Showing posts with label ప్రేమ. Show all posts
Showing posts with label ప్రేమ. Show all posts

బాధ కూడా బాగానే ఉంటుంది



మనం ప్రేమించిన వ్యక్తి మనకి దూరం అయినపుడో/ మోసం చేసినపుడో భరించలేనంత బాధ.
పరీక్షల్లో పాస్ అవ్వలేదనో, ఫస్టు ర్యాంకు రాలేదనో బాధ.
వెళ్లిన ప్రతిసారి ఉద్యోగం దక్కకపోతే,
చచ్చిపోవాలి అనిపించేంత బాధ.
నమ్మిన వాళ్లు మోసం చేసినపుడు,
అయినవాళ్ళందరూ దూరమైనపుడు,
బ్రతకకూడదు అనిపించేంత బాధ.
ఎంతో ప్రేమతో పెంచుకున్న మొక్కో, కుక్కో,
ఇష్టపడి కొనుక్కున్న వస్తువు పోతేనో, పాడైపోతేనో బాధ.
అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో బాధ...
నిజమే
ప్రతి మనిషి జీవితంలో బాధలుంటాయి
చాలా మందిమి బాధ దగ్గరే ఆగిపోతున్నాం.
అందుకే వ్యక్తి మీద కక్ష కట్టెస్తున్నాం,
జీవితం మీద విరక్తి చెందుతున్నాం, 
అందుకే చిన్న చిన్న వాటికి
అసలీ బ్రతుకే వద్దనుకుంటున్నాం..

కాని ఎర్రటి ఎండాకాలం తర్వాత వర్షాకాలం వచ్చి మనుషుల్ని(మనసుల్ని) స్పృశింప చేసినట్లు
శిశిర ఋతువు వచ్చి చెట్ల ఆకుల్ని రాల్చితే,
ఆ వెంటనే వచ్చే వసంత ఋతువు అవే చెట్లను మళ్ళి చిగురింపజేసినట్లు...

మనిషి జీవితంలో కూడా బాధ తర్వాత ఆనందం ఉంటుంది.
కాని ఆ ఆనందాన్ని పొందటానికి బాధల్ని అధిగమించలేకపోతున్నాం.
మనలో ఆ బాధని అధిగమించే శక్తి ఉంటే
అవును నిజంగా బాధ కూడా హాయిగానే ఉంటుంది

-నందు
© #anandgoudpedduri

మౌన పోరాటం

ఎప్పుడు కనిపిస్తావోనని నేను,
ఎక్కడా కనిపించకూడదని నువ్వు...!
ఒక్కసారైనా మాట్లాడతావని నేను,
ఒక్క మాట కూడా మాట్లాడకూడదని నువ్వు...!!
ప్రియా ఎన్నాళ్లీ  పోరాటం ??
-నందు  



పిచ్చి మనసు

తనతో బయటికి వెళ్ళినప్పుడు 
ఎవ్వరూ గుర్తు పట్టకుండా స్కార్ఫ్ కట్టే దాన్ని,

కానీ ఇపుడు తను ఎక్కడ నన్ను గుర్తు పడతాడేమో అని 
మళ్ళీ స్కార్ఫ్ కట్టుకు తిరుగుతున్నా...

అయిన, నా పిచ్చి గానీ 

తను మొదట్లో నన్ను ఇష్టపడిందే నా కళ్ళని చూసి, 

మొహానికి ముసుగేసినంత మాత్రాన 
నా కళ్ళని గుర్తు పట్టలేడా ???
చెబితే  విననంటోంది  ఈ పిచ్చి మనసు
  
                               -నందు

 

నిన్ను మాత్రమే ప్రేమించాలనిపిస్తోంది

నువ్వెలా ఉంటావో తెలియదు,
కాని చూడాలనిపిస్తోంది.
నువ్వెక్కడుంటావో తెలీదు,
కాని నిన్ను కలవాలనిపిస్తోంది.
నీ స్వరమెలా ఉంటుందో తెలియదు,
కాని నువ్ మాట్లాడితే వినాలనిపిస్తుంది. 
ఎం చేస్తుంటావో తెలియదు,
కానీ నీ కోసం ఏమైనా చేయాలనిపిస్తోంది. 
నీ మనసులో నేనుంటానో  లేదో తెలియదు
కాని నిన్ను మాత్రమే ప్రేమించాలనిపిస్తోంది...
                                             -నందు 

ప్రేమ



ప్రేమ:
ప్రే అంటే ప్రేమించటం,
మ అంటే మర్చిపోవటం కాదు...  

