Monday, May 16, 2011 - 3 comments

నీ కోసం...


నా శ్రవణ ధ్వని  యంత్రంలో కలిగిన అలజడి వల్ల పేరు మాత్రమే తెలిసిన నీకోసం ఊరు కూడా దాటి  వచ్చాను
వడి వడిగా అడుగులు వేస్తూ,
నానా అవస్థలు పడి,
 అతి కష్టం మీద నా ధ్వని యంత్రం పై "ముఖ పుస్తకాన్ని" అనుసంధానం చేసి
నువ్వు పంపిన సందేశాన్ని చూసి నిరాశతో వెనుదిరిగా......
                                                -నీ నందు




  

ప్రపంచంలోని ప్రతి అమ్మ కి మదర్స్ డే శుభాకాంక్షలు ....!

జాతిని జాగృత పరిచేది...
జగతిని జ్యోతియై వెలిగించేది
 సృష్టికి ప్రతి సృష్టి  చేసేది అమ్మ...!

"తన ప్రాణం ఫణంగా పెట్టి మనకు ప్రాణ ప్రతిష్ట చేస్తుంది
మన కంట్లో నలుసు పడితే మన కంటే ముందు కన్నీరు కార్చుతుంది   
తను క్రోవోత్తిలా కరిగిపోతు మన కోసం  కాంతుల్ని వెదజల్లుతుంది
 తను గంధపు చెక్కలాఅరిగిపోతు  సుగందాల్ని పంచుతుంది 
తను రాలిపోతూ పువ్వులా పరిమళాలు  పంచుతుంది
మన కోసం అన్ని చేయాలని ఆరాట పడుతుంది
ఎన్ని చేసినా ఇంక ఏదో  చేయలేదని చింతిస్తూనే ఉంటుంది."  

కష్టాలను, కన్నీళ్లను  కడుపులో దాచుకుని మనకోసం సర్వస్వం అర్పించేది అమ్మ............!

అలాంటి గొప్ప గుణం కలిగిన అమ్మలకు మనస్పూర్తిగా  నా ఈ చిన్ని కవితను అంకితం చేస్తూ....

" మదర్స్  డే శుభాకాంక్షలు" 

                                                                       -మీ నందు. 





రెండు  సంవత్శరాల  క్రితం కాలేజీ మ్యాగజిన్   కోసం నేను రాసిన ఒక చిన్న  కవిత  
Tuesday, May 03, 2011 - 4 comments

తనోచ్చింది నా జీవితంలోకి






అందమైన చీకటిలో వెన్నెల లాగ 
నిశీధిలో ఉషోదయం లాగ 
నిర్మానుష్యంగా  గా ఉన్న 
నా మనసులోకి తనోచ్చింది
మరిపిస్తూ మురిపిస్తూ 
మైమరిపిస్తూ  ఏదో మాయ చేసింది.
ఎం జరుగుతుందో తెలియదు 
కాని తను కన్పించగానే 
ఒళ్ళంతా విద్యుత్ ప్రవహిస్తుంది
తనని  చూడగానే ఏదో ప్రకంపన, 
మనసు తన వైపే లాగుతుంది, 
అదేదో గురుత్వాకర్షణ శక్తి లాగ...!
చీకట్లోకి చందమామ వచినట్లు 
తనోచ్చింది నా జీవితంలోకి...
అదేంటో చందమామ రోజు వస్తూనే ఉంది 
కాని తనే చెదిరిపోనీ 
కలగా మిగిలి పోయింది..!!

                                -నందు.
Monday, May 02, 2011 - 7 comments

ఇదంతా ప్రేమేనా.... ?

                 

ఎందుకో తెలీదు  తనతోనే మాట్లాడాలనిపిస్తుంది 
తనతో మాట్లాడితే అసలు కాలమే తెలీదు 
అలా ఎంత సేపైనా మాట్లాడాలనిపిస్తుంది
తను ఎంత తిట్టినా కోపం రాకపోగా నవ్వొస్తుంది.. 
తన కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది...
తనుంటే చాలు ఇంకేం వద్దు అన్పిస్తుంది..
ఎక్కడున్నా తనే గుర్తొస్తుంది
చేసే ప్రతి పనిలో తనే కన్పిస్తుంది
కనులు మూసినా తనే కనులు తెరిచినా తనే...
నిరంతరం తన ధ్యాసలో గడుపుతుంటే ఎంతో హాయీగా ఉంది..
ఇదంతా ప్రేమేనా ?
అవునేమో నిజమేమోననిపిస్తుంది...
                              -నందు