ఒంటరితనం ఒక భాద్యత...!!!



ఏమి వద్దనుకున్నపుడు,
అన్నింటిని వదిలేసుకోవాలనుకున్నపుడు,
అన్ని బంధాలను వద్దనుకున్నపుడు
ఒంటరిగా బ్రతకటం పెద్ద కష్టమేమి కాదు
నేను ఎవ్వరికి ఏమి కాను 
నన్ను ఎవ్వరు పట్టించుకోరు అని బాధ పడేకంటే 
నాకు ఎవ్వరు లేరు, నేనెవ్వరిని పట్టించుకోను 
అని బ్రతికితే ఒంటరితనం పెద్ద కష్టమేమి కాదు 
అది ఒక బాధ్యతలా మారుతుంది
-నందు
Tuesday, July 15, 2014 - , , 4 comments

మౌనంగా ఉంటాను,మాట్లాడాలని లేక....!!!

కొన్ని సార్లు నేను మౌనంగా ఉంటాను
మాటలు రాక కాదు మాట్లాడాలని లేక....
నా కవితలు కూడా అంతే
కవిత రాయాలంటే దేని గురించైనా రాయవచ్చు 
కాని రాయాలని లేనప్పుడు ఎంత రాసినా దానిలో భావం ఉండదు
కవిత రాయటానికి ఆలోచనోక్కటే సరిపోదు
రాయాలనే తపన మనసులోంచి పుట్టాలి
-నందు


Saturday, May 24, 2014 - , , 2 comments

"మనం"దరం చూడాల్సిన సినిమా:మనం...!!!




సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, నేనొక్కడినే తర్వాత
నేను రివ్యూ రాసిన నాలుగవ సినిమా: "మనం"

మళ్ళి మన తెలుగు చిత్ర పరిశ్రమలో..
చాలా రోజుల తర్వాత మళ్ళి ఒక మంచి సినిమా 

ఎప్పుడు రొటీన్ గా 6 పాటలు, 4 పైట్లు, అవే కథలతో కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు కూడా వస్తాయ్, ఇక ముందు కూడా కొత్త రకమైన సినిమాలను  తీయొచ్చు అని మరోసారి చాటి చెప్పిన చిత్రం "మనం"

మంచి సినిమాలు రావట్లేదు అని గగ్గోలు పెట్టే జనాలకి కనులవిందు ఈ సినిమా...!!!

తెలుగు దర్శకుల్లో ప్రతిభకి కొదవలేదు అని మరోసారి నిరూపించిన చిత్రం "మనం"...!!! 

ఆ మధ్య కాలంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది సినిమాలు బంధాలు, అనుబంధాలు అనే అంశాలపై తీసి తెలుగు ప్రజల హృదయాని దోచుకుంటే... 
చాలా రోజుల తర్వాత మళ్ళి ఒక చక్కటి కుటుంబ చిత్రం "మనం"


హంగు ఆర్భాటాలకి పోకుండా, కథని, దర్శకుడ్ని నమ్మి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందీ మనం...
అక్కినేని నాగేశ్వరరావు గారి నుండి నాగ చైతన్య వరకు,
శ్రీయ నుండి సమంతా వరకు... 
ఎవరికీ ఎవరు తగ్గకుండా పాత్రలకు రూపం పోసిన అందమైన కథాంశమే ఈ "మనం"...
అమితాబ్ బచ్చన్ గారు,అమల,అక్కినేని అఖిల్ వీళ్ళంతా మెరుపులా కనిపిస్తారు..

కాని దర్శకుడు విక్రమ్ కుమార్ కథని నడిపించిన విధానం అద్భుతం ఒక తరంని దృష్టిలో పెట్టుకుని సినిమా తీయటమే కష్టమైన ఈ రోజుల్లో మూడు తరాలను కలిపి రెండున్నర గంటల్లో ఒక అందమైన సినిమా తీసిన అతని పొగడకుండా ఉండలేం, 
మాటలు, ఫోటోగ్రఫీ, కెమెరా పనితనం, సంగీతం ఇలా అన్ని సరిగా కుదిరిన సినిమా అందమైన సినిమా "మనం"
ఖర్చుకి వెనకడుగు వేయకుండా ఎక్కడ కూడా తగ్గకుండా సినిమాని ఒక ఫ్రెష్ లుక్ లో ప్రెసెంట్ తీరు అమోఘం.. 

