నా మనసు మౌనంగా రోదిస్తుంది, నా గుండె తన గొంతుకను చీల్చుకుని తన మనోవేదనను తెలపటానికి తాపత్రయ పడుతుంది.
నా మనసులో మౌనంగా నిర్మించుకున్న మరో లోకమే ఈ నేను నా ఫీలింగ్స్....
మనసులో జరిగే చర్య ప్రతి చర్యల ద్వారా, ప్రకృతిలో జరిగే పరిణామాలను ఆధారంగా చేసుకుని నాకు నచ్చిన(తోచిన) విధంగా రాస్తున్నాను... నచ్చితే స్వాగతిస్తారని ఆశిస్తూ.. .నందు
ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు తన తప్పులు కూడా ఒప్పుగానే కనిపిస్తాయి... కాని, అదే మనిషిని ద్వేషించటమో లేక దూరం చేయటమో మొదలు పెడితే తన ఒప్పులు కూడా ఒక్కోసారి తప్పుగానే కనిపిస్తాయి... ఉన్న మంచితనం కాస్త మరుగున పడిపోతుంది తేడా తనలో లేదు.
బాగుండటం అంటే బాగా ఆస్తి ఉండటమో లేక బాగా సంపాదించే ఉద్యోగం ఉండటమో కాదు అలాగని అందంగా ఉండటం అసలే కాదు త్రివిక్రమ్ స్టైల్లో చెప్పాలంటే, నలుగురితో ఉన్నపుడు నవ్వుతూ ఉండటం.. పనిలో ఉన్నా పది మందిలో ఉన్నా పప్రశాంతంగా ఉండటం.. కళ్ళల్లో వెలుగుండటం, పెదాలపై చిరునవ్వు రావటం జీవితంలో సంతోషంగా ఉండటం ఇది బావుండటం అంటే బాగా ఉండటం -నందు