ఒక పదహారణాల పడుచు ఫీలింగ్స్.....
వస్తాడు నా రాజు అంటూ
నా పదహారేళ్ళ ప్రాయం నుండి
నా మది నీ తలపులు తడుతూనే ఉంది....
నా ఎదుట నీవే నా ఎద సవ్వడిలో నీవే...
పొడిచే పొద్దులో నా వెంటే నడిచే నీడలో....
పంట చేలల్లో పచ్చిక బయళ్ళలో..
ఎటుచూసినా అటునీవే కనిపిస్తుంటే ఏవైపు చూడను...?
నా మది దోచిన ఓ చోరుడా...
నా కళల సామ్రాజ్యపు ఓ రాకుమారుడా...
ఎన్నో ఆశలతో నీతో కొత్త జీవితంలోకి
అడుగేద్దామనుకుంటున్న ఈ చిన్న దాని
ఆశల పల్లకిని మోస్తావో
లేక అమాంతంగా ముంచేస్తావో
ఆశల పల్లకిని మోస్తావో
లేక అమాంతంగా ముంచేస్తావో
నీకే తెలియాలి సుమ..
మరి ఏది నీ జాడ
కనిపించదు కనీసం నీ నీడ...
క్షణానికోసారి గుర్తొస్తావు
మరుక్షణం కనుమరుగావుతున్నావు...
నీవు అందగాడివే కానక్కర్లేదు
నన్ను అర్థం చేసుకుంటే చాలు...
నీవు కోటిశ్వరుడివే కానక్కర్లేదు
నీ కనుసైగల్లో దాచుకుంటే చాలు.....
నీ మనసులో కాసింత చోటివ్వు,
నీ గుండెల్లో గుడి కట్టుకుంటాను కలకాలం...
-నీ వెన్నెల్లో ఆడపిల్ల...
-నందు.