Tuesday, May 03, 2011 - 4 comments

తనోచ్చింది నా జీవితంలోకి






అందమైన చీకటిలో వెన్నెల లాగ 
నిశీధిలో ఉషోదయం లాగ 
నిర్మానుష్యంగా  గా ఉన్న 
నా మనసులోకి తనోచ్చింది
మరిపిస్తూ మురిపిస్తూ 
మైమరిపిస్తూ  ఏదో మాయ చేసింది.
ఎం జరుగుతుందో తెలియదు 
కాని తను కన్పించగానే 
ఒళ్ళంతా విద్యుత్ ప్రవహిస్తుంది
తనని  చూడగానే ఏదో ప్రకంపన, 
మనసు తన వైపే లాగుతుంది, 
అదేదో గురుత్వాకర్షణ శక్తి లాగ...!
చీకట్లోకి చందమామ వచినట్లు 
తనోచ్చింది నా జీవితంలోకి...
అదేంటో చందమామ రోజు వస్తూనే ఉంది 
కాని తనే చెదిరిపోనీ 
కలగా మిగిలి పోయింది..!!

                                -నందు.
Monday, May 02, 2011 - 7 comments

ఇదంతా ప్రేమేనా.... ?

                 

ఎందుకో తెలీదు  తనతోనే మాట్లాడాలనిపిస్తుంది 
తనతో మాట్లాడితే అసలు కాలమే తెలీదు 
అలా ఎంత సేపైనా మాట్లాడాలనిపిస్తుంది
తను ఎంత తిట్టినా కోపం రాకపోగా నవ్వొస్తుంది.. 
తన కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది...
తనుంటే చాలు ఇంకేం వద్దు అన్పిస్తుంది..
ఎక్కడున్నా తనే గుర్తొస్తుంది
చేసే ప్రతి పనిలో తనే కన్పిస్తుంది
కనులు మూసినా తనే కనులు తెరిచినా తనే...
నిరంతరం తన ధ్యాసలో గడుపుతుంటే ఎంతో హాయీగా ఉంది..
ఇదంతా ప్రేమేనా ?
అవునేమో నిజమేమోననిపిస్తుంది...
                              -నందు 

Tuesday, April 26, 2011 - 4 comments

నువ్వు లేకుండా....!


            
                          నువ్వంటే నాకెందుకిష్టమో తెలీదు,
                          నువ్వెందుకు నాకు ప్రత్యేకమో తెలీదు,
                          నీ  గురించి నేనెందుకు  జాగ్రత్త తీసుకుంటానో తెలీదు,
                          నిన్నెందుకు ప్రేమిస్తున్నానో తెలిదు,
                          కాని ఒక్కటి మాత్రం నిజం 
                          నువ్వు లేకుంటే నా జీవితం ఇలా ఉండేది 
                          కాదేమో..!
                                      -నందు 

Friday, April 22, 2011 - 6 comments

ఇంత వ్యత్యాసం ఎందుకో...!





ప్రతి మనిషి జీవితం లో మనల్ని ఇష్టపడే వారు, 
మనం ఇష్టపడే వారు ఉంటారు
మనం ప్రతి సారి మనం ఇష్ట పడే వారితోనే గడపాలి,
వారితోనే మాట్లాడాలి వారి తోనే కలకాలం కలిసుండాలి  అనుకుంటాం...
వారు తిట్టిన సరే వారిని మాత్రం వదిలి ఉండలేం ....
కుదిరితే వారితో, కుధరకపోతే వారి జ్ఞాపకాలతోనైనా  బ్రతికేస్తుంటాం...

కాని,

ఒక్క సారైనా మనల్ని ఇష్టపడే వారి గురించి ఆలోచిస్తామా ?
వారు మనల్ని కలవాలని మనతో మాట్లాడాలని ఎదురు చూస్తుంటారు,
 కాని మనం మాత్రం ఏమి తెలియనట్లు, మాట్లాడే తీరికలేనంత బిజీగా అయిపోతాము.
మనం నిజంగానే బిజీగా ఉంటామ లేక బిజీగా ఉన్నట్లు నటిస్తామా....
 అదికాక వారు మనల్ని విడిచి ఉండలేరన్న ధీమాతోనా  ?    
మనం ఇష్టపడే వారి గురించి ఆలోచించిన దానిలో ఒక బాగామైన మనల్ని ఇష్టపడే వారి గురించి ఆలోచిస్తామా....?
రెండు ఇష్టాలే  కాని ఇంత వ్యత్యాసం ఎందుకో...!

                                            -నందు.
Friday, April 08, 2011 - 2 comments

అలసి పోయా ప్రియా "నీకోసం" ....!


తనని నిజంగా మర్చిపోయాన, లేక మర్చిపోతున్ననా ,
 లేక మర్చిపోయినట్లు నటిస్తున్ననో తెలిదు 
 మనసుకి దేహానికి  శాశ్వత  సంబంధం తెగిపోయినట్లుంది...
నా ప్రమేయం లేకుండానే నా పాదాల  అడుగులు క్యాంటీన్  వైపు పరుగులు తీస్తున్నాయి 
ఆకలితో ఉన్న్న నా కడుపుని  నింపుకోవటానికి  కాదు
ఆద్రుతతో ఎదురు చూస్తున్న నా మనసు తన ముఖారవిందాన్ని  చూడాటానికి , 
నా కనులకు ఎంతకీ  బారం కాదేమో ,
 తను కనిపించదని తెలిసినా  కుడా క్యాంపస్,
కాలేజీ అంతా కలియచూస్తున్నాయి  ...
నా పాదాలకు  ఎంతకీ  అలసట రాదేమో, 
 తను కనిపించదని  తెలిసినా  కూడా తిరుగుతూనే ఉన్నాయి.. 
ఉన్నట్లుంది వెనకి తిరిగి చూస్తుంటాను తను కనిపిస్తుందేమోనని 
కాని అదేంటో తను తప్ప అందరు కనిపిస్తారు నాకు ... 
తన కోసం తిరిగి తిరిగి నా పాదాల నడక కూడా ఆగి పోతుంది... 
ఆగింది  నా పాదాల నడకో, నా ప్రాణమో తెలియదు...
కాని ఒక్కటి మాత్రం నిజం 
ఏనాటికైనా  తను   కనిపిస్తుందనే   చిన్ని ఆశే నన్ను ఇంకా  బ్రతికిస్తుంది.....


అలుసైపోయా,  ప్రియా "నీకోసం" అలసి పోయా ....!
                                  
                                                -నందు 





ఒక కల్పిత కవితకి అక్షర రూపం....