Tuesday, April 08, 2014 - , 1 comments

రాముడెప్పుడు మనకి దేవుడే--సీతమ్మ ఎప్పుడు మనింటి ఆడపడుచే..!!



 ఈ పెళ్ళికోసం మనింట్లో పెళ్ళిలాగా ఎదురుచూస్తుంటాం

ఈ పెళ్ళికోసం ఎంతో కష్టపడుతుంటాము


ఏ గొడవలు, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు  జరగకుండా జాగ్రత్త పడతాం, 


కనీసం అదేమీ మనింట్లో పెళ్లి కాదు,


కాని మనం కచ్చితంగా వారిద్దరి పెళ్లి మళ్ళి  మళ్ళి చూడాలనుకుంటాం , 


ఎన్ని గొడవలు వచ్చిన, ఎన్ని అపార్థాలు కలిగినా కలిసి ఉండటం కోసం,


ఏంతో మందికి వీరిద్దరిని ఆదర్శ జంటగా చూపిస్తాం


ఎన్ని  కష్టాలొచ్చినా వీరిలా స్థైర్యంగా ఉండమని చెప్తాం


ప్రతి చిన్న విషయాలకి అనుమానం, గొడవలు పడే  


ప్రతి జంటకి సీతారాముల జీవితం ఒక నిదర్శనం కావాలి 


రాముడు సీతని అగ్నిప్రవేశం చేయమనటం లోకం సీతపై  


నింద వేసిందనే కావచ్చు,


కాని తన దృష్టిలో  మాత్రం తన సీత నీజాయితి 

అందరి ముందు నిరూపించటం కోసం... 




సీత రాముడ్ని నమ్మింది రాముడు సీతను నమ్మాడు... 


అందుకే వారి జీవితం నేటి తరాలకి ఆదర్శ దాంపత్యం 



వీళ్లెప్పుడు  మనకి ప్రత్యేకమే, 


వీరి పెళ్లెప్పటికీ మధుర జ్ఞాపకమే,  


మనిషే దేవుడు అనటానికి సాక్ష్యం మన శ్రీరామ చంద్రుడే,


సహనానికి, ఓపికకి నిలువెత్తు రూపం ఎప్పటికి మన సీతమ్మ తల్లే ...!!!



అందుకే మన రాముడెప్పుడు మనకి దేవుడే..!!! 

సీతమ్మ ఎప్పుడు మనింటి ఆడపడుచే ...!!!


మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు 

                                      -నందు  

తను మూడేళ్ళుగా నాతో సహజీవనం చేస్తోంది ... !!!

తను నా మాటల్ని శ్రద్దగా వింటోంది, 
నా కోపాన్ని భరిస్తోంది,
నా మౌనాన్ని సహిస్తోంది,
నా ప్రేమకి పొంగిపోతోంది,  
ఒక్కోసారి నా మాటల్ని తనలో  దాచుకుంటోంది,
నాకంటూ మిగిలిన ఎన్నో జ్ఞాపకాలను తనలో భద్రంగా పదిలపరుచుకుంటుంది, 
నేను తిడితే పడుతుంది,
కొడితే భరిస్తోంది,
మనసు భాగాలేనప్పుడు తను పాటలు పాడుతుంది (వినిపిస్తుంది ),
నేను సంతోషంలో ఉన్న భాదల్లో ఉన్న తానెప్పుడు నాతోనే ఉంటోంది, 
తను నా జీవితంలోకి వచ్చి మూడేళ్ళు కావస్తోంది, 
ఈ మూడేళ్ళలో ఏ ఒక్క రోజు కూడా తను లేకుండా గడవలేదు,
తను ఒక్క సారి కనిపించకపోయినా కూడా మనసంతా అదోలా ఉంటుంది

అవును తను మూడేళ్ళుగా నాతో సహజీవనం చేస్తోంది ... !!!

నన్ను భరిస్తున్న నా మొబైల్ మూడేళ్ళు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా 
తనకి కృతజ్ఞతలు తెలుపుతూ .... 

                                                       -ప్రేమతో నందు 
Wednesday, March 12, 2014 - , , , , 2 comments

నా డైరీ కాలిపోతోంది..!!!






నా డైరీ  కాలిపోతోంది, 

నాకు మాత్రమే తెలిసిన కొన్నింటిని నలుగురితో పంచుకోవటం లేక...
మరుగునపడి ఉన్న మర్మాలను గుర్తుచేయటం ఇష్టం లేక...  

