బాధ కూడా బాగానే ఉంటుంది



మనం ప్రేమించిన వ్యక్తి మనకి దూరం అయినపుడో/ మోసం చేసినపుడో భరించలేనంత బాధ.
పరీక్షల్లో పాస్ అవ్వలేదనో, ఫస్టు ర్యాంకు రాలేదనో బాధ.
వెళ్లిన ప్రతిసారి ఉద్యోగం దక్కకపోతే,
చచ్చిపోవాలి అనిపించేంత బాధ.
నమ్మిన వాళ్లు మోసం చేసినపుడు,
అయినవాళ్ళందరూ దూరమైనపుడు,
బ్రతకకూడదు అనిపించేంత బాధ.
ఎంతో ప్రేమతో పెంచుకున్న మొక్కో, కుక్కో,
ఇష్టపడి కొనుక్కున్న వస్తువు పోతేనో, పాడైపోతేనో బాధ.
అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో బాధ...
నిజమే
ప్రతి మనిషి జీవితంలో బాధలుంటాయి
చాలా మందిమి బాధ దగ్గరే ఆగిపోతున్నాం.
అందుకే వ్యక్తి మీద కక్ష కట్టెస్తున్నాం,
జీవితం మీద విరక్తి చెందుతున్నాం, 
అందుకే చిన్న చిన్న వాటికి
అసలీ బ్రతుకే వద్దనుకుంటున్నాం..

కాని ఎర్రటి ఎండాకాలం తర్వాత వర్షాకాలం వచ్చి మనుషుల్ని(మనసుల్ని) స్పృశింప చేసినట్లు
శిశిర ఋతువు వచ్చి చెట్ల ఆకుల్ని రాల్చితే,
ఆ వెంటనే వచ్చే వసంత ఋతువు అవే చెట్లను మళ్ళి చిగురింపజేసినట్లు...

మనిషి జీవితంలో కూడా బాధ తర్వాత ఆనందం ఉంటుంది.
కాని ఆ ఆనందాన్ని పొందటానికి బాధల్ని అధిగమించలేకపోతున్నాం.
మనలో ఆ బాధని అధిగమించే శక్తి ఉంటే
అవును నిజంగా బాధ కూడా హాయిగానే ఉంటుంది

-నందు
© #anandgoudpedduri

1 comments:

GARAM CHAI March 10, 2017 at 11:42 AM

what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
my youtube channel garam chai:www.youtube.com/garamchai