ప్రజల కోసం నిలబడే వాడే రాజు ..!!


మన రాజ్యం మనకి కావాలని 
అందరం కలిసి కొట్లాడినం
మన రాజు మనకుండాలని 
మనొడినే రాజుని చేసినం
రాజ్య పాలన పక్కగా 
ఉంటదని సంబురపడ్డం 
మన రాజ్యం మనకొచ్చింది
మన రాజే మనల్ని ఏలుతుండు
పరిపాలనేమో పక్క దారి పట్టింది....

రాజ్యపాలన కాస్త రాజకీయ పాలన అయ్యింది
ఆనాడు ప్రాణాలకి తెగించి కొట్లాడిన 
ఎంతో మంది వీరులు నేడు
నీడ కూడా లేకుండా పోయారు
రాజేమో దర్బార్లోచి బయటికి రాడు.!
సేనాధిపతి, మంత్రులేమో 
చిడతలు వాహించటం మానరు.!!
బంధువులకు, రాబందులకు దోచిపెట్టటానికా 
రాజ్యం కోసం యుద్దాలు, ప్రాణ త్యాగాలు చేసింది ??

రాజంటే యుద్దాలు చేయటం, గెలవడమే కాదు
గెలిచిన రాజ్యం, ప్రజల కోసం నిలబడగలగాలి కూడా..!!
చరిత్రలో ఎంతో మంది రాజులున్నారు,
ఎంత గొప్ప రాజైనా గర్వం తలకెక్కిన ప్రతిసారి
స్మశాన్నాళ్లో జ్ఞాపకాలుగానే మిగిలిపోయారు
 కానీ ప్రజల గుండెల్లో మాత్రం కాదు
ఇది చరిత్ర కాదనలేని సత్యం..!!!
- 💚దు