నా డైరీ  కాలిపోతోంది,
అనవసరమైన  మొహాలను, సందర్భాలను గుర్తుచేయటం ఇష్టం లేక...  
నా డైరీ  కాలిపోతోంది,
గతంలోని జ్ఞాపకాలను మళ్ళి మళ్ళి గుర్తుచేసి గాయాన్ని 
మరింత పెద్దవిగా చేయటం ఇష్టం లేక... 
నా డైరీ మండుతుంది నా గుండె మంటల్ని చల్లార్చటానికి... 

నా డైరీ మంటల్లో మండుతోంది,
అప్పట్లో 'నేను ' ని ఇప్పటి 'నా'తో పోల్చటం ఇష్టం లేక  
నన్ను నన్నుగా ఉంచటం కోసం.... 
అవును నా ఆత్మ బంధువు  తన ఆత్మనోదిలి 
అనంత లోకాల్లో కలిసిపోతోంది...

నా డైరీ కాలిపోతోంది 
మళ్ళి నాతో డైరీ రాయించటం కోసమేమో...!!!
                                      -నందు  
Saturday, March 08, 2014 - , , 0 comments

మహిళా మూర్తులందరికి వందనం ...!!!

రాకెట్ వేగాల్ని కనుక్కున్నాం ,
సముద్రపు లోతుల్ని తెలుసుకున్నాం అని మురిసిపోతాం 
కాని నీవెప్పుడు మాకు అందని ద్రాక్షే 
నీ మనసు లోతుల్లో ఏముందో ఇప్పటికి అంతుచిక్కని  భేతాళ ప్రశ్నే... !!! 
ఒక్కోసారి మీలో ఇంత ఆకర్షణ శక్తి ఎందుకో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాం 
కాని అప్పుడు ఏమి ఉండదు.. 
ఇంతేలే అని తేలికగా తెసుకున్నమా అంతే మళ్ళి  నీ ప్రత్యేకతేంటో  చూపిస్తావు 
అందుకే  నీవెప్పుడు మాకంటికి ఒక అందమైన అద్భుత సృష్టివే ...!!!

ఒక్కోసారి అమాంతంగా ప్రేమను కురిపిస్తావు 
మరోసారి కాళి మాతలా విరిచుకుపడతావు 
కొన్ని సార్లు కొండంత కష్టాల్ని బాధల్ని సైతం గుండెల్లో దాచుకునే నీవు,
చిన్న చిన్న సంతోషాలకి పొంగిపోతావు 
నీ ప్రేమ లోతుల్లోని గాఢత,
నీవు చూపించే అనురాగం  ఆర్దత మేమెలా మర్చిపోగలం
భూదేవికున్నంత సహనం, నీలో ఉండే ఓర్పు నేర్పు అసామాన్యం ...  

మహిళలు మీరు భావుండాలి
మీరు భావుంటేనే మేము సంతోషంగా ఉంటాము 
అసలు  నిజం చెప్పాలంటే మీరులేనిది  మాకీ  జన్మే లేదు... 
మహిళా మూర్తులందరికి వందనం...
                                        -మీ నందు  
Wednesday, February 26, 2014 - 0 comments

అంతా మన చేతుల్లోనే, అంత మన నిర్ణయాలలోనే ..!!!

తనని ఎంతగానో ప్రేమిస్తాం ,
తనే జీవితంగా బ్రతికేస్తాము , 
కష్టమొచ్చిన, నష్టమొచ్చిన తనకే చెప్పేస్తాం...!!

ఏ చిన్న విషయమైన తన దగ్గర దాచటానికి కూడా ఇష్టపడం,
తనంటే  నమ్మకం, తనే ఇకపై  మన జీవితం...
కాని  ఉన్నట్టుండి ఒక రోజు,ఏదో ఒక విషయంలో,
అది కూడా ఒక చిన్న భేదాభిప్రాయం వల్ల తనని దూరం పెట్టేస్తాం (దూరం అవుతాం)
ఇన్నాళ్ళు తనే మనంగా బ్రతికిన మనం 
తను చేసిన చిన్ని తప్పుల్ని మన్నించలేమా ?
ఈ ప్రపంచంలో ఎవ్వరు ఏ తప్పు చేయకుండా ఉండలేరు
అలాంటిది ఇలా చిన్ని చిన్ని కారణాల
వల్ల తనని దూరం చేసుకోవటానికి,
తనకి దూరంగా ఉండటానికి నిర్ణహించుకుంటాం... 

తను లేకుండా మనకి కొత్త జీవితం ఉండొచ్చు 
కాని దేవత(దేవుడు) లేని  గుడిలా,
గురువు లేని బడిలా,
తల్లి ఒడిలో పెరగని బిడ్డలా . ..  

