Showing posts with label ప్రేమలు రకాలు. Show all posts
Showing posts with label ప్రేమలు రకాలు. Show all posts
Sunday, February 02, 2014 - , , 0 comments

ఉమ్మడిగా నలిగేది కూడా ప్రేమేగా...???

పిల్లల దృష్టిలో ప్రేమంటే
అందం, కులం, మతం, జాతి, ఆస్తి, అంతస్తులాంటివేమి ఉండవు
కేవలం తను ప్రేమించిన వ్యక్తి, 
ఆ వ్యక్తి పైన నమ్మకం, తనతో ఇక మిగిలిన జీవితం...!!

కాని పెద్దల దృష్టిలో

ప్రేమంటే పైవన్నీ... 
వాటితో పాటే మూడు ముళ్ళు, ఏడు అడుగులు, 
రెండు కుటుంబాలు,
వీళ్ళ బంధాన్ని ఆశీర్వదిస్తూ కొన్ని వందల జీవితాలు... 
అంతకంటే ముఖ్యంగా ఎన్నో అనుభవాలు, 
అవి పిల్లలకి చేదు జ్ఞాపకాలుగా మిగలకూడదని వీళ్ళ తాపత్రేయాలు...!!

పిల్లల దృష్టిలో వారి  ప్రేమ, 

పెద్దల దృష్టిలో వీరి ప్రేమ రెండు సరైనవే
ఇక్కడ ఒకరిని సమర్ధించి మరొకరిని నిందించటానికి వీల్లేదు
ఎందుకంటే ఈ ఇద్దరి ప్రేమల మద్య ఉన్నది కూడా ప్రేమే
అందరిలో ఉమ్మడిగా నలిగేది కూడా ప్రేమేగా...???
                                             -నందు 




Thursday, January 30, 2014 - , , 0 comments

ప్రేమెప్పుడు పెరుగుతూనే ఉంది..!!!

మనకెప్పుడు  తనతో  గొడవపడాలని , 
తనతో సరదాకైనా పొట్లాడాలని ఉండదు 
కాని ఒక్కోసారి అవి అలా జరిగిపోతూ ఉంటాయ్,
కోపం తో తనపై అరిచేస్తామా ... 
అది కూడా కొద్ది  సేపే ...
మళ్ళి తనతో  మాట్లాడాలనిపిస్తుంది ,
మరుక్షణమే  తనని చూడాలనిపిస్తుంది, 
తనతోనే ఉండాలనిపిస్తుంది ...
తనతో పోట్లాడిన  ప్రతి సారి తన మీద  ప్రేమ పెరుగుతుందే కాని ఎప్పటికి తగ్గదు...
ఏ బంధంలోనైనా గొడవలు బేధాభిప్రాయాలు సహజం  
వాటిని అర్థం చేసుకుని అధిగమిస్తేనే జీవితం సుఖమయం ...!!!
                                                   -నందు 




Monday, January 06, 2014 - , , 0 comments

ప్రేమించు ప్రేమతో...!!!



ప్రేమించాలి(ప్రేమించబడాలి) అంటే అందంగా ఉండటమొక్కటే సరిపోదు
అందమైన మనసుండాలి
ఆనందంగా ఆదరించగలగాలి
అర్థం చేసుకునే మనస్తత్వముండాలి
అన్నింటికంటే మిన్నగా నీకు నేనున్నాననే భారోసానివ్వాలి
అప్పుడు నువ్వే తన ప్రపంచం
నువ్వే తన లోకం
నువ్వు లేకపోతే తన బ్రతుకు శూన్యం(ఆడైనా, మగైనా) 
అందుకే నేస్తం ప్రేమించు ప్రేమతో...!!!
-నందు
Monday, November 04, 2013 - , , 4 comments

పారేసుకోవటం...!!!

