Tuesday, March 09, 2021 - 0 comments

మునికాంతపల్లి కతలు:

మునికాంతపల్లి కతలు:
ఇవి మునికాంత పల్లి కథలు అని కాకుండా ప్రతి పల్లెలోని కథలు అనొచ్చేమో, ముఖ్యంగా ప్రతీ పల్లే లోని దిగువ మధ్య తరగతి కధలు అనొచ్చెమో...
ఇందులోని కథలను చదువుతున్నపుడు అరెరే మనకు ఇలానే జరిగిందే, మనము ఇలాంటివి చుసామే, మనలో కూడా ఇలాంటి వారున్నారే అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతి పల్లెలో ప్రతి గడపలో జరిగే ఘర్షణలే ఈ మునికాంత పల్లి కథలు....
తెలిసి తెలియని వయసులో ప్రేమలో ఉన్నప్పుడు మనలో ఉండే ఆకర్షణ 'ఇంటికి ఏంజిలోస్తుందాది' లో కనబడుతుంది...
ఇప్పుడంటే అందరికి నీటి కొలాయిలు, ఇంట్లోనే బోరుమోటార్లు ఉన్నాయి కానీ చిన్నప్పుడు పల్లెటూర్లలో రెండు మూడు రోజులకో, వారానికోసారో నీల్లొచ్చేవి, కోళాయిలు కూడా వీదికి ఒకటో రెండో ఉండేటివి, ఇప్పుడు పూర్తిగా అంతరించి పోతున్న కళ అయినటువంటి వీధి కొళాయి దగ్గరే కొట్లాటను '*ఈది కులాయి ఈరోయిన్లు*' లో కళ్ళకు కట్టినట్లు చూపెట్టాడు సొలొమోను విజయ్ కుమారనే కవి.
ఇప్పుడు కూడా కులాల కోసం మతాల కోసం కొట్టుకు చూస్తున్నారు కొంత మంది కానీ అప్పట్లో వేరే కులం వేరే మతం లో ప్రేమ వ్యవహారాలంటే ఊరంతా ఇదే ముచ్చట నడిచేది అట్లాంటి ప్రేమలను ' ఫాతిమా' , మాల పిల్ల, మాదిగి పిల్లోడు' లో కనిపిస్తుంది,
ఎక్కడో చిన్న పల్లెటూర్లో పుట్టి పెరిగి, కనీస వసతులు లేకుండా చదువుకుని గొప్పగొప్ప స్థానాల్లో నిలిచిన ఎంతో మంది పేదింటి దీపాల కథే 'ఈరో నాగార్జున గాడ్ని బడ్లో ఎస్తుండారు'.
మనేమెప్పుడు వేటకెళ్ళే రాజుల గురించి చదివామే కానీ,
ప్రతి ఊర్లో అడవి పందుల్ని దైర్యంగా ఎంతో మంది మొనగాళ్ల గురించి మనకు తెలిసిన కథనే కొత్తగా చెప్పాడు ' అడవి పందిని కొట్టే మొనగాళ్లు' లో...
ఇలా చెప్పుకుంటూ పోతే
దేశ దిమ్మరి కాశయ్య
పియ్యేత్తే మదిగి సుబ్బులు
మా పెంచిలావ్వ
అవ్వ చెప్పిన వాన కథ
బొమ్మలాటోళ్ళ సెర్చి ఆరాధన
ఎంగిలోడు
పురుషోత్తం మావ బాప్తిసం
వోవదూత మొండిగుద్దల సావి
ప్రేమించి పిచ్చొడయిన రఘువ రెడ్డి కతయిన ' నక్కలోళ్ళ బిజిలీ' లాంటి కథలెన్నో మనకి తారస పడతాయి ఈ కతలలో...
చదవటానికి పూర్తిగా నెల్లూరు జిల్లా మండలికంలో ఉన్నా సులువుగానే అర్థం అవుతాయి..
దిగువ మధ్య తరగతి ప్రజల్లో సాధారణంగా జరిగే సంభాషణలను, సన్నివేశాలను సులువుగా వ్యక్తీకరంచాడు కవి ఈ పుస్తకంలో...
నిజంగానే మన కధలు అనేంతగా ఆకట్టుకుంటాయి
ఈ మునికాంత పల్లి కతలు....
-నందు.

#మునికాంతపల్లికతలు

#munikanthapallikathalu

#TeluguStories 

#Review


#bookreview 

#bookreviewblogger




0 comments: