Monday, September 11, 2023 - 0 comments

లోగుట్టు పెరుమాళ్ళకెరుక ...!!!

 ॥ నందు॥ 19.04.2023॥ 

 మాటలతో మార్చే వాళ్ళు, 

మనుషుల్ని ఏమార్చే వాళ్ళు, 

రెచ్చగొట్టే వాళ్ళు, చిచ్చు పెట్టే వాళ్ళు, 

 ఒకరి మీద పడి ఏడిచే 

 వాళ్ళున్న సమాజంలో ఉన్నాం మనం 

మనకంటూ ఒక స్టాండ్ ఉండాలి 

 ఏది నిజమో, ఎది అబద్దమో, 

అసలు నిజమేదో తెలుసుకోగలగాలి 

ఎవరూ ఎలాంటి వాళ్ళు, 

ఎవరూ ఎలా ఉంటారు 

అనే బేరీజు వేసుకొగలగాలి 

 ఇవాళ నిన్ను రెచ్చగొట్టే వాడు 

 నీ అవసరం తీరాక, 

 లేక నీతో పొసగక 

రేపు నీమీదికే ఇంకొకరిని 

 రెచ్చగొట్టడన్న నమ్మకం లేదు 

నీతో ఇన్నాళ్లు ప్రేమగా మాట్లాడేవాడు, 

 నీ ఏడుపును కోరుకోడు 

 అన్న నమ్మకం లేదు 

 జరుగున్న మార్పులను 

 గమనిస్తూనే ఉండాలి 

ఎదుటి వారి మీద మనకంటూ 

ఒక నిర్దిష్ట అభిప్రాయం 

ఏర్పరచుకోవాలి 

 రెచ్చగొట్టగానే రెచ్చిపోవద్దు 

కన్నీరు కార్చగానే కరిగిపోవద్దు 

ఏ మాట వెనకాల 

 ఏ అవసరం ఉందో 

ఏ పలకరింపు మాటున 

 ఏ పెను విషాదం దాగుందో 


 లోగుట్టు పెరుమాళ్ళకెరుక !!

-నందు

Thursday, July 27, 2023 - 0 comments

ఇరుకిల్లు

ఇంట్లో అర్థం చేసుకునే మనుషులు,
సర్దుకుపోయే గుణాలుంటే
ఇరవై మందితో కలిసున్నా బాగానే ఉంటుంది,
ఇరుకిల్లు కూడా ఇంద్రభవనంలాగే ఉంటుంది.

కానీ ఇరుకు మనుషులుంటే
ఇద్దరున్న ఇంద్రభవనం కూడా
దాని తేజస్సుని కోల్పోతుంది.
నీకెన్ని ఆస్తులున్నా,
అంతస్తులున్నా 
అనాధగానే బ్రతకాల్సి వస్తుంది 
-నందు

నేటి బంధాలు


 

విలువలు - ఉలవలు


మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి
ఇబ్బందుల్లో ఉన్నప్పుడు  విలువలు,
 ఉల్వలు  అంటూ మాట్లాడకూడదు
మనిషికి ఇచ్చే విలువ 
ఎప్పుడు ఒకేలా ఉండాలి
స్థాయిని బట్టి,
 డబ్బుని బట్టి మారకూడదు
-💚దు

మనం అనర్హులం

మనం పుట్టినప్పటి నుండి 
తను చనిపోయే వరకు 
మన గురించే ఆలోచించే 
మన అమ్మ గురించి 
ఎన్నడూ సరిగ్గా పట్టించుకోని మనం, 
మాతృదినోత్సవం జరుపుకోవటానికే కాదు 

మాట్లాడుకోవటానికిి కూడా అనర్హులం..!!!
-నందు
#HappyMothersDay
#MothersDay
#TheOtherSide

ఉండి లేనట్లు


జీవితంలో అందరు ఉన్నప్పుడు, 
అన్ని ఉన్నపుడు బాగానే ఉంటుంది 
ఎవ్వరు లేనప్పుడు ,
ఏమి లేనప్పుడు కూడా బాగానే ఉంటుంది 
కానీ ఎప్పుడైతే 
అందరు ఉండి ఉండనట్లు, 
అన్నిఉండి, లేనట్లు ఉంటుందో 
దాన్ని మించిన నరకం ఇంకోటి ఉండదు...!! 
-నందు.  
08-03-2020  

శెలవు మిత్రమా !