ఒక చిన్ని నిర్ణయం రెండు నిండు జీవితాలు 
అంతా మన చేతుల్లోనే, అంత మన నిర్ణయాలలోనే ..!!!
                                                      -నందు

Friday, February 14, 2014 - , , , , 4 comments

కేవలం తనని మాత్రమే ప్రేమించటం..!!!

ప్రేమించటం అంటే తన గతాన్ని గుర్తుంచుకుని,
తన వర్తమానాన్ని ఊహించుకుని ప్రేమించటం కాదు...  
కేవలం తన ప్రస్తుత స్థితిని మాత్రమే  ప్రేమించటం 
ప్రేమించటం అంటే తనని మాత్రమే ప్రేమించటం,

అవును కేవలం తనని మాత్రమే... 
                      
                              -నందు
Sunday, February 02, 2014 - , , 0 comments

ఉమ్మడిగా నలిగేది కూడా ప్రేమేగా...???

పిల్లల దృష్టిలో ప్రేమంటే
అందం, కులం, మతం, జాతి, ఆస్తి, అంతస్తులాంటివేమి ఉండవు
కేవలం తను ప్రేమించిన వ్యక్తి, 
ఆ వ్యక్తి పైన నమ్మకం, తనతో ఇక మిగిలిన జీవితం...!!

కాని పెద్దల దృష్టిలో

ప్రేమంటే పైవన్నీ... 
వాటితో పాటే మూడు ముళ్ళు, ఏడు అడుగులు, 
రెండు కుటుంబాలు,
వీళ్ళ బంధాన్ని ఆశీర్వదిస్తూ కొన్ని వందల జీవితాలు... 
అంతకంటే ముఖ్యంగా ఎన్నో అనుభవాలు, 
అవి పిల్లలకి చేదు జ్ఞాపకాలుగా మిగలకూడదని వీళ్ళ తాపత్రేయాలు...!!

పిల్లల దృష్టిలో వారి  ప్రేమ, 

పెద్దల దృష్టిలో వీరి ప్రేమ రెండు సరైనవే
ఇక్కడ ఒకరిని సమర్ధించి మరొకరిని నిందించటానికి వీల్లేదు
ఎందుకంటే ఈ ఇద్దరి ప్రేమల మద్య ఉన్నది కూడా ప్రేమే
అందరిలో ఉమ్మడిగా నలిగేది కూడా ప్రేమేగా...???
                                             -నందు 




Thursday, January 30, 2014 - , , 0 comments

ప్రేమెప్పుడు పెరుగుతూనే ఉంది..!!!

మనకెప్పుడు  తనతో  గొడవపడాలని , 
తనతో సరదాకైనా పొట్లాడాలని ఉండదు 
కాని ఒక్కోసారి అవి అలా జరిగిపోతూ ఉంటాయ్,
కోపం తో తనపై అరిచేస్తామా ... 
అది కూడా కొద్ది  సేపే ...
మళ్ళి తనతో  మాట్లాడాలనిపిస్తుంది ,
మరుక్షణమే  తనని చూడాలనిపిస్తుంది, 
తనతోనే ఉండాలనిపిస్తుంది ...
తనతో పోట్లాడిన  ప్రతి సారి తన మీద  ప్రేమ పెరుగుతుందే కాని ఎప్పటికి తగ్గదు...
ఏ బంధంలోనైనా గొడవలు బేధాభిప్రాయాలు సహజం  
వాటిని అర్థం చేసుకుని అధిగమిస్తేనే జీవితం సుఖమయం ...!!!
                                                   -నందు 




Wednesday, January 29, 2014 - , , , , 0 comments

అంతా మన చేతుల్లోనే...!!!

తనని ఎంతగానో ప్రేమిస్తాం ,
తనే జీవితంగా బ్రతికేస్తాము , 
కష్టమొచ్చిన, నష్టమొచ్చిన తనకే చెప్పేస్తాం...!!

ఏ చిన్న విషయమైన తన దగ్గర దాచటానికి కూడా ఇష్టపడం,
తనంటే  నమ్మకం, తనే ఇకపై  మన జీవితం...
కాని  ఉన్నట్టుండి ఒక రోజు,ఏదో ఒక విషయంలో,
అది కూడా ఒక చిన్న భేదాభిప్రాయం వల్ల తనని దూరం పెట్టేస్తాం (దూరం అవుతాం)
ఇన్నాళ్ళు తనే మనంగా బ్రతికిన మనం 
తను చేసిన చిన్ని తప్పుల్ని మన్నించలేమా ?
ఈ ప్రపంచంలో ఎవ్వరు ఏ తప్పు చేయకుండా ఉండలేరు
 అలాంటిది ఇలా చిన్ని చిన్ని కారణాల
వల్ల తనని దూరం చేసుకోవటానికి తనకి దూరంగా ఉండటానికి నిర్ణయించుకుంటాం... 