ప్రేమంటే మనసుని పారేసుకోవటం కాదు
నువ్వున్నపుడు కాలాన్ని,
నువ్వు లేనప్పుడు సంతోషాన్ని,ఆనందాన్ని కోల్పోవటం
నీ సానిహిత్యంలో ఎడబాటుని,
నీ మాటలతో మౌనాన్ని,
నీ తోడులో ఒంటరితనాన్ని పారేసుకోవటం...!!!
                         -నందు 
     


Wednesday, October 30, 2013 - , , 5 comments

సముద్రమంత ప్రేమ కావాలి



నాకు సముద్రమంత ప్రేమ కావాలి
నాకే కాదు నీకు,తనకు, మనందరికీ సముద్రమంత ప్రేమ కావాలి

మరి ఈ విశ్వమంతటికి ప్రేమను పంచేవారెక్కడి నుండి రావాలి ??

నీకు సముద్రమంత ప్రేమ కావాలన్నపుడు 
కనీసం నీవు కాలువంతైనా ప్రేమను పంచాలి కదా??
ఆశించటం మానేసి ఇవ్వటం మొదలెడితే విశ్వమంతా ప్రేమతో నిండిపోతుంది. 

                                                                                -నందు

ప్రియా ఏంటి నీ మాయ....?

ప్రేమంటే ఏంటో తెలియకుండానే ప్రేమించాను
మనసంటే ఏంటో పూర్తిగా తెలియకుండానే మనసిచ్చేసాను
కాని నేనంటే ఏంటో నాకు తెలిసి కూడా నాలా  నేను ఉండలేకపోతున్నాను
ప్రియా ఏంటి నీ మాయ....?
                                 
                                        -నందు


Tuesday, November 22, 2011 - , 2 comments

ఓ ప్రేమ...ఏముంది నీలో ?



ప్రేమ... ప్రేమ... ప్రేమ...
అసలు ఎవరు నీవు ?
ఏముంది నీలో ?
నీవేమైన రూపానివా మరి కనిపించవెందుకో ?
మరి ఎందుకు ఈ భూప్రపంచమంతా  నీ చుట్టే తిరుగుతుంది ?

నీవేమైన బందానివా, అనుబందానివా ?
ప్రతి రోజు నీ నా స్మరణే చేస్తుంటాము ఎందుకని ?
నీ ప్రేమలో ఐన్ స్టీన్ కి   అందని శక్తి  ఉందా ?
నీలో గెలీలియో గాలలకి కూడా అందని గాడత  ఉందా ?
 అణువులు ,పరమాణువుల సమ్మేళనం లో 
కంటికి కూడా కనిపించని కణాల మిళితంలో  
అన్ని రకాల భావనలను,
మనసుని కూడా మనుసులో ఇముడ్చుకున్న 
ఆదునిక యుగపు మరయంత్రానివా ?
మరి ఏముంది నీలో ?
 ఎందుకింత ఆరాటం  ?

p.s:
ప్రేమ సమాదానం: నాలో అంతులేని,అంతంలేని ప్రేముంది కాబట్టే దాన్ని అందుకోటానికి  మీ ఆరాటం 

                                                -నందు 

Sunday, September 25, 2011 - , 8 comments

తొలి చూపులో నిజమైన ప్రేమ...




మనం చాలా సిమాలలో చూసి ఉంటాం కదా హీరోగాని  హీరొయిన్ గాని
 ఎవరో ఒకరు చూసినప్పుడు వారు వారిలో ఒక రకమైన ఫీలింగ్....
అదే మన చాలా సార్లు విని ఉంటాం "లవ్ ఎట్ ఫస్ట్ సైట్" అని ....
నిజంగా అలా తొలి చూపులో నిజమైన ప్రేమ పుడుతుందా ?
 ఒక వేళ పుట్టిన ఆ ప్రేమ నిజమైనదేనా ?
తొలి చూపులో నిజమైన ప్రేమంటే
మనకు తెలియకుండానే మనలో ఏదో ప్రకంపన...
మన హృదయ స్పందనలలోనే కాదు మన దేహం లో కూడా...
అలా  మొదలైన ఆ మార్పు తను కనిపించిన ప్రతి సారి కలిగితే....
అలాంటి ఆ తోలిచుపు ప్రేమ జీవితాంతం ఉంటే నిజంగా ఎంత బావుంటుందో కదా...
 అలాంటి ప్రేమను పొందిన వారు ఎంత గొప్ప అదృష్టవంతులో....
మీలో ఎవరైనా ఉన్నారా మరి ?


