జాతిని జాగృత పరిచేది...
జగతిని జ్యోతియై వెలిగించేది
సృష్టికి ప్రతి సృష్టి చేసేది అమ్మ...!
"తన ప్రాణం ఫణంగా పెట్టి మనకు ప్రాణ ప్రతిష్ట చేస్తుంది
మన కంట్లో నలుసు పడితే మన కంటే ముందు కన్నీరు కార్చుతుంది
తను క్రోవోత్తిలా కరిగిపోతు మన కోసం కాంతుల్ని వెదజల్లుతుంది
తను గంధపు చెక్కలాఅరిగిపోతు సుగందాల్ని పంచుతుంది
తను రాలిపోతూ పువ్వులా పరిమళాలు పంచుతుంది
మన కోసం అన్ని చేయాలని ఆరాట పడుతుంది
ఎన్ని చేసినా ఇంక ఏదో చేయలేదని చింతిస్తూనే ఉంటుంది."
కష్టాలను, కన్నీళ్లను కడుపులో దాచుకుని మనకోసం సర్వస్వం అర్పించేది అమ్మ............!
అలాంటి గొప్ప గుణం కలిగిన అమ్మలకు మనస్పూర్తిగా నా ఈ చిన్ని కవితను అంకితం చేస్తూ....
" మదర్స్ డే శుభాకాంక్షలు"
-మీ నందు.
రెండు సంవత్శరాల క్రితం కాలేజీ మ్యాగజిన్ కోసం నేను రాసిన ఒక చిన్న కవిత