నిజమే !
తెలిసే బంధమనే ఆ చట్రంలో ఇరుక్కున్నావు,
ఇప్పుడు అనుభవిస్తున్నావు,
తప్పదు బయటికి రావాలి
కాదు కాదు దూరంగా రావాలి
ఎదుటివాళ్ళు
నువ్వు, నీ అస్థిత్వంలేని
ప్రశాంత వాతావరణాన్ని
కోరుకుంటున్నపుడు
నువ్వు మౌనంగా వెళ్లిపోవటమే ఉత్తమం.
అక్కడా తప్పు
నీదా,
వేరే వాళ్ళదా లేక
ఎవరి వల్ల తప్పు జరుగుతుందనే
విషయాలిప్పుడు అనవసరం...
నువ్వే ఒక సమస్య అయినపుడు
సమాధానం కూడా నువ్వే చెప్పాలి
ఆ సమ్యసనీ తీర్చనప్పుడు
కనీసం అసమస్యకీ
దూరంగా అయినా ఉండాలి
ఇంకెన్నాళ్లు ఇలానే ?
కొత్తగా ఏమి నేర్చుకుంటున్నట్లు ?
ప్రతి సారి ఇదే తప్పు, ఇదే గుణపాఠం !!
తప్పు చేయటం అలవాటయ్యిందా లేక ?
గుణపాఠాన్ని నీ జీవితం అలవాటు పడిందా ??
నువ్వు చెయ్యాలనుకున్నదొకటి,
అక్కడ జరిగేదింకొటి,
పరిస్థితులు పగబట్టినట్లు ప్రవర్తిస్తే
నువ్వెప్పటికీ నిన్ను నిరూపించుకోలేవు
నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన
అవసరమే లేదక్కడ
అర్థంచేసుకునే పరిస్థితులు లేనప్పుడు,
రావని తెలిసినప్పుడు
అక్కడ ఉండటమే అనవసరం...!!
నీ కోపాన్ని ఆవేశాన్ని,అన్నింటిని
మౌనంగా మడిచి
జేబులో పెట్టుకుని వెళ్ళిపో
చాలిక వెళ్ళు !!
శెలవు మిత్రమా !
-నందు.
08-03-2020