Monday, May 06, 2013 - 0 comments

ప్రియా ప్రేమంటే ఇదేనేమో...!!!

నిన్ను తొలిసారి చూసినప్పుడు, 
తొలి సారి నీతో మాట్లాడినప్పుడు, 
అప్పటి నుంచి, 
ఇప్పటిదాకా
నీకోసం ఎదురు చూస్తున్నప్పుడు, 
నిన్ను కలిసినప్పుడు, 
నీతో మాట్లాడినప్పుడు,

ప్రతి సారి అదే అలజడి అదే ఆర్ధత...!!! 

కళ్ళు అలా చూస్తూ ఉండిపోతున్నాయి 
మనసేమో మూగబోతుంది 
ఒక్కోసారి ఏమి మాట్లాడాలనిపించదు 
నిన్ను అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది 
ఎంత సేపైనా 

నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోయిన మరుక్షణమే 
మల్లి నిన్ను చూడాలనిపిస్తుంది

ప్రియా ప్రేమంటే ఇదేనేమో 
వీడలేక వీడిపోవటం... !!! 


                  -నందు



0 comments: