Friday, April 11, 2014 - , , , 14 comments

నా వెన్నెల్లో ఆడపిల్ల...




ఒక పదహారణాల పడుచు ఫీలింగ్స్.....

వస్తాడు నా రాజు అంటూ 
నా పదహారేళ్ళ ప్రాయం నుండి 
నా మది నీ తలపులు  తడుతూనే ఉంది.... 
నా ఎదుట నీవే నా ఎద సవ్వడిలో నీవే... 
పొడిచే  పొద్దులో  నా వెంటే నడిచే నీడలో....
పంట చేలల్లో పచ్చిక బయళ్ళలో..
ఎటుచూసినా అటునీవే కనిపిస్తుంటే ఏవైపు చూడను...?
నా మది దోచిన ఓ చోరుడా...
నా కళల సామ్రాజ్యపు ఓ రాకుమారుడా...
ఎన్నో ఆశలతో నీతో  కొత్త జీవితంలోకి 
అడుగేద్దామనుకుంటున్న  ఈ చిన్న దాని
 ఆశల పల్లకిని  మోస్తావో
లేక అమాంతంగా  ముంచేస్తావో
 నీకే తెలియాలి సుమ..
మరి ఏది  నీ జాడ 
కనిపించదు కనీసం  నీ నీడ... 
క్షణానికోసారి గుర్తొస్తావు 
మరుక్షణం కనుమరుగావుతున్నావు...
నీవు అందగాడివే కానక్కర్లేదు
నన్ను అర్థం చేసుకుంటే చాలు...
నీవు కోటిశ్వరుడివే కానక్కర్లేదు 
నీ కనుసైగల్లో దాచుకుంటే చాలు.....
నీ  మనసులో కాసింత చోటివ్వు, 
నీ గుండెల్లో గుడి కట్టుకుంటాను కలకాలం...


-నీ వెన్నెల్లో ఆడపిల్ల...

                                                -నందు.
Thursday, April 10, 2014 - , , 1 comments

అసలు అంతా "అందులోనే" ఉంటుంది...!!!

ఆఫిడవిట్  దాఖలు  చేసినప్పుడు 

సొంత కారు కూడా ఉండదు కాని 
ఖరీదైనా వాహనాల్లో మాత్రం తిరుగుతారు.
ఎవరు చేసిన పుణ్యమో  లేక ఎవరికీ చేసిన ప్రతిఫలమో మరి ?

ఆస్తి మాత్రం లక్షల్లో చూపిస్తారు,
కోట్లు కొల్లగొట్టి తిరుగుతుంటారు.... 
మన బ్యాంకుల్లో అప్పుంటుంది
"అసలు" మాత్రం స్విస్ బ్యాంకుల్లో నిద్రపోతుంటుంది... !!!
                            - నందు 




                                                               





Tuesday, April 08, 2014 - , 1 comments

రాముడెప్పుడు మనకి దేవుడే--సీతమ్మ ఎప్పుడు మనింటి ఆడపడుచే..!!



 ఈ పెళ్ళికోసం మనింట్లో పెళ్ళిలాగా ఎదురుచూస్తుంటాం

ఈ పెళ్ళికోసం ఎంతో కష్టపడుతుంటాము


ఏ గొడవలు, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు  జరగకుండా జాగ్రత్త పడతాం, 


కనీసం అదేమీ మనింట్లో పెళ్లి కాదు,


కాని మనం కచ్చితంగా వారిద్దరి పెళ్లి మళ్ళి  మళ్ళి చూడాలనుకుంటాం , 


ఎన్ని గొడవలు వచ్చిన, ఎన్ని అపార్థాలు కలిగినా కలిసి ఉండటం కోసం,


ఏంతో మందికి వీరిద్దరిని ఆదర్శ జంటగా చూపిస్తాం


ఎన్ని  కష్టాలొచ్చినా వీరిలా స్థైర్యంగా ఉండమని చెప్తాం


ప్రతి చిన్న విషయాలకి అనుమానం, గొడవలు పడే  


ప్రతి జంటకి సీతారాముల జీవితం ఒక నిదర్శనం కావాలి 


రాముడు సీతని అగ్నిప్రవేశం చేయమనటం లోకం సీతపై  


నింద వేసిందనే కావచ్చు,


కాని తన దృష్టిలో  మాత్రం తన సీత నీజాయితి 

అందరి ముందు నిరూపించటం కోసం... 