                                                              -నందు.
Friday, August 26, 2011 - , 3 comments

వీడిపోతే విలువ తెలుస్తుందా ?










మనకి ఇలాంటి సందేహం చాలా సార్లు కలిగి ఉంటుంది కదా
 కనీసం ఒక సారయిన  మనం మనసులో  అనుకుని ఉంటాం కదా...
ఒక్కోసారి ఏ కారణం లేకుండానే అ ప్రయత్నంగా మన కంటి నుండి కన్నిటీ  ధారా పడుతూనే ఉంది. 
తన సాహచర్యం లేకుండా ఈ జీవితాన్ని గడుపుతున్నందుకు...
ఇంకోసారి తన సాన్నిహిత్యంలో గడిపిన మధుర క్షణాలు  గుర్తుకు వచ్చినపుడు ఆనందభాష్పాల రూపంలో....
ఇలాంటి అనుభవాలు అనుభూతులు మనదగ్గేరెన్నో ఉండి ఉంటాయి కదా....
తన ఒడిలో కన్న బిడ్డను నిద్రపుచ్చే ఒక తల్లి  భూదేవిఒడిలో  నిదరోయినవేళ,
విద్యాబుద్దులు నేర్పిన గురువు చివరిసారిగా తన వీడ్కోలు సభలో ఉద్వేగంగా మాట్లాడుతున్న వేళ...
మనకన్ని తానే అయి  మననుండి ఏమి ఆశించకుండా ఆకస్మికంగా కన్ను మూసినా ఒక నేస్తాన్ని కడ సారి చూసిన వేళ....
జీవితాంతం తోడు ఉంటుందనుకున్న  ప్రేమ బంధం  కాలం వేసిన కాటుకి కనుమరుగైన వేళ....
ఇలాంటి జ్ఞాపకాలు మనదగ్గేరెన్నో...
వారెవరో తెలియకుండా మన పరిచయం మొదలవ్తుంది ఒక జ్ఞాపకాన్ని మాత్రం మిగులుస్తుంది..
వీడిపోతే వారి విలువ తెలుస్తుందని కాదు 
ఎందుకంటే మనకేందుకో మనం వారిని వీడిపోతామని వారికి దూరంగా ఉంటామనే  ఆలోచనే రాదు...

వీటన్నింటికి ఒకే ఒక కారణం 

అదే ప్రతి మనిషికి వీడ్కోలు ఒక భాగమేనని...
కాని మనం దీనికి ఒప్పుకోము  కాదా...




                                                 -నందు








Thursday, August 18, 2011 - , 6 comments

నిజమైన ప్రేమ



ప్రేమ ఈ రెండక్షరాల పదం ఒక పెద్ద ప్రపంచానికి ప్రాణవాయువేమో   అంటే అతిశయోక్తి కాదేమో.....


నేను మొదట్లో ప్రేమ గురించి రాయటం మొదలెట్టినప్పుడు నాలో నాకే  తెలియని అనుభూతి..
ఏవో పెనవేసుకున్న భావాలు నాలో...


నేను ఊహించికుని రాస్తేనే ప్రేమ నిజంగా ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది అలాంటిది నిజమైన ప్రేమను పొందితే అదృష్టవంతులమే  
కదా...


ఈ మద్య కాలం లో మనం తరచుగా వింటున్న మాట నిజమైన ప్రేమ కనిపించట్లేదు దొరకట్లేదు అని....

