Friday, December 16, 2011 - , 11 comments

నేస్తమా నీ చిరునామా ఎందుకు ?

నా కంటి నిండా నీవే అయినప్పుడు 
మెరిసే అద్దం లో నీ ప్రతి బింబం ఎందుకు ?
 తలచిన ప్రతి తలపు నీవే అయినప్పుడు 
తలుపు తట్టేందుకు నీ ఇంటి నెంబర్ ఎందుకు ?
జీవనయానంలో వేగుచుక్క నీవైనప్పుడు 
కిందా మీద  లోకంలో ఎనిమిది దిక్కులెందుకు  ?
ఓటమి ఎరుగని నా లక్కి  నెంబర్ నీవైనప్పుడు 
కోడ్ నంబర్ తో  సహా నీ ఫోన్ నెంబర్ ఎందుకు ?
ఒక్క మాటలో చెప్పాలంటే నా ఎద నిండా నీవే అయినప్పుడు 
నేస్తమా నీ చిరునామా  ఎందుకు  ?

Thursday, December 01, 2011 - , 23 comments

నా ప్రేమ కథ ...




                       అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆ రోజు సెప్టెంబర్ 9  నేను ఆఫీసు పని మీద ముంభై వెళ్తున్నాను నేనెప్పుడు రైలు ప్రయాణం చేసినా  నాకు  ఏదో సందర్భం గుర్తుంటుంది కాని ఈ  ప్రయాణం మాత్రం నా జీవితంలో తీపి జ్ఞాపకంగా మిగిలి పోతుందనుకోలేదు, అంతగా ప్రభావితం  చేసినా ఆ సంఘటనను మర్చిపోలేను కూడా....
                             
                               ఎప్పటి లాగానే స్టేషన్ అంత రద్ధిగానే ఉంది, ట్రైన్  కోసం ఎదురు చూస్తున్న నాకు సమయం గడవటం భారంగా అనిపిచింది. అలా  ట్రైన్ కోసం ఎదురు చూసి విసుగు పుట్టి అలా అలా  పచార్లు చేస్తున్న సమయం లో నాకెదురుగా  ఉన్న ఫ్లాట్ఫారం పై కన్పించింది  తను, అంతే తనని చూడగానే ఒక్క సరిగా స్పృహ కోల్పోయినట్లనిపించింది..అప్పటి వరకు రద్దిగా కన్పించిన రైల్వే స్టేషన్  కాస్త తనని చూడగానే నిర్మానుష్యంగా మారిపోయింది...తను తప్ప ఇంకేమి కనిపించలేదు నాకు,
అల్లంత దూరంలో  అటు వైపు తను, తనని చూస్తూ నేను, కళ్ళు మూస్తే ఎక్కడ మిస్ ఆవుతుందొనని  కళ్ళార్పకుండా అలాగే చూస్తున్నాను, అలా ఎంత సేపు చూస్తున్నానో తెలియదు, ఉన్నట్లుండి తనలో  ఏదో కదలిక అది కూడా నా వైపే...
                                
                                      అప్పుడు మొదల్లైంది నాలో అలజడి....! తను నన్ను సమీపిస్తున్న కొద్ది గుండె తీవ్రత పెరిగి పోతుంది, గుండె కవాటాలు పేలిపోతాయేమోనన్నంత  భారంగా మారింది. సాధారణంగా గుండె నిముషానికి 72 సార్లు కొట్టుకోవటం విన్నాను కాని తొలిసారి 720 సార్లు   కొట్టుకోవటం నా చెవులారా  విన్నాను, తను నన్ను చూస్తూ దాటుకుంటూ వెళ్లిపోయింది చూపులతో మాయే చేసిందో లేక మంత్రమే వేసిందో తెలీదు  కాని అదేదో సినిమాల్లోలాగా నాలోని మరో నేను తన వెంటే తన నీడ లాగ వెళ్తుంది... తను నా నుండి వెళ్తోంది  దూరంగా, అలాగే నాలోని మరో నేను తన  వెంటే పరుగు తీస్తుంది  భారంగా....

