తెలంగాణ కోసం ఉద్యమాలు ముగిశాక
ఇక మీదట తెలంగాణ బందులు ఉండవని
పిల్లలు మంచిగా చదువుకుని
ఉద్యోగ పరీక్షలకి సిద్దమవుతారని ఆశపడ్డం...
మన ప్రాంత ఉద్యోగులకి మంచి పదోన్నతులు వచ్చి
మరిన్ని ఉద్యోగాల కల్పన జరుగుతుందని నమ్మినం...
ఇప్పుడు గత అయిదేండ్లల్ల కనీసం యాభై వేల ఉద్యోగాలు ఇయ్యకపోయిరి,
ఉద్యోగులకి కనీసం ఉద్యోగ భద్రతనివ్వకపోయిరి
నిధులెన్ని పక్కదారులు పట్టయో తెలియదు...
కనీసం అపుడు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని అడిగే హక్కు అయినా ఉండేది,
ఇపుడు అడిగే వాడేమో తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించబడుతున్నడు..
ఉద్యమంలో ఏనాడు పాల్గొనని మేధావులు కూడా
బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటూ
బత్తాయిలను సంతృప్తి పరుస్తున్నారు....
ఉద్యమం చేసిన విద్యార్థులను పట్టించుకోకపోతిరి,
ఉద్యమం చేసిన ఉద్యోగులను పట్టించుకోకపోతిరి,
ఉద్యమం చేసిన ఎంతోమంది తెలంగాణ వాదులను పట్టించుకోకపోతిరి....
ఇంతమంది ఉసురు పోసుకుని
తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నొల్లు ఏం సాధించినట్లు ??
మీరు గద్దెనెక్కి తైతక్కలాడనికేనా ??
మీ గుమస్తాలకి, బానిసలకి బినామీ ఆస్తులు కూడబెట్టటానికా ??
మీరిట్లే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఇంకో ఉద్యమం తప్పదేమో ??
-న💚దు
13-10-19
0 comments:
Post a Comment