నీ పరిచయం నాలో కొత్త మార్పుని చూపింది
నేను అనుకున్న ఆశయ సాధన కోసం అడుగులు వేసేలా చేసింది
ఒంటరిగా ఉన్న నాకు ఓదార్పును పంచింది
నీ మాటలతో నా మనసు గాయాన్ని మన్పించావు
నీతో సాన్నిహిత్యం కోసం పరితపిస్తూ పరిబ్రమిస్తున్న నా మనసుని మనసులో లేకుండా చేసిన నీ అందమైన మనస్తత్వానికి మనస్పూర్తిగా సలాం చేస్తూ
నీ మాటలను మదిలో మేదిల్చుకుంటూ
జ్ఞాపకాలను గుండెల్లో పెట్టుకుని బ్రతుకుతున్న నేను
నాకంటూ అన్ని నీవే అయిన నీకు
నీకంటూ ఏమి కాని నేను
ప్రేమతో అందిస్తున్న పుట్టిన రోజు శుభాకాంక్షలు.........
-నందు
0 comments:
Post a Comment