Showing posts with label తెలుగు కవితలు. Show all posts
Showing posts with label తెలుగు కవితలు. Show all posts

ప్రేమకి మరోవైపు...!!




ప్రేమలో పడిన కొత్తలో ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తి గురించి 
 నువ్వు ఎంత ఆరాట పడుతావో,
నీకు దూరంగా ఉన్న నీ తల్లిదండ్రులు కూడా 
అంతే ఆరాటపడతారు....
ఆ వ్యక్తి మీద మొదట్లో ఉన్నంత  ఆరాటం 
ఇప్పుడు నీకుండకపోవచ్చు
కానీ నీ తల్లిదండ్రుల ఆరాటం 
బ్రతికి ఉన్నంత కాలం ఉంటుంది....
అదే ప్రేమంటే....!!
-నందు

తన ధ్యాసలో పడటం కూడా ప్రేమే



                              ప్రేమంటే గంటలు గంటలు
ఫోన్లో మాట్లాడుకోవటాలు,
కాఫీ షాపుల్లో కాలక్షేపాలు
చేయటమే కాదు
నీ ధ్యాస మరచి
తన ధ్యాసలో పడటం కూడా ప్రేమే..!!
-నందు




గతమెప్పుడు గమ్మత్తుగా



గతమెప్పుడు గమ్మత్తుగా ఉంటుంది 
నువ్ ప్రస్తుతాన్ని ఆస్వాదిస్తే....
అదే గతం ఇంకా బాధని కలిగిస్తుంది 
నువ్వింకా దాని గురించే ఆలోచిస్తుంటే...
-నందు.


యుద్ధం -ఆట


ఆటలో గాని 
యుద్దంలో గాని 
నువ్వు ఓడిపోయావంటే 
నువ్వు బలహీనుడవని కాదు
ఎదుటివాడు నీకంటే బలవంతుడని అర్థం
-నందు

తపస్సు చేసినా జరగదు

జీవితంలో నీకేదైనా జరగాలని 
బలంగా రాసిపెట్టి ఉంటె తప్పైనా ఒప్పైనా 
అది తప్పకా జరుగుతుంది..!

జరిగేది జరగక మానదు
తప్పకా జరిగేదైనప్పుడు
దాని నుండి తప్పించుకోలేవు
ఒకవేళ జరగకూడనిదైతే 
తలక్రిందుల తపస్సు చేసినా ఎన్నటికి జరగదు..!!

-నందు


మనిషెప్పుడూ ఆకాశంలాగా ఉండాలి

ఆకాశం అన్నాక కొన్నిసార్లు 

ఇంద్రదనస్సు,వెన్నెల, 


కారుమబ్బులు,ఉరుములు, మెరుపులు, 


మేఘాలు,వర్షాలు కనిపిస్తుంటాయ్...


ఇవి ఉన్నా లేకపోయినా 


ఆకాశం మాత్రం అలానే ఉంటుంది...

మనిషి జీవితం కూడా అంతే...


ఇంద్రదనస్సు లాంటి సంతోషం, 


ఉరుముల్లాంటి కోపాలు,

కారు మబ్బులాంటి బాధలు,


వర్షాల్లాంటి కన్నీళ్ళు ఉంటాయ్...


ఇవి 
ఉన్నా లేకపోయినా 

జీవితం మాత్రం సాగుతూనే ఉంటుంది...

అందుకే మనిషి వచ్చిపోయే కాలంలాగా 

కాకుండా కలకాలం ఉండే ఆకాశంలా ఉండాలి


                                                  -నందు 


మౌన పోరాటం

ఎప్పుడు కనిపిస్తావోనని నేను,
ఎక్కడా కనిపించకూడదని నువ్వు...!
ఒక్కసారైనా మాట్లాడతావని నేను,
ఒక్క మాట కూడా మాట్లాడకూడదని నువ్వు...!!
ప్రియా ఎన్నాళ్లీ  పోరాటం ??
-నందు  



పిచ్చి మనసు

తనతో బయటికి వెళ్ళినప్పుడు 
ఎవ్వరూ గుర్తు పట్టకుండా స్కార్ఫ్ కట్టే దాన్ని,

కానీ ఇపుడు తను ఎక్కడ నన్ను గుర్తు పడతాడేమో అని 
మళ్ళీ స్కార్ఫ్ కట్టుకు తిరుగుతున్నా...

