస్తున్న పనికి ఘనమైన నివాళి 

జరగని భయాన్ని తలుచుకుని చింతించకుండా 

నిశ్చింతగా ఉండండి ఎం జరిగినా మన మంచికే ...... 

                                                 -నందు 

యుగాంతం గురించి నా భావన...

Sunday, October 07, 2012 - , 0 comments

నువ్వెవరు...??





ఎప్పుడు ఎక్కడ  కనిపిస్తావో ఎలాపరిచయమవుతావో 
ఇంతకి  నువ్వు  ఎవ్వరో  ఎలా  ఉంటావో  తెలిదు
కాని  మరి  ఎందుకు  నాలో  ఈ  వింత  స్పందన...!
నిన్ను  చూడాలని, నీతో మాట్లాడాలని 
ఎన్నో ఊసులు  నీతో  చెప్పుకోవాలని  ఏదో  ఆరాటం
ఎందుకిలానో  తెలియదు  
కాని  నిన్ను  ఊహించుకున్నప్పుడల్లా నాలో  ఏదో  మార్పు
 ఏదో  తెలీని  గర్వం 
నిన్ను  ప్రేమించి  పెళ్లి  చేసుకుంటానో  లేక  
పెళ్లి  చేసుకుని  ప్రేమిస్తానో  తెలియదు  కాని 
నువ్వు  కావలి  నా  తోడుగా 
ఉండాలి  నా   నీడగా 
మరి  నువ్వేప్పుడో  స్తావు  చెలి  నా  జీవితంలోకి 
వచ్చాక  వెళ్లవుగా  మరి 
కడదాక  సన్నిహితుడిలా
తోడుగా  నీడగా  జీవితాంతం 
నీకోసం  ఎదురు  చూస్తూ.....  
                              నీ నేను
                                  
                               -నందు

Saturday, October 06, 2012 - , 5 comments

కల్తీ లేని ప్రేమ...!!




నేస్తం..!!



యుగాలెన్నిమారినా ,

కాలం ఎంత గడిచినా , 

మానవుడి మనుగడ చివరివరకైన  అమ్మ  ప్రేమలో  కల్తి  ఉండదు,

ఉండబోదు అని చెప్పనివారు ఉండరు... 

ఎందుకంటే ప్రేమ గుడ్డిది మూగది చెవిటిది అని ఎన్నెనో చెప్పే మనం అది ఒక 


అమ్మాయి అబ్బాయి విషయంలో మాత్రమే...


అమ్మ ప్రేమలో  కల్తి  ఉండదు మన  మీద కనికరం తప్ప
అమ్మ ప్రేమలో అనుమానం ఉండదు  ఆప్యాయత, అనురాగాలు తప్ప...
అమ్మ ప్రేమలో కోపం ఉండొచ్చు కాని అది తమ  బిడ్దల  బాగు  కొరకు 

మాత్రమే

నీ  గురించిన భాద లేదు భవిష్యత్తు పై బెంగ తప్ప
  
మన అమ్మలో మరొక రూపం ఉంటుంది అది నువ్వు కొంచెం ఆనందం గా 

లేకపోయినా భాద పడుతూనే ఉంటుంది

అది అమ్మ ప్రేమ.....


కాని అమ్మ ప్రేమను అర్థం చేసుకోలేని  చాలా మంది అనహరులు ఇప్పటికి 

ఈ భూప్రపంచం మీద ఉండటం ఇంకా సిగ్గు చేటు...

మిత్రులారా దేవుడు ప్రతి చోట ఉండడు అందుకే ప్రతి చోటా అమ్మను
సృషించాడు...

అమ్మ మనసుని భాదించకండి. ...
                                                                       
                                                             -నందు
Tuesday, October 02, 2012 - , 1 comments

గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

రవి అస్తమించని బ్రిటిష్  సామ్రాజ్యంలో దారే తెలియని చీకటిలో ఉన్న మన బారత దేశాన్ని తానే 
వెలుగై ఒక దిక్కును చూపి సత్యం అహింసా అనే అస్త్రాలతో ఆంగ్లేయుల గుండెల్లో గుబులు పుట్టించిన ఓ మహాత్మ....

మీ చల్లని దీవెన మాకివ్వు..!!
మీ దారిలో నడిచే బలమివ్వు...!!!
 మీకు మా తెలుగు వారి తరపున ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు. 

                                                                         -నందు.





Thursday, September 27, 2012 - , 1 comments

నీ రూపం

కళ్ళల్లో  అమాయకత్వం 
గుండెల్లో గడుసుదనం....
అన్ని కలగలిసిన నిండిన తెలుగుదనం....
కుర్రకారుకి గుండెల్లో కలవరం....

