Saturday, September 21, 2013 - , , , 0 comments

జీవితం అంటే ఇదేనేమో






నీ అనుకునే వాళ్ళు


నిన్ను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే వాళ్ళు

నీవు పోయినపుడు చితివరకే వస్తారు 

కాని చితిపైకి రారు...

వాళ్ళు రాలేక కాదు

అదే జీవితం అంటే...

ఎవ్వరున్నా ఆగదు

ఎవ్వరికోసం ఆగదు 


- నందు
Sunday, May 12, 2013 - , 1 comments

అమ్మ ప్రేమ




అమ్మని గురించి అమ్మ ప్రేమ గురించి చెప్పటానికి 
ప్రత్యేకంగా ఒక రోజు కావాలా 
అమ్మ తోడుంటే ప్రతి రోజు మధురమేగా 
ప్రతి డే  మదర్స్ డే  నే కదా... !!! 
  
                   -నందు
Friday, May 10, 2013 - , 0 comments

ఎందుకో ఏమో..!!!



తొలిసారి నిన్ను చూసినప్పుడు నీవైపే చూస్తుండిపోయా  
నీవెవరో తెలుసుకోవాలని నీ వెనకే అడుగులేసా 
నీతో పరిచయం అయ్యాక మాట్లాడకుండా ఉండలేకపోయా   
నువ్వు నా తోడయ్యాక నిన్ను విడిచి ఉండలేకపోతున్నా.... !!! 
                               
                                           -నందు
 
Monday, May 06, 2013 - 0 comments

ప్రియా ప్రేమంటే ఇదేనేమో...!!!

నిన్ను తొలిసారి చూసినప్పుడు, 
తొలి సారి నీతో మాట్లాడినప్పుడు, 
అప్పటి నుంచి, 
ఇప్పటిదాకా
నీకోసం ఎదురు చూస్తున్నప్పుడు, 
నిన్ను కలిసినప్పుడు, 
నీతో మాట్లాడినప్పుడు,

ప్రతి సారి అదే అలజడి అదే ఆర్ధత...!!! 

కళ్ళు అలా చూస్తూ ఉండిపోతున్నాయి 
మనసేమో మూగబోతుంది 
ఒక్కోసారి ఏమి మాట్లాడాలనిపించదు 
నిన్ను అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది 
ఎంత సేపైనా 

నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోయిన మరుక్షణమే 
మల్లి నిన్ను చూడాలనిపిస్తుంది

ప్రియా ప్రేమంటే ఇదేనేమో 
వీడలేక వీడిపోవటం... !!! 


                  -నందు



Friday, April 19, 2013 - , 0 comments

శ్రీరామ నవమి శుభాకాంక్షలు


మనిషి జీవితంలో తను ఒకే సారి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు
కాని ఈ పెళ్లిని మాత్రం ప్రాతి సారి జరిపించాలనుకుంటారు  

ఈ పెళ్లి మాత్రం ఎప్పటికి ప్రత్యేకమే,
ప్రతి సంవత్సరం  నిత్య నూతనమే, 
మనందరికీ ఒక మదుర జ్ఞాపకమే...  
ప్రతి సంవత్సరం మనమే దగ్గరుండి మరీ ఈ పెళ్లిని జరిపిస్తాము 
మనింట్లో పెళ్ళిగా మురిసిపోతాము
ఈ పెళ్లి జరిగాకే మనింట్లో పెళ్ళిళ్ళ గురించి,
పెళ్లి సంబంధాల గురించి అన్వేషణ మొదలెడతాము  
పచ్చని తోరణాలతో, 
మేళ వాయిద్యాల నడుమ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగే ఈ సీతారాములోరి పెళ్ళి ఘనంగా ఇలాగే జరగాలని, జరపాలని కోరుకుంటూ మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు 
Wednesday, April 10, 2013 - , 0 comments

శూన్యం లోకి...!!!



అల్లర్లను, ఆనందాలను పక్కకు తోసేసీ,
బంధాలకు,  బాంధవ్యాలకు దూరంగా,  
జరిగిన అనుభవాలను, మిగిలిన అనుభూతులను  భుజాన వేసుకుని 
మనసుని మ్యూట్ లో పెట్టేసి,  
అలా శూన్యం లోకి నడవాలనుంది 
ఇలా ఎంత దూరమైనా...... !!! 
                      
                          -నందు 




Thursday, February 28, 2013 - 0 comments

ఈ కక్ష ఎవరి మీద ?






కక్ష  ఎవరి మీద ?

నూట ముప్పయ్ కోట్ల ప్రజాస్వామ్య దేశం మీదనా  ?