అయిన, నా పిచ్చి గానీ 

తను మొదట్లో నన్ను ఇష్టపడిందే నా కళ్ళని చూసి, 

మొహానికి ముసుగేసినంత మాత్రాన 
నా కళ్ళని గుర్తు పట్టలేడా ???
చెబితే  విననంటోంది  ఈ పిచ్చి మనసు
  
                               -నందు

 

నిన్ను మాత్రమే ప్రేమించాలనిపిస్తోంది

నువ్వెలా ఉంటావో తెలియదు,
కాని చూడాలనిపిస్తోంది.
నువ్వెక్కడుంటావో తెలీదు,
కాని నిన్ను కలవాలనిపిస్తోంది.
నీ స్వరమెలా ఉంటుందో తెలియదు,
కాని నువ్ మాట్లాడితే వినాలనిపిస్తుంది. 
ఎం చేస్తుంటావో తెలియదు,
కానీ నీ కోసం ఏమైనా చేయాలనిపిస్తోంది. 
నీ మనసులో నేనుంటానో  లేదో తెలియదు
కాని నిన్ను మాత్రమే ప్రేమించాలనిపిస్తోంది...
                                             -నందు 

కొన్ని అంతే...!!!

అవసరంతో చేసే స్నేహాలు
వ్యామోహంలో పడే ప్రేమలు
ఆవేశంలో ఇచ్చే వాగ్దానాలు
కోపంలో తీసుకునే నిర్ణయాలు
ఎక్కువ రోజులు నిలబడవు...
-నందు


సుఖసంతోషాలు


పుట్టినప్పటి నుండే సుఖాలకి అలవాటు పడిన 
ఈ జనరేషన్ పిల్లలకి ఎలా సుఖపడాలో తెలుసు, 
కానీ సంతోషం అంటే ఏమిటో ఇప్పటికీ 
చాలా వరకి చాలా మందికి అర్థం కాదు... 
కానీ దురదృష్టం ఏంటంటే 
తల్లిదండ్రులు కూడా ఈ సంబంధం 
చేసుకుంటే అమ్మాయి/అబ్బాయి 
జీవితంలో సుఖపడతారని ఆలోచిస్తున్నారే తప్ప 
జీవితాంతం సంతోషంగా ఉండగలరా అని 
ఒక్కసారి కూడా ఆలోచించటం లేదు..
సుఖానికి సంతోషానికి చాలా తేడా ఉందిరాబ్బయ్...

-నందు
03/03/2016

కాదేది కవితకు అన్హరం..!!


బండికి గీతలు,

మొహానికి ముడతలు...!!

సముద్రంలో నీళ్ళు,

మనిషి కంట్లో కన్నీళ్ళు...!!

కామన్ అయిపోయాయ్

-నందు

ప్రేమ



ప్రేమ:
ప్రే అంటే ప్రేమించటం,
మ అంటే మర్చిపోవటం కాదు...  

ప్రేమ అంటే ప్రేమించటం
మ అంటే మర్చిపోలేనంతగా ప్రేమించటం..!!
ప్రేమ అంటే ప్రేమించటం
మ అంటే మనం ఇంకొకరిని ప్రేమించలేనంతగా ప్రేమించటం..!!!
-నందు

నేనోడిపోయా...!!!

నేనోడిపోయా,
నిన్ను గెలవటంలో..!
నన్ను నీలో వెతకటంలో..!!
గెలుస్తాననే నమ్మకం నాలో ఉంది..!
కానీ గెలుస్తానో లేదో నీ చేతిలో ఉంది..!!
-నందు

గుర్తుకురావటం-మర్చిపోకపోవటం

గుర్తుకురావటం వేరు,
మర్చిపోకపోవటం వేరు..
రెండింటికి చాల తేడా ఉంది,
చదవటంలో కాదు ఆలోచించటంలో...
-నందు

స్వీకరించే విధానం


ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు 
తన తప్పులు కూడా ఒప్పుగానే కనిపిస్తాయి...
కాని, అదే మనిషిని ద్వేషించటమో లేక 
దూరం చేయటమో మొదలు పెడితే 
తన ఒప్పులు కూడా ఒక్కోసారి తప్పుగానే కనిపిస్తాయి...
ఉన్న మంచితనం కాస్త మరుగున పడిపోతుంది
తేడా తనలో లేదు. 

