Friday, May 10, 2013 -
ప్రేమ,
ఫీలింగ్స్
0
comments
ఎందుకో ఏమో..!!!
Monday, May 06, 2013 -
ప్రేమ
0
comments
ప్రియా ప్రేమంటే ఇదేనేమో...!!!
నిన్ను తొలిసారి చూసినప్పుడు,
తొలి సారి నీతో మాట్లాడినప్పుడు,
అప్పటి నుంచి,
ఇప్పటిదాకా
నీకోసం ఎదురు చూస్తున్నప్పుడు,
నిన్ను కలిసినప్పుడు,
నీతో మాట్లాడినప్పుడు,
ప్రతి సారి అదే అలజడి అదే ఆర్ధత...!!!
కళ్ళు అలా చూస్తూ ఉండిపోతున్నాయి
మనసేమో మూగబోతుంది
ఒక్కోసారి ఏమి మాట్లాడాలనిపించదు
నిన్ను అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది
ఎంత సేపైనా
నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోయిన మరుక్షణమే
మల్లి నిన్ను చూడాలనిపిస్తుంది
ప్రియా ప్రేమంటే ఇదేనేమో
వీడలేక వీడిపోవటం... !!!
Friday, April 19, 2013 -
ప్రత్యేకం,
ప్రేమ
0
comments
శ్రీరామ నవమి శుభాకాంక్షలు
మనిషి జీవితంలో తను ఒకే సారి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు
కాని ఈ పెళ్లిని మాత్రం ప్రాతి సారి జరిపించాలనుకుంటారు
ఈ పెళ్లి మాత్రం ఎప్పటికి ప్రత్యేకమే,
ప్రతి సంవత్సరం నిత్య నూతనమే,
మనందరికీ ఒక మదుర జ్ఞాపకమే...
ప్రతి సంవత్సరం మనమే దగ్గరుండి మరీ ఈ పెళ్లిని జరిపిస్తాము
మనింట్లో పెళ్ళిగా మురిసిపోతాము
ఈ పెళ్లి జరిగాకే మనింట్లో పెళ్ళిళ్ళ గురించి,
పెళ్లి సంబంధాల గురించి అన్వేషణ మొదలెడతాము
పచ్చని తోరణాలతో,
మేళ వాయిద్యాల నడుమ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగే ఈ సీతారాములోరి పెళ్ళి ఘనంగా ఇలాగే జరగాలని, జరపాలని కోరుకుంటూ మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
Wednesday, April 10, 2013 -
ప్రేమ,
ఫీలింగ్స్
0
comments
శూన్యం లోకి...!!!
Thursday, February 28, 2013 -
ప్రేమ
0
comments
ఈ కక్ష ఎవరి మీద ?
Sunday, January 27, 2013 -
ప్రేమ
0
comments
మిత్రమా నీకు శుభాకాంక్షలు
ప్రేమ జ్ఞాపకాలు
ఎవరినో ప్రేమిస్తావు
మరెవరినో పెళ్లి చేసుకుంటావు
గుండె లోతుల్లో ఒకరు గుండెలపై మరొకరు..
నీలో ఒకరు, నీతో ఒకరు..
తనపై నీ ప్రేమకు గుర్తుగా నీ మెయిల్ ఐడికో,
లేక నీ కంప్యూటర్ కో తన పేరుని పాస్ వర్డ్ గా తగిలిస్తావు
తన పేరునో లేక తన పేరులోని మొదటి అక్షరంతోనో నీ పిల్లలకి పేరు పెట్టుకుని మురిసిపోతావు
తను గుర్తోచ్చినపుడల్లా నీలో అనాలోచితంగా ఏవో స్పందనలు
తను గుర్తొచ్చిన ఆనందంలోనో లేక తనతో వీడిపోయినందుకు కలుగుతున్న ఆవేదనతోనో.
ఆ రెండింటిని గుర్తుపట్టకుండా
సాయంకాలపు వెలుగులను కమ్ముకొస్తున్న కారు చీకట్లు
కప్పెసినట్లు ఎప్పుడు నింపాదిగా ఉండే నీ నిర్మలమైన మనసు...
ఓ మనిషి...!!!
ఇవేనా నీ విరహ వేదనకు సాక్షాలు...
మరెవరినో పెళ్లి చేసుకుంటావు
గుండె లోతుల్లో ఒకరు గుండెలపై మరొకరు..
నీలో ఒకరు, నీతో ఒకరు..
తనపై నీ ప్రేమకు గుర్తుగా నీ మెయిల్ ఐడికో,
లేక నీ కంప్యూటర్ కో తన పేరుని పాస్ వర్డ్ గా తగిలిస్తావు
తన పేరునో లేక తన పేరులోని మొదటి అక్షరంతోనో నీ పిల్లలకి పేరు పెట్టుకుని మురిసిపోతావు
తను గుర్తోచ్చినపుడల్లా నీలో అనాలోచితంగా ఏవో స్పందనలు
తను గుర్తొచ్చిన ఆనందంలోనో లేక తనతో వీడిపోయినందుకు కలుగుతున్న ఆవేదనతోనో.
ఆ రెండింటిని గుర్తుపట్టకుండా
సాయంకాలపు వెలుగులను కమ్ముకొస్తున్న కారు చీకట్లు
కప్పెసినట్లు ఎప్పుడు నింపాదిగా ఉండే నీ నిర్మలమైన మనసు...