ప్రేమ అంటే ప్రేమించటం
మ అంటే మర్చిపోలేనంతగా ప్రేమించటం..!!
ప్రేమ అంటే ప్రేమించటం
మ అంటే మనం ఇంకొకరిని ప్రేమించలేనంతగా ప్రేమించటం..!!!
-నందు

గుర్తుకురావటం-మర్చిపోకపోవటం

గుర్తుకురావటం వేరు,
మర్చిపోకపోవటం వేరు..
రెండింటికి చాల తేడా ఉంది,
చదవటంలో కాదు ఆలోచించటంలో...
-నందు

ప్రేమించటం అంటే

ప్రేమించటం అంటే నిన్నే కాదు,
 నీ జ్ఞాపకాల్ని  కూడా...!
జీవించటం అంటే నీతోనే కాదు 
నీ జ్ఞాపకాలతో(జ్ఞాపకాల్లో) కూడా...!!
-నందు 

ప్రేమ-యుద్ధం

యుద్ధం, ప్రేమ రెండు ఒక్కటే...
యుద్ధంలో గెలిస్తే కీర్తి, గౌరవం పెరుగుతాయి
ప్రేమలో గెలిస్తే ఆనందం, సంతోషం పెరుగుతాయి
యుద్ధంలో ఓడితే రాజ్యం, పరువు పోతాయ్,
కష్టాలు పలకరిస్తాయ్, కటకటాలు వెక్కిరిస్తాయ్...
ప్రేమలో ఓడితే కన్నీళ్ళు మిగులుతాయ్.
కాని ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయ్...
యుద్ధం మనుషులతో చేసేది
ప్రేమ మనసుతో  చేసేది
నిజమే కాబోలు,
యుద్ధం, ప్రేమ రెండు ఒక్కటేనేమో...
రెండు గెలిచే వరకు చేసేవే...!
గెలవటం కొరకు పోరాడేవే...!!

                  -నందు
            02-09-15



నువ్ ఊహించుకున్న అబద్దమా ??

నువ్వు, నేను అనుభవిస్తున్న నిజం..!!!
మరి నేను ???
నువ్ ఊహించుకున్న అబద్దమా  ??
               -నందు 


నా కళ్ళతో చూడు.... !!

పొగడ్తలు నీకు కొత్త కాకపోవచ్చు
కాని పొగడటం నాకు మాత్రం కొత్తే...
నా పాతికేళ్ళ వయసులో నేను చూసిన అద్భుతం నీవు
ఇంతందంగాఉన్నావేం చెలి, 
ఇన్నాళ్ళు కనిపించలేదేం మరీ..!!!
నీ అందం అజంతా శిల్పం, 
నీ రూపం ఎల్లరాల సమూహం..
నిన్ను సృష్టించిన బ్రహ్మ దేవుడు కూడా 
అసూయ పడతాడేమో నీ అందాన్ని చూసి
రతీదేవి కూడా ఈర్ష్య పడుతుందేమో, 
మన్మదుడ్ని నీ వైపుకి తిప్పుకున్నందుకు 
నీకు నీవు అందంగా కనపడకపోవచ్చు, 
నా పొగడ్త నీకు అతిగా అనిపించవచ్చు,
నా కళ్ళతో చూడు.... 
అప్పుడైనా నీకు మితంగా కనిపిస్తాయేమో...
-నందు



నీతో మాట్లాడిన తొలి క్షణం

తొలిసారి నీతో మాట్లాడిన క్షణం నాకింకా గుర్తుంది
ఎదుటి వారితో మాట్లాడుతుంటే ఎన్నడు లేని తడబాటు నీతో మాట్లాడుతుంటే కలిగింది,
నా గుండె చప్పుడు నాకే వినిపించిది
ఒక్క సారిగా స్పృహ కోల్పోయినట్లనిపించింది...
ఆక్షణం నేనేం మాట్లాడానో తెలియదు,కాని నీతో మాట్లాడినట్లు మాత్రం గుర్తుంది
గుర్తుండటమేంటి, అది మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది...
-నందు

మళ్ళి మళ్ళి నిన్నే చూడాలనిపిస్తుంది

నిన్ను మొదటిసారి ఎప్పుడో చూసానో తెలియదు కాని 
చూసినప్పటి నుండి మళ్ళి మళ్ళి నిన్నే చూడాలనిపిస్తుంది 
ఒక్కసారైనా  నీతో మాట్లాడాలనిపిస్తుంది
నువ్వు నా సమీపాన చెరితే 
మనసు కంపిస్తుంది
గుండె తీవ్రత పెరుగుతుంది...  
నీ కళ్ళలో ఏ శక్తి దాచుకున్నావో గాని 
నన్ను మాత్రం శక్తిహీనుడ్నిచేస్తున్నాయి
ఇన్నేళ్ళుగా ఎలాంటి అలజడి లేని నాలో  
కొన్నాళ్లుగా నాలో నేనే లేని పరిస్థితి

