ఎప్పుడు ఎక్కడ కనిపిస్తావో ఎలాపరిచయమవుతావో
ఇంతకి నువ్వు ఎవ్వరో ఎలా ఉంటావో తెలిదు
కాని మరి ఎందుకు నాలో ఈ వింత స్పందన...!
నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని
ఎన్నో ఊసులు నీతో చెప్పుకోవాలని ఏదో ఆరాటం
ఎందుకిలానో తెలియదు
కాని నిన్ను ఊహించుకున్నప్పుడల్లా నాలో ఏదో మార్పు
ఏదో తెలీని గర్వం
నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానో లేక
పెళ్లి చేసుకుని ప్రేమిస్తానో తెలియదు కాని
నువ్వు కావలి నా తోడుగా
ఉండాలి నా నీడగా
మరి నువ్వేప్పుడో స్తావు చెలి నా జీవితంలోకి
వచ్చాక వెళ్లవుగా మరి
కడదాక సన్నిహితుడిలా
తోడుగా నీడగా జీవితాంతం
నీకోసం ఎదురు చూస్తూ.....
నీ నేను
నీ నేను
-నందు
0 comments:
Post a Comment