ఓ మనిషి...!!!
ఇవేనా నీ విరహ వేదనకు సాక్షాలు...
సుఖంగా ఉండి సంతోషంగా లేని జీవితాలకి అంకితం...నందు
Thursday, December 20, 2012 -
ప్రత్యేకం,
ప్రేమ
0
comments
ఎం జరిగినా మన మంచికే ......!!!
'నేడు' ఎం జరుగుతుందో తెలియని తెలియదు కాని 'రేపటి' గురించి బెంగ ఎందుకు ?
జరుగుతుందో లేదో తెలియని యుగాంతం గురించి స్కూల్స్ కాలేజీలు వదిలేసి,
ఆఫీసులు పనులన్నీ పక్కన పెట్టి భయంతో
ఒక మూలలో పడుకోవటం కాదు
ఒక వేళ నిజంగా ఈ ఈ యుగాంతం జరిగితే(!) జరగనీ,
మనమేమి ఆపలేము కదా సృష్టి కార్యాన్ని ఎవ్వరు ఆపలేరు ఆ సృష్టిని సృష్టించిన సృష్టి కర్త అయినా...
పనులన్నీ వదిలేసి చావుకి బయపడటం కాదు
మన విది నిర్వహణలో, మన బాద్యతలను మనం నేరవేర్చినప్పుడే మన
జన్మకి నిజమైన సార్థకత
ఒక వేళ మనం చేసే రోజు వారి పనిలో ఉండి మనం చనిపోతే అదే మన
ఆత్మకి అసలైన శాంతి(ఇంట్లో ఉండి చనిపోవటం కంటే పనిలో ఉండి
చనిపోవటం ఉత్తమం కదా ?)
చేస్తున్న పనికి ఘనమైన నివాళి
జరగని భయాన్ని తలుచుకుని చింతించకుండా
నిశ్చింతగా ఉండండి ఎం జరిగినా మన మంచికే ......
-నందు
యుగాంతం గురించి నా భావన...
Sunday, October 07, 2012 -
ప్రేమ,
ఫీలింగ్స్
0
comments
నువ్వెవరు...??
ఎప్పుడు ఎక్కడ కనిపిస్తావో ఎలాపరిచయమవుతావో
ఇంతకి నువ్వు ఎవ్వరో ఎలా ఉంటావో తెలిదు
కాని మరి ఎందుకు నాలో ఈ వింత స్పందన...!
నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని
ఎన్నో ఊసులు నీతో చెప్పుకోవాలని ఏదో ఆరాటం
ఎందుకిలానో తెలియదు
కాని నిన్ను ఊహించుకున్నప్పుడల్లా నాలో ఏదో మార్పు
ఏదో తెలీని గర్వం
నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానో లేక
పెళ్లి చేసుకుని ప్రేమిస్తానో తెలియదు కాని
నువ్వు కావలి నా తోడుగా
ఉండాలి నా నీడగా
మరి నువ్వేప్పుడో స్తావు చెలి నా జీవితంలోకి
వచ్చాక వెళ్లవుగా మరి
కడదాక సన్నిహితుడిలా
తోడుగా నీడగా జీవితాంతం
నీకోసం ఎదురు చూస్తూ.....
నీ నేను
నీ నేను
-నందు
Saturday, October 06, 2012 -
అమ్మ,
ప్రేమ
5
comments
కల్తీ లేని ప్రేమ...!!
నేస్తం..!!
యుగాలెన్నిమారినా ,
కాలం ఎంత గడిచినా ,
మానవుడి మనుగడ చివరివరకైన అమ్మ ప్రేమలో కల్తి ఉండదు,
ఉండబోదు అని చెప్పనివారు ఉండరు...
ఎందుకంటే ప్రేమ గుడ్డిది మూగది చెవిటిది అని ఎన్నెనో చెప్పే మనం అది ఒక
అమ్మాయి అబ్బాయి విషయంలో మాత్రమే...
అమ్మ ప్రేమలో కల్తి ఉండదు మన మీద కనికరం తప్ప
అమ్మ ప్రేమలో అనుమానం ఉండదు ఆప్యాయత, అనురాగాలు తప్ప...
అమ్మ ప్రేమలో కోపం ఉండొచ్చు కాని అది తమ బిడ్దల బాగు కొరకు
మాత్రమే
నీ గురించిన భాద లేదు భవిష్యత్తు పై బెంగ తప్ప
మాత్రమే
నీ గురించిన భాద లేదు భవిష్యత్తు పై బెంగ తప్ప
మన అమ్మలో మరొక రూపం ఉంటుంది అది నువ్వు కొంచెం ఆనందం గా
లేకపోయినా భాద పడుతూనే ఉంటుంది
లేకపోయినా భాద పడుతూనే ఉంటుంది
అది అమ్మ ప్రేమ.....
కాని అమ్మ ప్రేమను అర్థం చేసుకోలేని చాలా మంది అనహరులు ఇప్పటికి
ఈ భూప్రపంచం మీద ఉండటం ఇంకా సిగ్గు చేటు...
ఈ భూప్రపంచం మీద ఉండటం ఇంకా సిగ్గు చేటు...
మిత్రులారా దేవుడు ప్రతి చోట ఉండడు అందుకే ప్రతి చోటా అమ్మను
సృషించాడు...
సృషించాడు...
అమ్మ మనసుని భాదించకండి. ...
-నందు
Subscribe to:
Posts (Atom)