అదేమన్న వస్తువా ?  వెతికి పట్టుకోవటానికి.... కాదు కదా...

నిజంగా మనం కొంత  మంది ప్రేమికులను చూస్తే  ఇది కూడా ప్రేమేనా అనే సందేహం కలగక మానదు...

అది వారికి (ఆ ప్రేమికులకి)బాగానే ఉండొచ్చు కాని మనకే నచ్చక  

పోవచ్చు.... 

ఇలాంటి ప్రేమలు మనకెన్నో కన్పిస్తూనే ఉంటాయి కదా...

ప్రేమంటే మనసుకి ముసుగులు తొడిగి మురిసిపోవటం కాదు...

నిజమైన  ప్రేమంటే మనం పొందే ప్రేమలో నిజాయితి ఎంత ఉందో 

గ్రహించటమే....

మనం ఎలా ఉన్న మనల్ని ఇష్టపడే కన్నవారి ప్రేమ,

నీలోని మంచితోపాటు చెడుని కూడా స్వీకరించే 

స్నేహితుడి  ప్రేమ

నువ్వెలా ఉన్న, నువ్వు మారినా కూడా తను మారకుండా నిన్ను నిన్నుగా ప్రేమించే వారి ప్రేమ... 

మనకు ఇష్టమైన వారు ఎంత దూరంగా ఉన్న వారి పైన 

ఇంచుక కూడా మారని మునుపటి ప్రేమ...

 ఇదే నిజమైన ప్రేమ..

ప్రేమ ఎప్పుడు కనిపిస్తుంది కాని, నిజమైన ప్రేమ కొన్ని 

సార్లే పుడుతుంది...

వర్షం ఎప్పుడు పడుతుంది కాని  వడగండ్ల వాన కొన్ని 

సార్లే పడుతుంది 


ఒడిసి పట్టుకోవటానికి సిద్దంగా ఉండు వడగండ్లని, 

నిజమైన ప్రేమని కూడా....
                        -నందు


Love Orkut Scraps, love quotes graphics and comments









Wednesday, August 03, 2011 - , 7 comments

జగమంత ప్రేమ



ప్రేమంటే ఏంటి...?  ప్రేమంటే ఇదేనా ... ఇంకేదోనా....?
నాకెందుకో చాలా సార్లు ఈ ప్రేమ గురించి రాద్దమనుకున్నపుడల్లా ఇంతకి ప్రేమంటే ఏంటి అనే ప్రశ్న మొదలవుతుంది...
నాకు తెలిసి ఈ భూప్రపంచం మీద ఇదే ప్రేమ అని సరైన నిర్వచనం ఇచ్చిన వారు లేరేమో...
 ఎందుకంటే వారి దృష్టిలో  ప్రేమ కి నిర్వచనం అదేనేమో, మనకి అది నచ్చదేమో .... 
మనం సరిగ్గా ప్రేమంటే ఇదేనేమో అని ఒక భావనకి  వచ్చేలోపే ప్రేమంటే ఇదేనా  అనే సందేహం కూడా మొలకెత్తుతుంది ఒక్కసారి ...
మనం ప్రేమించిన నిచ్చెలి మనతోపాటే ఉంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోయి  ఇదేనేమో ప్రేమంటే అని మనం అనుకునే లోపే,
 మన కంట్లో ఏ చిన్న నలుసు పడినా మనకంటే ముందు తన కంట్లోంచి నీరు కార్చే కన్న తల్లి ప్రేమను చూసి ఇంత కంటే గొప్ప ప్రేమ ఉండదని ఎప్పుడు చెప్పుకుంటాము...
మన చిన్నప్పుడు నడిస్తే కాళ్ళు నొప్పెడుతాయని తన మోకాళ్లను మన కాళ్ళుగా మార్చి(మనకు కాళ్ళుగా అమర్చి)  మనల్ని నడిపించిన నాన్న ప్రేమ,
 ఎప్పుడు మనతో పోట్లాడే అక్క ప్రేమ, 
ఏ పరిచయం లేకుండానే  మన జీవితంలోకి ప్రవేశించి అడక్కుండానే అన్ని చేసి పెట్టే  ఆప్త మిత్రుడి ప్రేమ....
ఇవన్నీ  ఎప్పటికప్పుడు ప్రేమ అనే పదానికి నిర్వచనాన్ని  మారుస్తూనే  ఉన్నాయి....
ఒక్కోసారి ఒంటరి తనంలో కుడా  ప్రేమను  పొందే మనం ప్రేమలో ఇన్ని రకాలను ఆస్వాదించాక,
 ఏ ఒక్క అనుభూతినో లేక, ఏ ఒక్క  అనుభవాన్నో ప్రేమనుకోవటం పొరపాటే ...
ఎందుకంటే ప్రతి "ప్రేమ" మనకు  "ప్రేమ" గానే ఉంటుంది.
 మరి నిజమైన ప్రేమ ఏంటంటే  మనం పొందే  ప్రేమలో ఎంత వరకు నిజాయితి ఉందో గ్రహించడమే ...
ఆ  నిజమైన  ప్రేమ ఆనేది ఏంటో తెలుసుకునేలోపే, 
దాన్ని గ్రహించేలోపే మనం ఆ ప్రేమకే దురమవుతామేమో... 
ఒక్కోసారి ఈ జీవితానికి  కూడా.... 
                                                                    