మనం, తనని స్వీకరించే విధానంలో ఉంది...!!!

                                 - నందు


ప్రేమించటం అంటే

ప్రేమించటం అంటే నిన్నే కాదు,
 నీ జ్ఞాపకాల్ని  కూడా...!
జీవించటం అంటే నీతోనే కాదు 
నీ జ్ఞాపకాలతో(జ్ఞాపకాల్లో) కూడా...!!
-నందు 

బాగుండటం అంటే

బాగుండటం అంటే బాగా ఆస్తి ఉండటమో  లేక 
బాగా సంపాదించే ఉద్యోగం ఉండటమో కాదు 
అలాగని అందంగా ఉండటం  అసలే కాదు 

త్రివిక్రమ్ స్టైల్లో చెప్పాలంటే,
నలుగురితో ఉన్నపుడు నవ్వుతూ ఉండటం..  
పనిలో ఉన్నా పది మందిలో ఉన్నా పప్రశాంతంగా ఉండటం..   
కళ్ళల్లో వెలుగుండటం, పెదాలపై చిరునవ్వు రావటం 
జీవితంలో సంతోషంగా ఉండటం
ఇది బావుండటం అంటే బాగా ఉండటం 

-నందు  

నేనింతే...!!!

డిగ్రీ చేసాడు డీసెంట్ ఉంటాడు,
మందు తాగడు మౌనంగా ఉంటాడు,
సాఫ్ట్వేర్ ఇంజినీరు కద సైలెంట్ గా ఉంటాడు,
అనే బ్రమల్లోన్చి బయటికి రా ...
డీసెంట్ గా ఉన్నానంటే అర్థం గొడవ పడటం ఇష్టం లేదని,
మౌనంగా ఉన్నానంటే ఇంకా మర్యాద ఇస్తున్నానని...
నేను కామ్ గా ఉన్నానంటే తప్పు చేసానని కాదు,
తప్పులు జరగకూడదని... 
ఎప్పుడూ అలానే కాదు
ఇలా కూడా ఆలోచించు... 
నేనేవ్వరికి నా వ్యక్తిత్వం గురించి చెప్పను,
ఇది చదివి నీకేమైన అర్థం అయితే గుర్తుపెట్టుకో.

నేనింతే...! ! !
ఏడవాలనిపిస్తే ఏడుస్తా,
నవ్వాలనిపిస్తే తనివితీరా నవ్వుతా,
భాదగా ఉంటే మౌనంగా ఉంటా,

కోపం వస్తే కోపంగా ఉంటా లేదంటే అరుస్తా...
ఎందుకంటే నాలో చలనం ఉంది 
ఏ రకమైన స్పందన లేకపోవటానికి 
నేను రాయిని కాదు, 
రోబోనీ అంత కంటే కాదు...
మనిషిని..,మనసున్న మనిషిని...!
మనసు విలువ తెలిసిన మనిషిని...!!
- నందు



ప్రేమ-యుద్ధం

యుద్ధం, ప్రేమ రెండు ఒక్కటే...
యుద్ధంలో గెలిస్తే కీర్తి, గౌరవం పెరుగుతాయి
ప్రేమలో గెలిస్తే ఆనందం, సంతోషం పెరుగుతాయి
యుద్ధంలో ఓడితే రాజ్యం, పరువు పోతాయ్,
కష్టాలు పలకరిస్తాయ్, కటకటాలు వెక్కిరిస్తాయ్...
ప్రేమలో ఓడితే కన్నీళ్ళు మిగులుతాయ్.
కాని ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయ్...
యుద్ధం మనుషులతో చేసేది
ప్రేమ మనసుతో  చేసేది
నిజమే కాబోలు,
యుద్ధం, ప్రేమ రెండు ఒక్కటేనేమో...
రెండు గెలిచే వరకు చేసేవే...!
గెలవటం కొరకు పోరాడేవే...!!

                  -నందు
            02-09-15