నీ కోసం వెతుకుతున్నాయి నా కళ్ళు 
ఒక్క సారి కరుణించి వెళ్ళు
నీవెక్కడుంటావో తెలిసి కూడా 
ఏమి చేయలేని నిస్సహాయ స్థితి నాది 
ఒక్క సారి పలకరించి వెళ్ళు 
మళ్ళి  నాకు పునర్జన్మని ప్రసాదించి వెళ్ళు  

ప్రేమంటే ఏంటో తెలియని నాలో రేపావు అలజడి, 
మరి వినిపించట్లేదా ఈ గుండె సడి 
            -నందు 

ప్రేమ-నటన

మిత్రమా,
నువ్ నిజంగా ప్రేమిస్తున్నావో లేక 
ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నావో 
నీకు నువ్వుగా తెలుసుకో...
ఎందుకంటే, 
ప్రేమిస్తున్నపుడు టైంపాస్ చేసినా టైంవెస్ట్ చేసినా 
బాగానే అనిపిస్తాయి... 
కాని నటిస్తున్నప్పుడే నరకంగా ఉంటుంది...!
కరక్టే, ప్రేమ పుట్టుక నీకు తెలియకపోవచ్చు
కాని పుట్టిన తర్వాతైనా తెలుస్తుందిగా ???
అందుకే నీకు నువ్వుగా మేల్కొను,
నటనని కట్టి పెట్టి నిజంలో బ్రతకటం మొదలెట్టు..!!! 
(నిజ జీవితంకి అడుగెట్టు)

                           -నందు

#నందు

చరిత్రలో ప్రేమకథలు



చరిత్రలో కొన్ని ప్రేమకథలు వినటానికి బావుంటాయ్,
సినిమాల్లో కొన్ని ప్రేమ కథలు చూడటానికి బావుంటాయ్,
కథల్లో కొన్ని ప్రేమకథలు రాయటానికి బావుంటాయ్,
పుస్తకాల్లో కొన్ని ప్రేమ కథలు చదవటానికి బావుంటాయ్,
కాని నిజ జీవితంలో చాలా  ప్రేమకథలు వినకపోతేనే బావుంటాయ్, 
వాటి గురించి మాట్లాడుకోకపోతేనే మరింత బావుంటాయ్..
                                    -నందు







పదాలు ప్రేమగా-మాటలు మత్తుగా


Anandgoudpedduri



పదాలు ప్రేమగా ఉంటాయ్, 
మాటలు మత్తుగా ఉంటాయ్ 
ఇష్టమైన 'వారు' మాట్లాడుతుంటే...
పదాలు ప్రేమగా ఉంటాయ్, 
మాటలు మధురంగా ఉంటాయ్ 
ఇష్టమైన 'వారితో' మాట్లాడుతుంటే...
-నందు




నువ్ ఒంటరిగా ఉన్నప్పుడు

నువ్ ఒంటరిగా ఉన్నప్పుడు,
నీకేం తోచనపుడు,
నీకిష్టమైన వారితో మాట్లాడాలనిపించినపుడు,
ఆ మాట్లాడాల్సిన్న వ్యక్తి నీతో 
నీతో మాట్లాడే పరిస్థితిలో లేనప్పుడు, 
మాట్లాడాల్సిన వాటిని ఎక్కడైనా రాసి పెట్టు...
తర్వాత వాటిని చదివినపుడు 
అక్షరాలు అందంగా కనిపిస్తాయ్
పదాలు కూడా ప్రేమగా పలకరిస్తాయ్,
మాటలు ముత్యాల్లా మారతాయ్...
-నందు




సుఖం -సంతోషం

మనిషికి తను సుఖపడ్డ క్షణాలు కొన్ని రోజులే గుర్తుంటాయి 
కాని  సంతోషపడ్డ  క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి
                   -నందు
                                  