                                      -నందు 

నా జీవితంలోకి....


మళ్ళీ తనోచ్చింది...!

అవును తనోచ్చింది.
నా ఊహల్లోకి,
నా జ్ఞాపకాల్లోకి,
నా ఆలోచనలోకి,
నా మనసులోకి...
నా జీవితంలోకి....

తనెవరోకాదు వర్షాకాలం..!!        
                       -నందు

Wednesday, June 29, 2011 - , 0 comments

Your Love




If U in LOVE with someone,
At Least U should share it with Whom you are Loving....


Becoz it's not the SECURITY PIN of your ATM, 
or, It's not the PASSWORD of PC to keep it with u secretly...
                                 -Nandu

ప్రపంచంలోని ప్రతి అమ్మ కి మదర్స్ డే శుభాకాంక్షలు ....!

జాతిని జాగృత పరిచేది...
జగతిని జ్యోతియై వెలిగించేది
 సృష్టికి ప్రతి సృష్టి  చేసేది అమ్మ...!

"తన ప్రాణం ఫణంగా పెట్టి మనకు ప్రాణ ప్రతిష్ట చేస్తుంది
మన కంట్లో నలుసు పడితే మన కంటే ముందు కన్నీరు కార్చుతుంది   
తను క్రోవోత్తిలా కరిగిపోతు మన కోసం  కాంతుల్ని వెదజల్లుతుంది
 తను గంధపు చెక్కలాఅరిగిపోతు  సుగందాల్ని పంచుతుంది 
తను రాలిపోతూ పువ్వులా పరిమళాలు  పంచుతుంది
మన కోసం అన్ని చేయాలని ఆరాట పడుతుంది
ఎన్ని చేసినా ఇంక ఏదో  చేయలేదని చింతిస్తూనే ఉంటుంది."  

కష్టాలను, కన్నీళ్లను  కడుపులో దాచుకుని మనకోసం సర్వస్వం అర్పించేది అమ్మ............!

అలాంటి గొప్ప గుణం కలిగిన అమ్మలకు మనస్పూర్తిగా  నా ఈ చిన్ని కవితను అంకితం చేస్తూ....

" మదర్స్  డే శుభాకాంక్షలు" 

                                                                       -మీ నందు. 





రెండు  సంవత్శరాల  క్రితం కాలేజీ మ్యాగజిన్   కోసం నేను రాసిన ఒక చిన్న  కవిత