నా మనసు మౌనంగా రోదిస్తుంది, నా గుండె తన గొంతుకను చీల్చుకుని తన మనోవేదనను తెలపటానికి తాపత్రయ పడుతుంది.
నా మనసులో మౌనంగా నిర్మించుకున్న మరో లోకమే ఈ నేను నా ఫీలింగ్స్....
మనసులో జరిగే చర్య ప్రతి చర్యల ద్వారా, ప్రకృతిలో జరిగే పరిణామాలను ఆధారంగా చేసుకుని నాకు నచ్చిన(తోచిన) విధంగా రాస్తున్నాను... నచ్చితే స్వాగతిస్తారని ఆశిస్తూ.. .నందు
ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు తన తప్పులు కూడా ఒప్పుగానే కనిపిస్తాయి... కాని, అదే మనిషిని ద్వేషించటమో లేక దూరం చేయటమో మొదలు పెడితే తన ఒప్పులు కూడా ఒక్కోసారి తప్పుగానే కనిపిస్తాయి... ఉన్న మంచితనం కాస్త మరుగున పడిపోతుంది తేడా తనలో లేదు.
0 comments:
Post a Comment