సమాధానం లేని ప్రశ్న

అన్ని ప్రశ్నలకి మనమే సమాధానం చెప్పలేం, తెలుసుకోలేం..  
కొన్నింటికి కాలం, మరికొన్నింటికి మౌనం,
మాటలతో చెప్పలేని వాటికి మనసు   
ఇంకోన్నింటికి నీ జీవితం... 
ఇలా ఏదో ఒక విధంగా సమాధానం దొరుకుతూనే ఉంటుంది..  
అసలు సమాధానం లేని ప్రశ్నే లేదు ఈ  విశ్వంలో...!!! 
సమాధానం దొరకలేదంటే, 
నీకు సమయం సరిపోకపోయి ఉండాలి లేదా 
దాని మీద నీకు ఆసక్తి లేకుండా ఉండి ఉండాలి 
ఈ రెండు కాదంటే అదసలు ప్రశ్నే కాకపోయి ఉండాలి 
                                   -నందు 


Sunday, April 19, 2015 - , , , , 0 comments

ఓకే బంగారం

ఓకే బంగారం:

వయసుతో పనిలేకుండా 

ప్రేమలో ఉన్న వాళ్ళు, 
ప్రేమలో పడ్డవాళ్ళు, 
ప్రేమలో గెలిచిన వాళ్ళు,.
తప్పకుండా చూడాల్సిన సినిమా...!!!
లివింగ్ రిలేషన్షిప్ పై నేటి యువత తీరుని ప్రధానంగా తీసుకుని,
ప్రేమకి,వ్యామోహానికి మధ్యలో ఒకచిన్న నిజాయితిని సృష్టించి....
ఫారెన్ లోకేషన్లు, పెద్ద పెద్ద ఫైట్లు లేకుండా తీసిన ఒక ఒక రిచ్ సినిమా...
సినిమా పై మనసుపెట్టి చూడండి
మణిరత్నం కనిపిస్తాడు, 
ఏఆర్ రహమాన్ కురిపిస్తాడు(సంగీతం), 
పిసి శ్రీరాం మెరిపిస్తాడు(ఛాయాగ్రహణం)..
ఒకే ఫ్రేములో రెండు ప్రేమ కథలను నడిపించటం...
నిత్య ఇంకా అందంగా కనబడింది, ఇంకొన్నాళ్ళు యువ ప్రేమికుల గుండెల్లో 
నిండి ఉంటుందనడంలో సందేహం లేదు..
మంచి ఫీల్ ఉన్న సినిమా,
మంచి ఫీల్ ని కలిగించే సినిమా ...!!! 
కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తాయ్, 
ఇంకొన్ని జ్ఞాపకాలు వెంటాడతాయ్, 
కాని మళ్ళి ఇంకొన్ని జ్ఞాపకాలు మిగిలిపోతాయ్. 

చరిత్రలో ప్రేమ కథలెప్పుడు హిట్టే, 

కాని చూపే విధానంలో, తీసే విధానంలో 
చాలా మంది ఫెయిల్ అవ్తున్నారు...
ఈ సినిమా "ఓకే" కాదు చాలా చాలా "ఓకే"

p.s:రెగ్యులర్ రొటీన్, మాస్ సినిమాలు చూసే వారికిది నచ్చదు..

థియేటర్ కి వెళ్లి టైం వెస్ట్ చేసుకోకండి..         
ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం  
        
                     -నందు

చాన్నాళ్ళ తర్వాత



చాన్నాళ్ళ తర్వాత::
ఆమె: ఎలా ఉన్నావ్ ??
అతడు:ఇంకా బ్రతికే ఉన్నా
ఆమె:నువ్వింకా గుర్తొస్తావ్ నాకు
అతడు: నేనింకా మర్చిపోలేదు నిన్ను
ఆమె:ఎందుకలా మాట్లాడుతున్నావ్ ?
అతడు: మరెలా మాట్లాడమంటావ్
ఆమె: నేనప్పుడు కావాలని వెళ్ళిపోలేదు
అతడు: కాని నేను కావాలనుకున్నపుడు వెళ్ళిపోయావు కదా
ఆమె: ఇప్పుడు నన్నేం చేయమంటావ్
అతడు:అది నన్నెందుకు అడుగుతున్నావ్  ?
అయినా ఆరోజు నన్నడిగే వెళ్ళిపోయావా
ఆమె: అప్పుడు నా జీవితం నా చేతిలో లేదు
అతడు:ఇప్పుడు మాత్రం నీ చేతిలో ఉందా ??
ఆమె:ఛ,నువ్వెప్పుడు ఇంతే ఎప్పటికి అర్థం చేసుకోవు
అతడు:అవును నేనప్పటికి అర్థం కాను నీకు.
ఆమె: ఇంకోసారి మాట్లాడను
అతడు: నేనుకూడా ఇంకోసారి కనపడను...
                                           -నందు                              

Inspired by one of my Facebook friends

                                                         (ఇంకా ఉంది)