సుఖసంతోషాలు


పుట్టినప్పటి నుండే సుఖాలకి అలవాటు పడిన 
ఈ జనరేషన్ పిల్లలకి ఎలా సుఖపడాలో తెలుసు, 
కానీ సంతోషం అంటే ఏమిటో ఇప్పటికీ 
చాలా వరకి చాలా మందికి అర్థం కాదు... 
కానీ దురదృష్టం ఏంటంటే 
తల్లిదండ్రులు కూడా ఈ సంబంధం 
చేసుకుంటే అమ్మాయి/అబ్బాయి 
జీవితంలో సుఖపడతారని ఆలోచిస్తున్నారే తప్ప 
జీవితాంతం సంతోషంగా ఉండగలరా అని 
ఒక్కసారి కూడా ఆలోచించటం లేదు..
సుఖానికి సంతోషానికి చాలా తేడా ఉందిరాబ్బయ్...

-నందు
03/03/2016

కాదేది కవితకు అన్హరం..!!


బండికి గీతలు,

మొహానికి ముడతలు...!!

సముద్రంలో నీళ్ళు,

మనిషి కంట్లో కన్నీళ్ళు...!!

కామన్ అయిపోయాయ్

-నందు

ప్రేమ



ప్రేమ:
ప్రే అంటే ప్రేమించటం,
మ అంటే మర్చిపోవటం కాదు...  

ప్రేమ అంటే ప్రేమించటం
మ అంటే మర్చిపోలేనంతగా ప్రేమించటం..!!
ప్రేమ అంటే ప్రేమించటం
మ అంటే మనం ఇంకొకరిని ప్రేమించలేనంతగా ప్రేమించటం..!!!
-నందు

నేనోడిపోయా...!!!

నేనోడిపోయా,
నిన్ను గెలవటంలో..!
నన్ను నీలో వెతకటంలో..!!
గెలుస్తాననే నమ్మకం నాలో ఉంది..!
కానీ గెలుస్తానో లేదో నీ చేతిలో ఉంది..!!
-నందు

గుర్తుకురావటం-మర్చిపోకపోవటం

గుర్తుకురావటం వేరు,
మర్చిపోకపోవటం వేరు..
రెండింటికి చాల తేడా ఉంది,
చదవటంలో కాదు ఆలోచించటంలో...
-నందు
Tuesday, January 12, 2016 - 1 comments

గతాలు-జ్ఞాపకాలు


మర్చిపోయేవన్ని గతాలు కావు
గుర్తున్నవన్ని జ్ఞాపకాలు కావు
మర్చిపోకుండా చేసేవే జ్ఞాపకాలు
గుర్తుకు తెచ్చుకుందామని ప్రయత్నించినా 
గుర్తుకురానివే గతాలు..!!!
-నందు



స్వీకరించే విధానం


ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు 
తన తప్పులు కూడా ఒప్పుగానే కనిపిస్తాయి...
కాని, అదే మనిషిని ద్వేషించటమో లేక 
దూరం చేయటమో మొదలు పెడితే 
తన ఒప్పులు కూడా ఒక్కోసారి తప్పుగానే కనిపిస్తాయి...
ఉన్న మంచితనం కాస్త మరుగున పడిపోతుంది
తేడా తనలో లేదు. 

మనం, తనని స్వీకరించే విధానంలో ఉంది...!!!

                                 - నందు


ప్రేమించటం అంటే

ప్రేమించటం అంటే నిన్నే కాదు,
 నీ జ్ఞాపకాల్ని  కూడా...!
జీవించటం అంటే నీతోనే కాదు 
నీ జ్ఞాపకాలతో(జ్ఞాపకాల్లో) కూడా...!!
-నందు 

బాగుండటం అంటే

బాగుండటం అంటే బాగా ఆస్తి ఉండటమో  లేక 
బాగా సంపాదించే ఉద్యోగం ఉండటమో కాదు 
అలాగని అందంగా ఉండటం  అసలే కాదు 

త్రివిక్రమ్ స్టైల్లో చెప్పాలంటే,
నలుగురితో ఉన్నపుడు నవ్వుతూ ఉండటం..  
పనిలో ఉన్నా పది మందిలో ఉన్నా పప్రశాంతంగా ఉండటం..   
కళ్ళల్లో వెలుగుండటం, పెదాలపై చిరునవ్వు రావటం 
జీవితంలో సంతోషంగా ఉండటం
ఇది బావుండటం అంటే బాగా ఉండటం 

-నందు  

నేనింతే...!!!

డిగ్రీ చేసాడు డీసెంట్ ఉంటాడు,
మందు తాగడు మౌనంగా ఉంటాడు,
సాఫ్ట్వేర్ ఇంజినీరు కద సైలెంట్ గా ఉంటాడు,
అనే బ్రమల్లోన్చి బయటికి రా ...
డీసెంట్ గా ఉన్నానంటే అర్థం గొడవ పడటం ఇష్టం లేదని,
మౌనంగా ఉన్నానంటే ఇంకా మర్యాద ఇస్తున్నానని...
నేను కామ్ గా ఉన్నానంటే తప్పు చేసానని కాదు,
తప్పులు జరగకూడదని... 
ఎప్పుడూ అలానే కాదు
ఇలా కూడా ఆలోచించు... 
నేనేవ్వరికి నా వ్యక్తిత్వం గురించి చెప్పను,
ఇది చదివి నీకేమైన అర్థం అయితే గుర్తుపెట్టుకో.

నేనింతే...! ! !
ఏడవాలనిపిస్తే ఏడుస్తా,
నవ్వాలనిపిస్తే తనివితీరా నవ్వుతా,
భాదగా ఉంటే మౌనంగా ఉంటా,

కోపం వస్తే కోపంగా ఉంటా లేదంటే అరుస్తా...
ఎందుకంటే నాలో చలనం ఉంది 
ఏ రకమైన స్పందన లేకపోవటానికి 
నేను రాయిని కాదు, 
రోబోనీ అంత కంటే కాదు...
మనిషిని..,మనసున్న మనిషిని...!
మనసు విలువ తెలిసిన మనిషిని...!!
- నందు