అచ్చమైన పదహారణాల పడచుధనానికి 
నీ రూపమే నిలువెత్తు  నిదర్శనం. 
                            -నందు



Tuesday, September 18, 2012 - 0 comments

నువ్వు ఒక్క క్షణం దగ్గరుంటే తెలిసింది "కాలం "విలువ 
నువ్వు దూరం అయితే తెలిసింది " కన్నీటి " విలువ 
నీ తేనె మనసుకు తెలియలేదా .. "నా తీపి బాధ " 
నీ ఆలోచనలతో గడుపుతున్నా నా "భాద" ఎప్పటికైనా తెల్సుకుంటావని

Thursday, September 13, 2012 - 0 comments

ఏమి చేయను


ఏ వైపు చూసిన నీ రూపే కనిపిస్తూవుంటే
 నేను తీసుకునె ప్రతిశ్వాసకీ నీవే గుర్తస్తుంటే 
 క్షణ క్షణం నా నీడల నన్ను వెంటాడిస్తుంటే 
ప్రతి రాత్రి కలగా వచ్చి నన్ను కవ్విస్తుంటే
 ఏమి చేయను నేస్తమా....!

ప్రియా ఏంటి నీ మాయ....?

ప్రేమంటే ఏంటో తెలియకుండానే ప్రేమించాను
మనసంటే ఏంటో పూర్తిగా తెలియకుండానే మనసిచ్చేసాను
కాని నేనంటే ఏంటో నాకు తెలిసి కూడా నాలా  నేను ఉండలేకపోతున్నాను
ప్రియా ఏంటి నీ మాయ....?
                                 
                                        -నందు


Tuesday, June 05, 2012 - 8 comments

దేని గురించి రాయను ??

గత కొన్ని నెలలు గా నేను రాస్తున్న నా కవితలను కొనసాగించాలనే ఉద్దేశ్యంతో పెన్ను పట్టుకుని కంకణం కట్టుకుని కూర్చున్నాను కాని నా భావాలెందుకో  ముందుకి కదస్లాట్లేదు

ఈ సారి దేని గురించి రాయను అని
ఎక్కువగా ఈ ప్రేమ గురించే రాసేటప్పటికి  నాకు కూడా కొంచెం కోతగా ఏమైనా రాయాలి అనిపించిది
మరి దేని గురించి రాయను ??
ఉన్నట్లుండి సడన్ గా నా మది లో మెదిలింది అదే స్నేహం 

మరి స్నేహాన్ని గురిచి ఏమని రాయను ? ?
 అవసరం ఉన్నంత సేపు మనతో చాలా బాగా మాట్లాడి మన అవసరం తీరిపోయాక మనల్ని వదిలేసే స్నేహాన్ని గూర్చి రాయనా

లేక మన ముందొక మాట తర్వాత ఒక   మాట మాట్లాడే స్నేహాన్ని గూర్చి రాయనా ?
మనిషి కంటే మనిషి ఇచ్చే  వస్తువులకు  విలువనిచ్చే వారిని గూర్చి రాయనా
మరి దేని గూర్చి రాయను ??
 ఎందుకీ  నాలో నిర్లిప్తపు  భావన ???
మరి సమాజనికి ఉపయోగపడేవి, సమాజానికి సందేశం ఇచ్చేవి  ఏమైనా రాయన ??

 నేనా ? సమాజనికా ?
 ఏమి రాయను ?
 నేనమైన సమాజానికి సందేశం ఇవ్వటానికి  సత్య సాయి భాబా నా లేక "పొప్" నా ? 
మనమెవ్వరం  సమాజానికి సందేశం  ఇవ్వటానికి ?
కాదు నేనెవ్వరిని ?
అయిన మనం సమాజం తో మన సందేశాలను పంచుకోగలం  మాత్రమే,
కేవలం మనం మన భావాలను వ్యక్తికరించగలం మాత్రమే....
సందేశం తీసుకోవాలో వద్దో సమాజమే నిర్ణహించుకుంటుంది
మరి దేని గురించి రాయను ?
 రాయాలి అనే ఒక ధృడ నిచ్చయం తో ఉన్నపుడు ఎందుకు రాయలేకపోతున్ననో
కనీసం  రాయలేకపోవటం గురించైనా రాయాలి కదా.....

రాస్తాను , నాలో అంతర్లీనంగా దాగి ఉన్న, నిస్తేజపు లోతుల్లోన్ని భావాలను రాస్తాను....