పేద అమాయక ప్రజల మీదనా  చేత కాని ప్రబుత్వం మీదనా ?
దేని కోసం ఈ వ్యద  ఎందుకీ మారణకాండ ?
ప్రజా స్వామ్య దేశం లో పుట్టటమే మా  తప్పా  ?



ఓ  ముష్కర మూక 

ఈ దారుణకాండకి  బలైన అమాయక ప్రజలకి, వారి కుటుంబాలకి,  
ఏమిటి మీరిచ్చే సమాధానం ???

                                                 -నందు




Sunday, January 27, 2013 - 0 comments

మిత్రమా నీకు శుభాకాంక్షలు


'ఆరేళ్ళ' పరిచయం
'అయిదేళ్ళ'  అత్యంత సానిహిత్యం 
'నాలుగేళ్ల' వీడలేని తనం 
'మూడేళ్ళు'గా కలిసి  'ఒక్కటి'గా తిరిగిన మనం 
నేడు 'రెండు'గా విడిపోయాం.....
ఇక నుండి నీ వటు మేమిటు....

జూనియర్ శాస్రవేత్తగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభిస్తున్న దేవ్  
నీకు అన్ని విధాలా మంచి జరగాలని కోరుకుంటూ నీ మిత్రులు.....


 

ప్రేమ జ్ఞాపకాలు

ఎవరినో ప్రేమిస్తావు

మరెవరినో పెళ్లి చేసుకుంటావు

గుండె లోతుల్లో ఒకరు గుండెలపై మరొకరు..

నీలో ఒకరు, నీతో ఒకరు..

తనపై నీ ప్రేమకు గుర్తుగా నీ మెయిల్ ఐడికో,

లేక నీ కంప్యూటర్ కో తన పేరుని పాస్ వర్డ్ గా తగిలిస్తావు

తన పేరునో లేక తన పేరులోని మొదటి అక్షరంతోనో నీ పిల్లలకి పేరు పెట్టుకుని మురిసిపోతావు

తను గుర్తోచ్చినపుడల్లా నీలో అనాలోచితంగా ఏవో స్పందనలు

తను గుర్తొచ్చిన ఆనందంలోనో లేక తనతో వీడిపోయినందుకు కలుగుతున్న ఆవేదనతోనో.

ఆ రెండింటిని గుర్తుపట్టకుండా

సాయంకాలపు వెలుగులను కమ్ముకొస్తున్న కారు చీకట్లు

కప్పెసినట్లు ఎప్పుడు నింపాదిగా ఉండే నీ నిర్మలమైన మనసు...


ఓ మనిషి...!!!

ఇవేనా నీ విరహ వేదనకు సాక్షాలు...








సుఖంగా ఉండి సంతోషంగా లేని జీవితాలకి అంకితం...నందు

Thursday, December 20, 2012 - , 0 comments

ఎం జరిగినా మన మంచికే ......!!!


'నేడు' ఎం జరుగుతుందో తెలియని తెలియదు  కాని 'రేపటి' గురించి బెంగ ఎందుకు ?

జరుగుతుందో లేదో తెలియని యుగాంతం గురించి  స్కూల్స్ కాలేజీలు వదిలేసి, 

ఆఫీసులు పనులన్నీ పక్కన పెట్టి భయంతో 

ఒక మూలలో పడుకోవటం కాదు  

ఒక వేళ  నిజంగా ఈ ఈ యుగాంతం జరిగితే(!)  జరగనీ,

మనమేమి ఆపలేము కదా  సృష్టి కార్యాన్ని ఎవ్వరు ఆపలేరు ఆ సృష్టిని సృష్టించిన సృష్టి కర్త అయినా...  

పనులన్నీ వదిలేసి చావుకి బయపడటం కాదు  

మన విది నిర్వహణలో, మన బాద్యతలను మనం నేరవేర్చినప్పుడే మన 

జన్మకి నిజమైన సార్థకత

ఒక వేళ  మనం చేసే రోజు వారి పనిలో ఉండి  మనం చనిపోతే  అదే  మన 

ఆత్మకి అసలైన  శాంతి(ఇంట్లో ఉండి  చనిపోవటం కంటే పనిలో ఉండి  

చనిపోవటం ఉత్తమం కదా ?) 

చేస్తున్న పనికి ఘనమైన నివాళి 

జరగని భయాన్ని తలుచుకుని చింతించకుండా 

నిశ్చింతగా ఉండండి ఎం జరిగినా మన మంచికే ...... 

                                                 -నందు 

యుగాంతం గురించి నా భావన...