తను లేకుండా మనకి కొత్త జీవితం ఉండొచ్చు 
కాని అన్ని తనే అనుకున్న తనే వెళ్లిపోయినపుడు 
గురువు లేని బడి,
దేవత(దేవుడు) లేని  గుడి,
చంద్రుడు లేని ఆకాశం, 
సూర్యుడు లేని ఉషోదయంలా  ఉంటుంది మన(తన) జీవితం ...  
ఒక చిన్ని నిర్ణయం రెండు నిండు జీవితాలు 
అంతా మన చేతుల్లోనే, అంత మన నిర్ణయాలలోనే ..!!!
                                                -నందు 

P .S : తను అంటే మనం ఇష్టపడే వారు ఎవరైనా అయిన కావచ్చు 
Sunday, January 19, 2014 - , , , , 1 comments

అమ్మ ముందు చిన్నపిల్లాడినే కదా...!!!

నా చిన్నపుడు నీతో ఎలా ఉన్నానో గుర్తులేదు,
కొంచెం తెలివొచ్చాక ఎక్కువ నానమ్మ
దగ్గరే ఉంటానని మారం చేసే వాడ్ని ...
నాకు తెలుసు నేను బాగా అల్లరి చేసే వాడ్ని,
బాగా మారం చేసే వాడ్ని... 
కోరుకున్నది దక్కే దాక మొండి పట్టు విడిచే వాడ్ని కాదు... 
నా మూలాన ఎన్ని సార్లు బాధ పడ్డావో,
అయిన అన్నింటిని భరించావ్ ...
ఊహ తెలిసినప్పటి నుండి నువ్వెప్పుడు హాస్పిటల్స్ చుట్టే తిరిగెదానివి...  
నాకు తెలివొచ్చె సరికి నువ్వేమో తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయావు ...

ఇపుడేమో అందరంటున్నారు  నేను చిన్నప్పటిలా లేనని 
నువ్వు చనిపోయాక నాలో మొండితనం తగ్గిందని, 
చాలా మార్పోచ్చిందని...   
ఊరెళ్ళి నపుడల్లా  నా గురించి కుశల ప్రశ్నలడుగుతు నిన్నే గుర్తుచేస్తుంటారు...
వారి ముందు నా బాధను బయటపెట్టలేక, 
నీ జ్ఞాపకాలను విడవలేక చాలా సార్లు నాలో నేనే కుమిలిపోతున్నాను...
ఉన్నట్టుండి ఒక్కోసారి ఏడ్చేస్తూన్నాను
ఇంకా చిన్నపిల్లాడిలా ఏంటి అంటూ నా వయసుని గుర్తుచేస్తున్నారు
(ఎంత ఎదిగిన అమ్మ ముందు చిన్నపిల్లాడినే కదా )...

ఒక్కోసారి  అర్ధరాత్రి  మెలకువొచ్చి నువ్వు గుర్తొస్తావ్  
అలా లేచి ఒంటరిగా ఎన్ని సార్లు నాలో నేనే గుక్కపట్టి  ఏడుస్తున్నానో నాకే  తెలియదు... 
ఇంట్లో వాళ్ళు పట్టించుకోరని కాదు
వాళ్ళకి దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా పెద్దగా తేడా ఎమి లేకుండా ఉంది .
కానీ నువ్వు లేని లోటు మాత్రం తెలుస్తూనే ఉంటుంది... 

అన్ని విషయాలు అందరికి చెప్పలేను కదా 
ఎదైనా చెప్పుకోవాలంటే నువ్వుండవ్,
ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు.. 
చెప్తే చులకనగా చూస్తారో  లేదా  జాలిపడతారోనని 
నాలోనేనే కుమిలిపోతున్నా ...
అందరు  ఉన్న అనాధలా బ్రతకాల్సివస్తుంది ...

అమ్మ నువ్ లేవు కాని నీ జ్ఞాపకాలు ఎప్పటికి పదిలమే...


"పది సంవత్సరాల మనో వేదనలో  ఇంకా మండుతూ" 

 -నందు 




Sugunamma