Tuesday, October 02, 2012 - , 1 comments

గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

రవి అస్తమించని బ్రిటిష్  సామ్రాజ్యంలో దారే తెలియని చీకటిలో ఉన్న మన బారత దేశాన్ని తానే 
వెలుగై ఒక దిక్కును చూపి సత్యం అహింసా అనే అస్త్రాలతో ఆంగ్లేయుల గుండెల్లో గుబులు పుట్టించిన ఓ మహాత్మ....

మీ చల్లని దీవెన మాకివ్వు..!!
మీ దారిలో నడిచే బలమివ్వు...!!!
 మీకు మా తెలుగు వారి తరపున ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు. 

                                                                         -నందు.





Thursday, September 27, 2012 - , 1 comments

నీ రూపం

కళ్ళల్లో  అమాయకత్వం 
గుండెల్లో గడుసుదనం....
అన్ని కలగలిసిన నిండిన తెలుగుదనం....
కుర్రకారుకి గుండెల్లో కలవరం....

అచ్చమైన పదహారణాల పడచుధనానికి 
నీ రూపమే నిలువెత్తు  నిదర్శనం. 
                            -నందు



Tuesday, September 18, 2012 - 0 comments

నువ్వు ఒక్క క్షణం దగ్గరుంటే తెలిసింది "కాలం "విలువ 
నువ్వు దూరం అయితే తెలిసింది " కన్నీటి " విలువ 
నీ తేనె మనసుకు తెలియలేదా .. "నా తీపి బాధ " 
నీ ఆలోచనలతో గడుపుతున్నా నా "భాద" ఎప్పటికైనా తెల్సుకుంటావని

Thursday, September 13, 2012 - 0 comments

ఏమి చేయను


ఏ వైపు చూసిన నీ రూపే కనిపిస్తూవుంటే
 నేను తీసుకునె ప్రతిశ్వాసకీ నీవే గుర్తస్తుంటే 
 క్షణ క్షణం నా నీడల నన్ను వెంటాడిస్తుంటే 
ప్రతి రాత్రి కలగా వచ్చి నన్ను కవ్విస్తుంటే
 ఏమి చేయను నేస్తమా....!

ప్రియా ఏంటి నీ మాయ....?

ప్రేమంటే ఏంటో తెలియకుండానే ప్రేమించాను
మనసంటే ఏంటో పూర్తిగా తెలియకుండానే మనసిచ్చేసాను
కాని నేనంటే ఏంటో నాకు తెలిసి కూడా నాలా  నేను ఉండలేకపోతున్నాను
ప్రియా ఏంటి నీ మాయ....?
                                 
                                        -నందు