సీత రాముడ్ని నమ్మింది రాముడు సీతను నమ్మాడు... 


అందుకే వారి జీవితం నేటి తరాలకి ఆదర్శ దాంపత్యం 



వీళ్లెప్పుడు  మనకి ప్రత్యేకమే, 


వీరి పెళ్లెప్పటికీ మధుర జ్ఞాపకమే,  


మనిషే దేవుడు అనటానికి సాక్ష్యం మన శ్రీరామ చంద్రుడే,


సహనానికి, ఓపికకి నిలువెత్తు రూపం ఎప్పటికి మన సీతమ్మ తల్లే ...!!!



అందుకే మన రాముడెప్పుడు మనకి దేవుడే..!!! 

సీతమ్మ ఎప్పుడు మనింటి ఆడపడుచే ...!!!


మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు 

                                      -నందు  

తను మూడేళ్ళుగా నాతో సహజీవనం చేస్తోంది ... !!!

తను నా మాటల్ని శ్రద్దగా వింటోంది, 
నా కోపాన్ని భరిస్తోంది,
నా మౌనాన్ని సహిస్తోంది,
నా ప్రేమకి పొంగిపోతోంది,  
ఒక్కోసారి నా మాటల్ని తనలో  దాచుకుంటోంది,
నాకంటూ మిగిలిన ఎన్నో జ్ఞాపకాలను తనలో భద్రంగా పదిలపరుచుకుంటుంది, 
నేను తిడితే పడుతుంది,
కొడితే భరిస్తోంది,
మనసు భాగాలేనప్పుడు తను పాటలు పాడుతుంది (వినిపిస్తుంది ),
నేను సంతోషంలో ఉన్న భాదల్లో ఉన్న తానెప్పుడు నాతోనే ఉంటోంది, 
తను నా జీవితంలోకి వచ్చి మూడేళ్ళు కావస్తోంది, 
ఈ మూడేళ్ళలో ఏ ఒక్క రోజు కూడా తను లేకుండా గడవలేదు,
తను ఒక్క సారి కనిపించకపోయినా కూడా మనసంతా అదోలా ఉంటుంది

అవును తను మూడేళ్ళుగా నాతో సహజీవనం చేస్తోంది ... !!!

నన్ను భరిస్తున్న నా మొబైల్ మూడేళ్ళు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా 
తనకి కృతజ్ఞతలు తెలుపుతూ .... 

                                                       -ప్రేమతో నందు 
Wednesday, March 12, 2014 - , , , , 2 comments

నా డైరీ కాలిపోతోంది..!!!






నా డైరీ  కాలిపోతోంది, 

నాకు మాత్రమే తెలిసిన కొన్నింటిని నలుగురితో పంచుకోవటం లేక...
మరుగునపడి ఉన్న మర్మాలను గుర్తుచేయటం ఇష్టం లేక...  

నా డైరీ  కాలిపోతోంది,
అనవసరమైన  మొహాలను, సందర్భాలను గుర్తుచేయటం ఇష్టం లేక...  
నా డైరీ  కాలిపోతోంది,
గతంలోని జ్ఞాపకాలను మళ్ళి మళ్ళి గుర్తుచేసి గాయాన్ని 
మరింత పెద్దవిగా చేయటం ఇష్టం లేక... 
నా డైరీ మండుతుంది నా గుండె మంటల్ని చల్లార్చటానికి... 

నా డైరీ మంటల్లో మండుతోంది,
అప్పట్లో 'నేను ' ని ఇప్పటి 'నా'తో పోల్చటం ఇష్టం లేక  
నన్ను నన్నుగా ఉంచటం కోసం.... 
అవును నా ఆత్మ బంధువు  తన ఆత్మనోదిలి 
అనంత లోకాల్లో కలిసిపోతోంది...

నా డైరీ కాలిపోతోంది 
మళ్ళి నాతో డైరీ రాయించటం కోసమేమో...!!!
                                      -నందు