నిజమే ! 
తెలిసే బంధమనే ఆ చట్రంలో ఇరుక్కున్నావు, 
ఇప్పుడు అనుభవిస్తున్నావు, 
తప్పదు బయటికి రావాలి 
కాదు కాదు దూరంగా రావాలి
ఎదుటివాళ్ళు  
నువ్వు, నీ అస్థిత్వంలేని 
ప్రశాంత వాతావరణాన్ని 
కోరుకుంటున్నపుడు 
నువ్వు మౌనంగా వెళ్లిపోవటమే ఉత్తమం. 
అక్కడా తప్పు నీదా,
వేరే వాళ్ళదా లేక 
ఎవరి వల్ల  తప్పు జరుగుతుందనే 
విషయాలిప్పుడు అనవసరం... 
నువ్వే ఒక సమస్య అయినపుడు 
సమాధానం కూడా నువ్వే చెప్పాలి 
ఆ సమ్యసనీ తీర్చనప్పుడు 
కనీసం అసమస్యకీ 
దూరంగా అయినా ఉండాలి  
ఇంకెన్నాళ్లు ఇలానే ?
కొత్తగా ఏమి నేర్చుకుంటున్నట్లు ?
ప్రతి సారి ఇదే తప్పు, ఇదే గుణపాఠం !!
తప్పు చేయటం అలవాటయ్యిందా లేక ?
 గుణపాఠాన్ని నీ జీవితం అలవాటు పడిందా ??
నువ్వు చెయ్యాలనుకున్నదొకటి, 
అక్కడ జరిగేదింకొటి,
పరిస్థితులు పగబట్టినట్లు ప్రవర్తిస్తే 
నువ్వెప్పటికీ నిన్ను నిరూపించుకోలేవు 
నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన 
అవసరమే లేదక్కడ 
అర్థంచేసుకునే పరిస్థితులు లేనప్పుడు,
రావని తెలిసినప్పుడు  
అక్కడ ఉండటమే అనవసరం...!! 
నీ కోపాన్ని ఆవేశాన్ని,అన్నింటిని 
మౌనంగా మడిచి 
జేబులో పెట్టుకుని వెళ్ళిపో  
చాలిక వెళ్ళు  !! 
శెలవు మిత్రమా !
-నందు. 
08-03-2020  
Wednesday, June 16, 2021 - , , , , 0 comments

విలువ

10-02-2020  
వస్తువు విలువ పోతేనో, 
పాడైపోతేనో తెలుస్తుంది 
మనిషి విలువ కూడా
దూరమైపోతేనో 
చనిపోతేనో తెలుస్తుంది 
-నందు. 
Friday, March 26, 2021 - 0 comments

ప్రేమ - ప్రేమ

గుండె పగిలిన క్షణాలను, 
గుక్క పెట్టి ఏడ్చే ఎన్నో క్షణాలను, 
ఒక్కోసారి పంటికింద బిగిపట్టి 
మూలకి కూర్చోబెట్టేదే  'ప్రేమ' 
-నందు
Saturday, March 13, 2021 - 0 comments

బంగారు తెలంగాణ !!

తెలంగాణ కోసం ఉద్యమాలు ముగిశాక 
ఇక మీదట తెలంగాణ బందులు ఉండవని 
పిల్లలు మంచిగా చదువుకుని 
ఉద్యోగ పరీక్షలకి సిద్దమవుతారని ఆశపడ్డం...
మన ప్రాంత ఉద్యోగులకి మంచి పదోన్నతులు వచ్చి 
మరిన్ని ఉద్యోగాల కల్పన జరుగుతుందని నమ్మినం...

ఇప్పుడు గత అయిదేండ్లల్ల కనీసం యాభై వేల ఉద్యోగాలు ఇయ్యకపోయిరి,
ఉద్యోగులకి కనీసం ఉద్యోగ భద్రతనివ్వకపోయిరి
నిధులెన్ని పక్కదారులు పట్టయో తెలియదు...
కనీసం అపుడు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని అడిగే హక్కు అయినా ఉండేది
ఇపుడు అడిగే వాడేమో తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించబడుతున్నడు..
ఉద్యమంలో ఏనాడు పాల్గొనని మేధావులు కూడా 
బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటూ 
బత్తాయిలను సంతృప్తి పరుస్తున్నారు....

ఉద్యమం చేసిన విద్యార్థులను పట్టించుకోకపోతిరి,
ఉద్యమం చేసిన ఉద్యోగులను పట్టించుకోకపోతిరి,
ఉద్యమం చేసిన ఎంతోమంది తెలంగాణ వాదులను పట్టించుకోకపోతిరి....
ఇంతమంది ఉసురు పోసుకుని 
తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నొల్లు ఏం సాధించినట్లు ??
మీరు గద్దెనెక్కి తైతక్కలాడనికేనా ??
మీ గుమస్తాలకి, బానిసలకి బినామీ ఆస్తులు కూడబెట్టటానికా ??
మీరిట్లే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఇంకో ఉద్యమం తప్పదేమో ??

-💚దు
13-10-19