జ్ఞాపకాలతో బ్రతికేస్తాం

బతికునప్పుడు మాటల్తో చంపుకుంటాం
చచ్చాక జ్ఞాపకాలతో బ్రతికేస్తాం
-న💚దు

మధ్య రాత్రి కలలు..!!

కొన్ని పరిచయాలు,
కొన్ని బంధాలు,
మద్య రాత్రి గాఢ నిద్రలో
వచ్చే కలల్లగా ఉంటాయి
ఎక్కడ మొదలయ్యాయో గుర్తుండవు,
ఎందుకు ఆగిపోతాయో తెలియవు,
కానీ కలల్లాగే
కొన్నెప్పుడు 
వెంటాడుతూనే ఉంటాయి..!
ఇంకొన్ని మాత్రం 
జ్ఞాపకాల్ని వదిలేసి వెళ్తాయి..!!
- దు





దూరంగా - దగ్గరగా

నువ్వు దూరంగా ఉన్నప్పుడు  
నీ విలువ తెలిసిరాకపోతే 
నువ్వు దగ్గరగా ఉన్నా కూడా 
ఏమి ప్రయోజనం ఉండదు..!
-న💚దు

ప్రజల కోసం నిలబడే వాడే రాజు ..!!


మన రాజ్యం మనకి కావాలని 
అందరం కలిసి కొట్లాడినం
మన రాజు మనకుండాలని 
మనొడినే రాజుని చేసినం
రాజ్య పాలన పక్కగా 
ఉంటదని సంబురపడ్డం 
మన రాజ్యం మనకొచ్చింది
మన రాజే మనల్ని ఏలుతుండు
పరిపాలనేమో పక్క దారి పట్టింది....

రాజ్యపాలన కాస్త రాజకీయ పాలన అయ్యింది
ఆనాడు ప్రాణాలకి తెగించి కొట్లాడిన 
ఎంతో మంది వీరులు నేడు
నీడ కూడా లేకుండా పోయారు
రాజేమో దర్బార్లోచి బయటికి రాడు.!
సేనాధిపతి, మంత్రులేమో 
చిడతలు వాహించటం మానరు.!!
బంధువులకు, రాబందులకు దోచిపెట్టటానికా 
రాజ్యం కోసం యుద్దాలు, ప్రాణ త్యాగాలు చేసింది ??

రాజంటే యుద్దాలు చేయటం, గెలవడమే కాదు
గెలిచిన రాజ్యం, ప్రజల కోసం నిలబడగలగాలి కూడా..!!
చరిత్రలో ఎంతో మంది రాజులున్నారు,
ఎంత గొప్ప రాజైనా గర్వం తలకెక్కిన ప్రతిసారి
స్మశాన్నాళ్లో జ్ఞాపకాలుగానే మిగిలిపోయారు
 కానీ ప్రజల గుండెల్లో మాత్రం కాదు
ఇది చరిత్ర కాదనలేని సత్యం..!!!
- 💚దు


సరే వెళ్ళు !!


సరే వెళ్ళు !!
వచ్చిపోయే 'వాన'లా నువ్వుంటే
ఎదురుచూసే 'నేల'లా నేనుంటా..!!
- న♥️దు

సమాధానం తెలిసిన ప్రశ్న !!


సమాధానం తెలియనప్పుడు 
మనం ఎన్ని సార్లు ప్రశ్నించినా, 
వెతికినా అర్ధముంటుంది...
కానీ సమాధానం ఇదే 
అని తెలిసినప్పుడు 
ఆ ప్రశ్న గురించి 
ఆలోచింకేకపోవటమే మంచిది..!!
సమాధానం తెలిసినా కూడా 
అదే ఆలోచిస్తున్నామంటే 
మన కంటే మూర్ఖులు 
ఇంకెవ్వరు ఉండకపోవచ్చు 
- నందు

బ్రతికున్నప్పుడు లేని బంధాలు


బ్రతికున్నప్పుడు ఒకరి మొహం
ఒకరు చూసుకోలేనంతగా బ్రతికి ,
పలకరిస్తే మొహం తిప్పుకుని తిరిగి,
చచ్చాక మాత్రం చివరి చూపులకి 
ఆరాటపడటం ఎందుకు ??

తన ఆత్మ శాంతించదనా ?
లేక నీ అంతరాత్మ సంతృప్తి చెందదనా ??
బ్రతికున్నప్పుడు లేని బంధాలు
చచ్చాక మాత్రం ఎందుకు ??
- ☹️దు

అమ్మలింతే పిచ్చోళ్లు !

అమ్మ:
అమ్మలింతే పిచ్చోళ్లు !
పిల్లలు అల్లరి చేస్తే 
లాగిపెట్టి ఒక్కటిస్తారు
ఏడ్వడం మొదలుపెట్టే లోపే 
దగ్గరకి లాక్కుని లాలిస్తారు.
పిల్లల్ని ప్రేమించటానికి మించిన 
వ్యాపకం మరోకటి ఉండదేమో !!
- 💚దు
01.11.2019.

రియాలిటీ చెక్

రియాలిటీ చెక్:
1.'కొన్నిసార్లు' మనుషులకంటే
వస్తువులకే విలువివ్వాలి !!
ఎందుకంటే
వర్షంలో నువ్వు తడిస్తే వచ్చే
జలుబుకయ్యే ఖర్చుకంటే
నీ కంపెనీ ఇచ్చిన లాప్టాప్ తడిస్తే
అయ్యే ఖర్చే ఎక్కువ.!!

2. చిన్నప్పుడు తమ పిల్లల్ని
శ్రీ కృషుడి వేషాల్లో చూసి
మురిసిపోతారు.!
అదే పెద్దయ్యాక కృషుడి
వేషాలు వేస్తే
తోలు తీస్తారు..!!

-నందు
 

దెబ్బతిన్న శిథిలాలు..!!



దెబ్బతిని మిగిలిపోయిన 
శిథిలాల కింద 
ఏ జీవం ఉండదు, 
కొన్ని జ్ఞాపకాలు మాత్రమే ఉంటాయి
గత చరిత్రను 
గుర్తుచేయటానికి
భావితరాలను 
జాగురూక పరచటానికి
-నందు