కథని నేను చెప్పదలుచుకోలేదు కాని చెప్పాలనుకున్నదల్లా ఒక్కటే 
"మనం" మంచి సినిమా 
కొన్ని సన్నివేశాలు హృదయాల్ని స్పృశిస్తాయి
తెలుగు చిత్ర పరిశ్ర్హమ లో "మనం" మరో మైలురాయి అవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు
అక్కినేని గారికి అశ్రునయనాలతో నివాళి అందించే అందమైన సినిమా
"మనం" మంచి ఫీల్ ఉన్న సినిమా...
కుదిరితే మీరు ఈ సినిమాని చూడండి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే కాని చూడండి ఒక మంచి సినిమా చూసామన్న సంతృప్తి మాత్రం తప్పకుండా కలుగుతుంది..

మార్పును స్వాగతించండి మంచి సినిమాలను ఆదరించండి

-ఎ రివ్యూ బై నందు. 
Thursday, May 08, 2014 - , , , 2 comments

పిచ్చోళ్ళు - గొప్పోళ్ళు

ప్రపంచంలో కేవలం రెండు రకాల మనుషులు మాత్రమే  
తమలో తాము ఎక్కువగా మాట్లాడుతుంటారు 
ఒకరు పిచ్చోళ్ళు మరొకరు గొప్పోళ్ళు 
మిగతా  వాళ్ళంతా నాసిరకమే 
- నందు 


Friday, April 25, 2014 - 4 comments

అడుక్కునే వాళ్లోస్తున్నారు జాగ్రత్త...!!!


వస్తున్నారు వస్తున్నారు అడుక్కునే వాళ్ళు
రోజుకో పార్టీ మార్చి, రాజ్యంగా సిద్ధాంతాలను పక్కకు పెట్టి,
తన స్వార్థం కోసం ఏమైనా చేయగల సిగ్గు మాలిన నాయకులు
పూటకో మాట మార్చి మనల్ని ఎమార్చేవాళ్ళు వస్తున్నారు...!!!

అది చేస్తాం, ఇది చేస్తాం, 
అవసరమైతే ప్రాణాలిస్తాం అంటారే గాని 
ఇప్పటి దాక జరిగిన ఉద్యమాలలో 
ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా
ప్రాణ త్యాగం చేశాడా ??

పదవినే త్యాగం చేయాని వాడు ప్రాణాన్ని ఎం త్యాగం చేస్తాడు ??
ఏ పదవి ఆశించని నాయకులు ఎంత మంది ఉన్నారీ స్వతంత్ర బారత దేశంలో ??
టికెట్ ఇస్తే పార్టీలో ఉండుడు లేదంటే మరోక దాంట్లోకి దూకుడు..!!!


నా వల్లే అదోచ్చింది ఇదొచ్చింది 
అంటూ బొంకే దొంగనాయ(కు)లను నిలదీసే హక్కు నీ వోటు
వృధా చేయకు నేస్తం నీ వోటు వృధా చేయకు 
తల తాకట్టు పెట్టి అయినా అది చేస్తాం ఇది చేస్తాం 
నే వాడి మాటను నమ్మకు
గుర్తుంచుకో
వాడు తాకట్టు పెట్టేది నీ నమ్మకాన్ని , 
నీ ఆత్మాభిమానాన్ని, 
మన భారత జాతి గౌరవాన్ని...!!!


ఎన్నికల్లో ఆఫిడవిట్  దాఖలు  చేసినప్పుడు
సొంత కారు కూడా ఉండదు కాని
వీళ్ళు మాత్రం ఖరీదైనా వాహనాల్లో తిరుగుతారు.
ఎవరు చేసిన పుణ్యమో  ? లేక ఎవరికీ చేసిన ప్రతిఫలమో మరి...!!!



ఆస్తి లక్షల్లో ఉందంటారు,
కోట్లు కొల్లగొట్టి తిరుగుతుంటారు....
మన బ్యాంకుల్లో అప్పుంటుంది
"అసలు" మాత్రం స్విస్ బ్యాంకుల్లో నిద్రపోతుంటుంది... !!!




ఓ ఓటరు నీ ఓటుకుంది మ్యటరు...
కొటరు కోసం నువ్వు ఆశపడకుండా ఉంటేనే బెటరు
అప్పుడే చేయగలవు నీవీ సిస్టంని మానిటరు... !!!

నీ భవిష్యత్తు వాడిచ్చే 500ల నోటులో లేదు,
నువ్వేసే ఓటుతో వచ్చే అయిదేళ్ళ ప్రభుత్వంతో నువ్ చేయించే(చేయించుకునే) పనులలో ఉంది.... 



ఓటు వేయటం కోసం అడుగు ముందుకేయ్
అడుగేయ్ అడిగి కడిగెయ్ 
నీ ఓటుతో దుమ్ము దులిపేయ్
కాని నువ్ ముందు వోటు వేయ్ 
                               
                                    -నందు