                               నేను మాత్రం అక్కడే నిర్జీవంగా నిస్సత్తువతో  నిల్చుని తను వెళ్ళిన దారినే చూస్తుండిపోయాను, ఆ "మాయా " లోకం నుండి రావటానికి చాలా  సమయం పట్టింది,అంత లోపు నా ట్రైను కూడా నన్ను ఒంటరిని చేసి వెళ్లి పోయింది... ఎలాగోలా కష్టపడి ముంబై  చేరుకున్నాను, కాని  ధ్యాసంతా తన పైనే, మనసు మనసులో లేదు, అక్కడి నుండి  వచ్చాక కూడా అంతే ఎ మాత్రం మార్పు  లేదు..అంత కొత్తగా  వింతగా  విచిత్రంగా కన్పిస్తున్న్నాయి , పెన్ను పట్టి పదాలు సరిగా రాయలేని నేను తొలిసారి తన బొమ్మ గీసాను అచ్చం తన లాగే మల్లి గీసాను, మల్లి గీసాను, గీసిన ప్రతి సారి తన అందమైన చిరునవ్వే  ఉట్టి పడుతుంది.రోజులు గడుస్తున్నాయి కాని తను మాత్రం  మళ్ళి కన్పించలేదు, కన్పిస్తున్నదల్లా  తన ముఖం  నా మనసులో జ్ఞాపకాలు నా గుండెల్లో... తనని  చూసింది కొద్ది క్షణాలే కాని ప్రతి క్షణం తను నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది   తనతో సాన్నిహిత్యం కోసం నా మనసు పరితపిస్తూ  పరిబ్రమించిపోతోంది.


 ప్రేమలో పడితే ఇంతేనేమో....!  

                           అనుకోకుండానో యాదృచ్చికంగానో తెలీదు కాని సరిగ్గా రెండు సంవత్సరాల తరువాత  నా జీవితం లో గొప్ప మలుపు. ఆ రోజు నేను బలవంతంగా అ ఇష్టంగా నేనొక చోటికి వెళ్ళాను, నేనారోజు ఆ చోటికి వేళ్ళకుండా ఉండి ఉంటే మళ్ళి నేను తనని చూసే వాడిని కాదేమో, అలాగే  మళ్ళి  నాలోని మరో  నేనును నాలో మిళితం చేసుకునే వాడిని కాదేమో...
నిజంగా నేనక్కడికి వెళ్ళకుండా ఉండి ఉంటే నా జీవితాన్నే కోల్పోయేవాడ్నేమో....! 
అటువంటి మరపురాని, మరచిపోలేని  మలుపది. సర్వం కోల్పోయినా సునామి భాదితుడిలా బ్రతుకుతున్న నాకు ఎడారిలో ఒయాసిస్సులా మళ్ళి తను కన్పించింది... 


అవును  నేను మళ్లీ తనని చూసాను అది కూడా నాకు అతి దగ్గరగా అందంగా ముస్తాబై  కూర్చొని  ఉన్న పెళ్లి కూతురి స్థానంలో...,
 నా పెళ్లి చూపుల్లో......


                                                      -నందు 



Monday, November 28, 2011 - , 2 comments

జగమెరిగిన సత్యం

ప్రేమ గురించి నేనెప్పుడు రాయటం మొదలెట్టిన  అది రెండు మనసుల మద్య జరిగే  మదురమైన  చర్యగా భావించేవాడ్ని కాని ఈ ప్రేమ పుట్టటానికి ఎంత బలమైన కారణం ఉంటుందో విడిపోవటానికి అంతే బలీయమైన కారణం ఉంటుందని ఈ మద్య నేను ఊహించని నిజం....  
Tuesday, November 22, 2011 - , 2 comments

ఓ ప్రేమ...ఏముంది నీలో ?



ప్రేమ... ప్రేమ... ప్రేమ...
అసలు ఎవరు నీవు ?
ఏముంది నీలో ?
నీవేమైన రూపానివా మరి కనిపించవెందుకో ?
మరి ఎందుకు ఈ భూప్రపంచమంతా  నీ చుట్టే తిరుగుతుంది ?

నీవేమైన బందానివా, అనుబందానివా ?
ప్రతి రోజు నీ నా స్మరణే చేస్తుంటాము ఎందుకని ?
నీ ప్రేమలో ఐన్ స్టీన్ కి   అందని శక్తి  ఉందా ?
నీలో గెలీలియో గాలలకి కూడా అందని గాడత  ఉందా ?
 అణువులు ,పరమాణువుల సమ్మేళనం లో 
కంటికి కూడా కనిపించని కణాల మిళితంలో  
అన్ని రకాల భావనలను,
మనసుని కూడా మనుసులో ఇముడ్చుకున్న 
ఆదునిక యుగపు మరయంత్రానివా ?
మరి ఏముంది నీలో ?
 ఎందుకింత ఆరాటం  ?

p.s:
ప్రేమ సమాదానం: నాలో అంతులేని,అంతంలేని ప్రేముంది కాబట్టే దాన్ని అందుకోటానికి  మీ ఆరాటం 

                                                -నందు 

Thursday, October 27, 2011 - , 5 comments

నిజమేమో...

రెండు మనసుల  మద్య మనస్పర్ధలు రావటానికి,
 రెండు  దేశాల మద్య  విబేధాలు రావటానికి 
పెద్ద పెద్ద గొడవలు, చిన్న చిన్న యుద్దాలు జరగనక్కర్లేదేమో...
వారి మద్య ఏకాభిప్రాయం కుదరకపోయినా చాలేమో....

                                                -నందు